తెలంగాణ

telangana

వెస్ట్‌ ఫేస్ ఇంట్లో ఈ వాస్తు టిప్స్ తప్పక పాటించాలట! - అవేంటో మీకు తెలుసా?

By ETV Bharat Telugu Team

Published : Mar 20, 2024, 9:56 AM IST

Vastu Tips for West Facing House : పడమర దిశలో ఉండే ఇంటిని లేదా స్థలాన్ని కొనుగోలు చేయడం మంచిది కాదని చాలా మంది భావిస్తారు. కొందరు అనివార్యంగా అదే ఇంట్లో ఉండాల్సి వస్తుంది. ఇలాంటి వారు.. కొన్ని వాస్తు సూచనలు పాటించడం ద్వారా నెగటివ్‌ ఎనర్జీని దూరం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

Vastu Tips for West Facing House
Vastu Tips for West Facing House

Vastu Tips for West Facing House : వాస్తు ప్రకారం.. తూర్పు ఫేసింగ్ లేదా ఉత్తర దిశలో ముఖద్వారం ఉన్న ఇల్లు మంచిదని చాలా మంది భావిస్తారు. పడమర, దక్షిణ దిశలో ఉన్న ఇంటిని, ఇంటి స్థలాన్ని కొనుగోలు చేయడానికి జనాలు ఆసక్తి చూపించరు. కానీ.. వాస్తు శాస్త్రం ప్రకారం ఇల్లు ఏ దిశలో ఉన్నా కూడా మంచిదే అని నిపుణులు చెబుతున్నారు. ఈ సృష్టిలో అన్ని దిక్కులకూ సమప్రాధాన్యత ఉంటుందని తెలియజేస్తున్నారు. అయితే.. వెస్ట్ ఫేసింగ్ (పడమర దిశ ) కలిగిన ఇంటిని నిర్మించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. దీనివల్ల దోషాలన్నీ తొలగిపోతాయని సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

మెయిన్ గేట్ ఇలా ఉండాలి :మీ ఇళ్లు పడమర దిశలో ఉంటే.. ఇంటి ఆవరణలోకి ప్రవేశించే మెయిన్ గేట్ వాయవ్య లేదా పశ్చిమ దిశలో ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లనూ ప్రవేశద్వారం నైరుతి దిశలో ఉండకూడదని నిపుణులు సూచిస్తున్నారు.

చెట్లు నాటండి :మీ ఇంటి మెయిన్ గేట్ ముందు ఖాళీ స్థలం ఉంటే.. దానికి ఇరువైపులా చెట్లు నాటాలని సూచిస్తున్నారు. ఇది వాస్తు దోషాన్ని నివారిస్తుందని.. ఇంకా ఎండవేడి నుంచి కూడా రక్షించుకోవచ్చని సూచిస్తున్నారు.

పెద్ద అద్దాల డిజైన్‌లు వద్దు :ఇళ్లు పడమర దిశలో ఉండేవారు ఇంటిని నిర్మించేటప్పుడు పెద్దపెద్ద అద్దాలను బిగించకండి. దీనివల్ల ఇంట్లోకి వేడి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందట. ఇది ఇంటి ఆహ్లాదకర వాతావరణాన్ని దెబ్బతీస్తుందని సూచిస్తున్నారు.

లివింగ్ రూమ్ :వెస్ట్‌ ఫేసింగ్‌ ఇళ్లు ఉండే వారు లివింగ్‌ రూమ్‌ను వాయువ్యంలో ఏర్పాటు చేసుకోవడం మంచిదని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. అలాగే.. లివింగ్‌ రూమ్‌ను తూర్పు, ఉత్తరం లేదా ఈశాన్యం వైపున కూడా ఏర్పాటు చేసుకోవచ్చని చెబుతున్నారు.

నైరుతి దిశలో బెడ్‌రూమ్‌ :పడమర ముఖం కలిగిన ఇంట్లో బెడ్‌రూమ్‌ నైరుతి దిశలో ఉండాలట. దీనివల్ల ఆ ఇంట్లో సకల శుభాలు కలుగుతాయని చెబుతున్నారు. రాత్రి నిద్రించే సమయంలో తూర్పు లేదా దక్షిణ దిశలో తల ఉంచి పడుకోవడం మంచిదని నిపుణులంటున్నారు.

వంటగది ఆగ్నేయ దిశలో ఉండాలి :పడమర దిశలో ఇళ్లు ఉండే వారు వంటగదిని ఆగ్నేయ దిశలో నిర్మించుకోవాలని సూచిస్తున్నారు. ఎట్టిపరిస్థితుల్లో కూడా కిచెన్‌ నైరుతి దిశలో ఉండకూడదట.

ఇంకా..

  • వెస్ట్‌ ఫేసింగ్ హౌస్‌ ఉన్నవారు పూజ గదిని ఈశాన్యంలో ఉండేలా చూసుకోవాలి.
  • అలాగే బాత్‌రూమ్‌ను వాయువ్యంలో లేదా తూర్పు దిశలో నిర్మించుకుంటే మంచిది.
  • ఈ విధంగా వాస్తు నియమాలను పాటించడం వల్ల వెస్ట్‌ ఫేసింగ్ హౌజ్‌ ఉన్నవారు ప్రతికూల ప్రభావాలను తొలగించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

మీ ఇంట్లో తరుచూ అనారోగ్యం వేధిస్తోందా? - ఈ వాస్తు పాటించాల్సిందేనట!

ఇంటి గేట్లు ఆ దిక్కున అస్సలు ఉండకూడదు- ఆ విషయంలో పాటించాల్సిన వాస్తు నియమాలివే!

నిర్మాణం మధ్యలో ఉన్న ఇంటిని కొనొచ్చా? - వాస్తు ఏం చెబుతోందో తెలుసా?

ABOUT THE AUTHOR

...view details