తెలంగాణ

telangana

మేడిగడ్డ ఘటన - బ్యారేజీ పూర్తవకుండానే పూర్తయినట్లు సర్టిఫికెట్‌ - MEDIGADDA BARRAGE ISSUE

By ETV Bharat Telangana Team

Published : Apr 20, 2024, 1:47 PM IST

Medigadda Certificate Issue : మేడిగడ్డ పూర్తవకుండానే పూర్తయినట్లు ఇంజినీర్లు గుత్తేదారుకు సర్టిఫికెట్‌ ఇచ్చారు. అయితే ఇది పొరపాటుగా జరిగిందని భావించాలని వారు కోరారు. ఈ మేరకు ప్రాజెక్టు చీఫ్‌ ఇంజినీర్‌ నీటిపారుదల శాఖకు నివేదించారు.

Medigadda Barrage Damage Updates
Medigadda Barrage Damage Updates

Medigadda Barrage Certificate Issue : మేడిగడ్డ ఆనకట్ట నిర్మాణం పూర్తి కాకుండానే, అయినట్లుగా సంబంధిత ఇంజినీర్లు గుత్తేదారుకు సర్టిఫికెట్‌ ఇచ్చినట్లు ప్రాజెక్టు చీఫ్‌ ఇంజినీర్‌ నీటిపారుదల శాఖకు నివేదించారు. దీనిని పొరపాటుగా భావించాలని సంబంధిత ఇంజినీర్లు వివరణ ఇచ్చారని సీఈ రాసిన లేఖలో పేర్కొన్నట్లు తెలిసింది. మేడిగడ్డ బ్యారేజీ కుంగినా, ఆనకట్టల ప్రారంభం జరిగిన కొద్ది కాలానికే సీపేజీ సమస్య వచ్చినా చర్యకు ఉపక్రమించని నీటిపారుదల శాఖ విజిలెన్స్‌ నివేదికతో స్పందించింది.

Medigadda Damage Updates :మేడిగడ్డ ఆనకట్టపై ఫిబ్రవరి 13న విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ముఖ్యమంత్రి సమక్షంలో ప్రజంటేషన్‌ ఇచ్చిందని గత నెలలో నీటిపారుదల శాఖ ఈఎన్సీ (జనరల్‌), కాళేశ్వరం ప్రాజెక్టు చీఫ్‌ ఇంజినీర్‌(రామగుండం)కు లేఖ రాశారు. ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌తో సహా పలు వైఫల్యాలను సీఎం ఎత్తి చూపారని తెలిపారు. 2019-20లోనే నిర్వహణ సమస్యలు తలెత్తి సీసీ బ్లాకులు పక్కకు వెళ్లిపోయాయని చెప్పారు. 2019 నవంబర్‌లోనే గుర్తించిన సమస్యను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయడంతో సమస్యలు తలెత్తాయని లేఖలో పేర్కొన్నారు.

మేడిగడ్డ నిర్మాణం లోపాలమయం - అనుసరించాల్సిన మెథడాలజీకి విరుద్ధంగా ఆనకట్ట పనులు - NDSA Committee On Kaleshwaram

గుత్తేదారుకు ఒకవైపు గడువు పొడిగిస్తూ, ఇంకోవైపు ఆ గడువులోగానే నిర్మాణం పూర్తయినట్లు సర్టిఫికెట్‌ ఇచ్చారని విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విచారణలో వెల్లడైందని లేఖలో తెలిపారు. దీనిపై ఇంజినీర్లకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసి వివరణ కోరాలని, సమస్య తీవ్రత దృష్ట్యా వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని నీటిపారుదల శాఖ ఈఎన్సీ (జనరల్‌), కాళేశ్వరం ప్రాజెక్టు చీఫ్‌ ఇంజినీర్‌(రామగుండం)కు లేఖలో వివరించారు.

మేడిగడ్డ ఘటనపై విజిలెన్స్ దర్యాప్తు - 3 కేసులు నమోదు చేయాలని ప్రభుత్వానికి సిఫార్సు!

గత నెలలో రాసిన ఈ లేఖకు రెండు రోజుల క్రితం సీఈ, నీటిపారుదలశాఖ ఈఎన్సీకి లేఖ రాశారు. ఒప్పందం ప్రకారం పని పూర్తి కాలేదని, ఇంకా చేయాల్సి ఉందని తెలిపారు. అనుభవ సర్టిఫికెట్‌ బదులు పూర్తయినట్లు పొరపాటున ధ్రువీకరణ పత్రం ఇచ్చామని సంబంధిత ఇంజినీర్లు తెలియజేశారని అందులో పేర్కొన్నట్లు తెలిసింది. సర్టిఫికెట్‌ను ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ ఇవ్వగా, ఎస్‌ఈ కౌంటర్‌ సంతకం చేశారు. సీఈ లేఖపై నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులను సంప్రదించగా రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

Kaleshwaram Barrage Temporary Repairs :మరోవైపు కాళేశ్వరం ఆనకట్టల తాత్కాలిక మరమ్మతులపై నీటిపారుదల శాఖ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా వర్షాకాలంలో నీటిని నిల్వ చేయడానికి వీలుగా పనులు చేపట్టాలని గుత్తేదారు సంస్థలకు సూచనలు చేసింది. కానీ వారు ఏయే పనులు చేయాలి, ధరలు ఎంత అని నీటిపారుదల శాఖను ప్రశ్నించినట్లు తెలిసింది.

బ్యారేజీల నిర్మాణ స్థలాన్ని మార్చాల్సిన అవసరం ఏముంది? - అధికారులపై ఎన్​డీఎస్​ఏ కమిటీ ప్రశ్నల వర్షం

క్షుణ్నంగా పరిశీలిస్తూ, కొలతలు తీస్తూ, కారణాలు అన్వేషిస్తూ - మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించిన ఎన్డీఎస్​ఏ నిపుణులు

ABOUT THE AUTHOR

...view details