ETV Bharat / spiritual

సాయిబాబా నవ'గురువార'వ్రతం చాలా సింపుల్​- ఎన్ని కోరికలు కోరినా పర్లేదట! - Nine Thursdays Sai Baba Vrat

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 19, 2024, 6:35 PM IST

Sai Baba Vratam Telugu : పిలిస్తే పలికే దైవం సాయినాథుడు. మానవుని అజ్ఞానమనే చీకట్లను తన బోధనలనే జ్యోతితో పారద్రోలే అద్భుత మూర్తి సాయి. ప్రేమ తత్వమే సాయి తత్వం. గురువారాల్లో సాయిబాబా వ్రతాన్ని ఆచరిస్తే సర్వత్రా విజయం, సకల శుభాలు చేకూరుతాయని విశ్వాసం. మరి ఈ గురువార వ్రతాలు ఎలా చేయాలో తెలుసుకుందాం.

Sai Baba's Nine Thursday's Vrat Miracles
Nine Thursdays Sai Baba Vrat (Getty Images)

Sai Baba Vratam Telugu : సాయినాథునికి అంకితమైన గురువారం రోజు సాయిబాబా వ్రతాన్ని ఆచరించడం వల్ల అసంపూర్తిగా ఆగిపోయిన పనులు పూర్తవుతాయని, అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని, ఆర్థిక బాధలుండవని విశ్వాసం. అయితే సాయిబాబా కోసం ఎన్ని రోజులు ఉపవాసం ఉండాలి? గురువార వ్రతం ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

గురువారమే ప్రారంభం
సాయిబాబా వ్రతాన్ని ఒక నెలలో ఏ గురువారం నుంచైనా మొదలు పెట్టవచ్చు. ఒకవేళ ఆ రోజు పౌర్ణమి అయితే మరీ మంచిది. సాధారణంగా జ్యోతిష శాస్త్రం ప్రకారం ఏ వ్రతమైనా 5, 7, 9, లేదా 11 వారాలు చేయడం వలన విశేష ఫలితాలుంటాయని తెలుస్తోంది. సాయిబాబా వ్రతాన్ని మొదలు పెట్టిన రోజే ఎన్ని వారాలు చేయాలో నిర్ణయించుకొని బాబా సమక్షంలో దీక్ష తీసుకోవాలి.

గురువార వ్రత దీక్ష ఇలా తీసుకోవాలి?
సాయినాథుని పూజించే విధానం చాలా సులభంగా ఉంటుంది. ఇందులో ఎక్కువగా మడి, ఆచారాలు ఉండవు కాబట్టి ఎవరైనా సులభంగా చేసుకోవచ్చు. గురువార వ్రతాన్ని మొదలు పెట్టిన మొదటి గురువారం రోజు సూర్యోదయ సమయంలో తలారా స్నానం చేసి, పసుపు రంగు వస్త్రాలు ధరించి, పూజా మందిరాన్ని శుభ్రం చేసుకొని సాయిబాబా పటాన్ని కానీ, విగ్రహాన్ని కానీ ఉంచుకొని ఈ రోజు నుంచి తొమ్మిది గురువారాలు వ్రతాన్ని చేస్తానని సంకల్పించుకోవాలి. ప్రతి గురువారం సాయంత్రం వరకు ఉపవాసం ఉండాలి.

పసుపు రంగే ప్రధానం
సాయినాథుని సమక్షంలో నెయ్యి దీపం వెలిగించాలి. సాయిబాబాకు పసుపు రంగు అంటే చాలా ఇష్టం. అందుకే ఈ రోజు బాబాను పసుపు రంగు పూలతో పూజించాలి. సాయిని అష్టోత్తర శతనామాలతో అర్చించాలి. పూజ పూర్తి అయ్యాక బాబా వారి చరిత్రను కానీ, బాబా వారి ఉపవాస వ్రత కథను కానీ చదువుకోవాలి. బాబాకు నిమ్మకాయ పులిహోర, బూందీ లడ్డూలు, మామిడి పండ్లు, అరటి పండ్లు వంటి పసుపు రంగు ప్రసాదాలు నివేదించాలి. బాబాకు ఎంతో ప్రీతికరమైన కిచిడీ ప్రసాదం ఈ రోజు విశేషంగా సమర్పిస్తారు. అనంతరం బాబాకు హారతి పాటలు పాడుకుంటూ మంగళ హారతులు ఇవ్వాలి. బాబాకు నివేదించిన ప్రసాదాలను అందరికీ పంచి పెట్టాలి. సాయంత్రం సమీపంలోని సాయిబాబా ఆలయానికి వెళ్లి సాయినాథుని దర్శనం చేసుకుని ఇంటికి వచ్చి ఉపవాసాన్ని విరమించవచ్చు.

