ETV Bharat / spiritual

ఈరోజు ఆరాశి వారికి అన్నీ ప్రతికూల ఫలితాలే- జాగ్రత్త! - Daily Horoscope

Horoscope Today June 19th 2024 : జూన్​ 19న (బుధవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Daily Horoscope
Daily Horoscope (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 19, 2024, 5:00 AM IST

Horoscope Today June 19th 2024 : జూన్​ 19న (బుధవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : మేషరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి తీవ్ర కృషితోనే వృత్తిలో పురోగతి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి నిరాశాజనకంగా ఉంటుంది. సన్నిహితులను మీ పరుష మాటలతో నొప్పిస్తారు. నూతన కార్యక్రమాలు, ప్రయాణాలు ఈ రోజు వాయిదా వేసుకుంటే మంచిది. అనారోగ్య సమస్యలు చికాకు పెడతాయి. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

.

వృషభం (Taurus) : వృషభరాశి వారికి ఈ రోజు సంతోషంగా గడుస్తుంది. కుటుంబంలో శాంతి సౌఖ్యం నెలకొంటాయి. వృత్తి వ్యాపార రంగాల వారికి, ఉద్యోగులకు ఆశించిన ఫలితాలు ఉంటాయి. ఆర్థికంగా బలోపేతం అవుతారు. అవసరానికి సహాయం చేసేవారు ఉన్నారు. ఆరోగ్యం బాగుంటుంది. ఇంటికి బంధువుల రాక ఆనందం కలిగిస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణ శుభప్రదం.

.

మిథునం (Gemini) : మిథునరాశి వారికి ఈ రోజు ఫలప్రదమవుతుంది. ఉద్యోగులు ఉన్నత పదవులను అలంకరిస్తారు. చిత్తశుద్ధితో పనిచేసి ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు. వృత్తివ్యాపార రంగాల వారికి విజయసిద్ధి, ఆర్థికవృద్ధి ఉంటాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఊహించని ఆర్థిక లాభం ఉంటుంది. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది. ఇష్ట దేవతారాధన శుభప్రదం.

.

కర్కాటకం (Cancer) : కర్కాటకరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఆరంభించిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. వృత్తి ఉద్యోగ రంగాల వారికి పనిభారం పెరగడం వల్ల ఒత్తిడికి లోనవుతారు. కోపావేశాలతో సాధించేది ఏది లేదని గుర్తు పెట్టుకోండి. అనవసర కోపం కారణంగా ఆరోగ్యం పాడవుతుంది. ఖర్చులు పెరుగుతాయి. ప్రతికూల ఆలోచనలు వీడితే మంచిది. నవగ్రహ ధ్యానంతో మెరుగైన ఫలితాలు ఉంటాయి.

.

సింహం (Leo) : సింహరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగ రంగాల వారికి తీవ్ర శ్రమాధిక్యత పెరుగుతుంది. తగినంత విశ్రాంతి అవసరం. బాల్యస్నేహితులను కలుసుకొని మధురస్మృతులు నెమరు వేసుకుంటారు. వ్యాపారులకు భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. సమష్టి నిర్ణయాలు మేలు చేస్తాయి. వృత్తిపరంగా కొన్ని వివాదాలూ చోటు చేసుకోవచ్చు. సహనంతో, సర్దుబాటు ధోరణితో ఉంటే వివాదాలు సమసిపోతాయి. కుటుంబ సభ్యుల మధ్య అవగాహన లోపిస్తుంది. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన శుభకరం.

.

కన్య (Virgo) : కన్యారాశి వారికి ఈ రోజు విశేషంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో అనుబంధం దృఢపడుతుంది. వృత్తి వ్యాపారంలో పురోగతి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. గొప్ప ఆర్థిక ప్రయోజనాలను అందుకుంటారు. వ్యాపారులు విపరీతమైన లాభాలను గడిస్తారు. సమాజంలో గొప్ప పరపతి, ప్రతిష్ఠ పెరుగుతాయి. గతంలో మిమ్మల్ని విమర్శించిన వారే మీకు దాసోహం అంటారు. ఆర్థిక స్థితిగతులు పెరుగుతాయి. పదవీయోగం ఉంది. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

.