దానంతోనే పెరిగే సంపద
పూజ పూర్తయ్యాక చేసే దానాల వల్ల విశేష ఫలం ఉంటుంది. పేదలకు దానం చేసే వారి పట్ల సాయిబాబాకు అవ్యాజమైన అనురాగం ఉంటుంది. అందుకే పేదలకు ఆహారం, దుస్తులు దానం చేయవచ్చు. అన్ని దానాలలో కెల్లా అన్న దానం శ్రేష్ఠం. అందుకే గురువారం అన్నదానం చేస్తే ఐశ్వర్యం సిద్ధిస్తుందని అంటారు. అసలు సంపద పెరగడానికి సులభమైన మార్గం దానాలు చేయడమే అని హిందూ ధర్మ శాస్త్రం చెబుతోంది.

తొమ్మిది వారాలతో కోరుకున్న వరాలు
ఈ విధంగా తొమ్మిది గురువారాలు సాయినాథునిపై భక్తి విశ్వాసాలతో గురువార వ్రతాన్ని పూర్తి చేసుకున్న తర్వాత షిర్డీకి వెళ్లి బాబాను దర్శించుకుంటే వ్రతం సంపూర్ణం అవుతుంది. సాయి బాబా అనుగహంతో వృత్తి వ్యాపారాలలో పురోగతి, విజయం లభిస్తాయి. ఐశ్వర్యం కోరుకున్న వారికి ఐశ్వర్యం, కుటుంబ శాంతి, విద్య, ఉద్యోగం, వివాహం ఇలా సకల మనోభీష్టాలు నెరవేరుతాయి.

గురువార వ్రత నియమాలు
ముందుగా చెప్పుకున్నట్టు సాయినాథుని పూజ చాలా సులభమైనది. కఠినమైన నియమ, నిష్టలు ఏమి ఉండవు. ఉపవాసం ఉన్నవారు పాలు, పండ్లు వంటి సాత్విక ఆహారం తీసుకోవచ్చు. ఈ వ్రతానికి ఉన్న కఠినమైన నియమాలు ఏమిటంటే వ్రతం చేసే వారు ఇతరులను దూషించకూడదు. అబద్ధాలు చెప్పకూడదు. వ్యసనాల జోలికి పోకూడదు.

భక్తే ప్రధానం
సాయినాథుని పూజలో భక్తే ప్రధానం. భక్తి లేకుండా ఎంత ఘనంగా పూజ చేసినా ఫలితం ఉండదు. భక్తితో ఒక్క పువ్వు సమర్పించినా సాయి బాబా సంతోషిస్తాడు. అసలు బాబా వారికి సమర్పించాల్సింది మన మనసనే పుష్పాన్ని. భక్తితో శరణాగతి చేస్తే సాయినాథుని పరిపూర్ణ అనుగ్రహం మనకు లభిస్తుంది. ఓం శ్రీ సాయినాథాయ నమః

ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

పుత్ర సంతాన భాగ్యం కలిగించే రామలక్ష్మణ ద్వాదశి- వ్రతం చేయాల్సిన విధానం ఇదే! - Rama Lakshmana Dwadashi Puja

మనోభీష్టాలు తీర్చే శివపార్వతుల ఆరాధన- 'బుధ ప్రదోష' వ్రతం చేస్తే అన్నీ జయాలే! - Budh Pradosh Vrat 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.