తుల (Libra) : తులారాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆశావాదంతో పనిచేస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో నిర్ణయం తీసుకోవడం కష్టమవుతుంది. అనుభవజ్ఞుల సలహా మేరకు నడుచుకుంటే మంచిది. ఉద్యోగులు ఆత్మవిశ్వాసంతో పనిచేసి శభాష్ అనిపించుకుంటారు. ఆశించిన ప్రమోషన్ కూడా అందుకుంటారు. ఆరోగ్యం బాగుంటుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది. హనుమ ఆరాధన శ్రేయస్కరం.

.

వృశ్చికం (Scorpio) : వృశ్చిక రాశి వారికి ఈ రోజు గొప్ప శుభకరంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో మంచి పురోగతి, ధనలాభం ఉంటాయి. కుటుంబ సభ్యులతో సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు. విందు వినోదాలలో పాల్గొంటారు. విహార యాత్రలకు వెళ్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఓ శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. శ్రీలక్ష్మీదేవి ధ్యానం శుభకరం.

.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సురాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి పని ఒత్తిడి పెరుగుతుంది. ఆశించిన ప్రయోజనాలు అందకపోవచ్చు. శ్రమకు తగిన ఫలితం అందక నిరాశకు లోనవుతారు. ఉద్యోగంలో మార్పు కోరుకునే వారు తొందరపడవద్దు. ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వేస్తే మంచిది. కుటుంబ సభ్యులతో గొడవలు, వాదనలు ఉంటాయి. ఉద్రేక స్వభావాన్నివిడిచి పెట్టి మాట పైన అదుపు ఉంచుకోవాలి. అనుకోని ప్రమాదాలు సంభవించవచ్చు. ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు పెరుగుతాయి. ఆదిత్య హృదయం పారాయణ చేస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి.

.

మకరం (Capricorn) : మకరరాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. వ్యాపారంలో లాభాల పంట పండుతుంది. సామాజిక బాధ్యతలు నెరవేర్చడంలో ముందుంటారు. ఉద్యోగులకు విజయలక్ష్మి వరిస్తుంది. ఏ రంగంలో అడుగుపెట్టినా, పట్టింది బంగారం అవుతుంది. అవివాహితులకు వివాహం నిశ్చయమవుతుంది. ఊహించని శుభఘడియలు రానున్నాయి. సంబరాలకు సిద్ధంగా ఉండండి. ఇష్ట దేవత ఆలయ సందర్శన శుభప్రదం.

.

కుంభం (Aquarius) : కుంభరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. ఈ రోజంతా సుఖ సంతోషాలు, ధనలాభాలతో నిండిపోతుంది. అన్ని రంగాల వారు సునాయాసంగా లక్ష్యాలను సాధిస్తారు. మీ పైఅధికారులు మీ పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తారు. ప్రమోషన్, జీతం పరుగుదల వంటి ప్రయోజనాలు ఉంటాయి. ఉద్యోగరీత్యా ఈ రోజు చాలా సంతోషంగా ఉంటారు. ఆర్థిక లబ్ధి ఉండవచ్చు. పెద్దల ఆశీస్సులు, దైవబలం అండగా ఉంటాయి. విష్ణు సహస్రనామ పారాయణ శక్తినిస్తుంది.

.

మీనం (Pisces) : మీనరాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు గోచరిస్తున్నాయి. విరామం లేకుండా పనిచేయడం వలన ఆరోగ్యం దెబ్బతింటుంది. వైద్య ఖర్చుల కోసం అధిక ధనవ్యయం ఉండవచ్చు. అనవసర విషయంలో జోక్యం చేసుకోకుండా మీ పని మీరు చేసుకుంటూ పొతే మంచిది. ఉద్యోగులు పైఅధికారులతో పనిచేసేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. మీరు చేసే చిన్న తప్పు కూడా చాలా తీవ్రంగా పరిగణించబడుతుంది. ముఖ్యమైన నిర్ణయాలు వాయిదా వేస్తే మంచిది. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే ప్రతికూలతలు తొలగుతాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.