ETV Bharat / spiritual

మీ ఇంట్లో తరుచూ అనారోగ్యం వేధిస్తోందా? - ఈ వాస్తు పాటించాల్సిందేనట!

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 12, 2024, 9:42 AM IST

Vastu Tips for Health : ఇంట్లో అనారోగ్య సమస్యలు కామన్. పలు రకాల కారణాలతో జబ్బు చేస్తుంది. కానీ.. నిత్యం అదే పనిగా అనారోగ్యం వేధిస్తుంటే? ఇదొక నిత్యకృత్యంలా ఉంటే? అది వాస్తు దోషం కావొచ్చని చెబుతున్నారు! ఇలాంటి వాళ్లు వాస్తును తప్పక పాటించాలంటున్నారు వాస్తుశాస్త్ర పండితులు!

Vastu Tips for Health
Good Health

Vastu Tips to Promote Good Health కొందరిని తరుచుగా అనారోగ్య సమస్యలు ఇబ్బందిపెడుతుంటాయి. లేదంటే ఇంట్లో ఎవరో ఒకరు ఎప్పుడూ అనారోగ్యంతో బాధపడుతుంటారు. ఈ పరిస్థితికి వాస్తు(Vastu) లోపం కూడా కారణమై ఉండొచ్చంటున్నారు వాస్తుశాస్త్ర నిపుణులు. వాస్తుప్రకారం కొన్ని సూచనలు పాటించడం ద్వారా సమస్యను పరిష్కరించుకోవచ్చని చెబుతున్నారు.

స్లీపింగ్ : మనం ఆరోగ్యంగా ఉండడానికి సరైన నిద్ర ఎంత ముఖ్యమో పడుకునే దిశ కూడా అంతే ముఖ్యం అంటున్నారు వాస్తు నిపుణులు. లేదంటే వాస్తుదోషాలు తలెత్తి వివిధ అనారోగ్య సమస్యలకు దారితీయవచ్చంటున్నారు. అందుకే.. వాస్తుప్రకారం మీరు నిద్రించే దిశ ఎప్పుడూ దక్షిణాభిముఖంగా ఉండేలా చూసుకోవాలట. అలాగే బెడ్​రూమ్​ను నైరుతి దిశలో నిర్మించుకోవడం ఉత్తమం. అదేవిధంగా మంచాన్ని గోడకు కనీసం మూడు నుంచి నాలుగు అంగుళాల దూరంలో ఉంచడమే కాకుండా ఎప్పుడూ చెక్కతో చేసినవి మాత్రమే యూజ్ చేయడం మంచిదంటున్నారు.

ఫర్నిచర్ సెట్టింగ్స్ : వాస్తుప్రకారం.. మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడంలో మీ ఇంట్లో ఫర్నిచర్ సెట్టింగ్ కూడా కీలక పాత్ర పోషిస్తుందచ. ముఖ్యంగా మీ పడకగదిలో పాత, పనికిరాని వస్తువులను స్టోర్ చేయకుండా చూసుకోండి. అలాగే మంచం ముందు ఎప్పుడూ అద్దం లేదా టీవీ వంటి ప్రతిబింబ వస్తువులు ఉంచకండి. ఇవి మాత్రమే కాదు.. బెడ్ రూమ్ ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ఎందుకంటే మురికిగా ఉంటే మానసిక ఆరోగ్యం దెబ్బతింటుందని చెబుతున్నారు వాస్తు పండితులు.

వంటగది దిశ : మన ఆరోగ్యాన్ని కాపాడడంలో వంటగది క్రియాశీలకంగా పనిచేస్తుంది. కాబట్టి వాస్తుప్రకారం కిచెన్​ను సరైన దిశలో నిర్మించుకోవడం చాలా అవసరం. వాస్తుప్రకారం.. ఈ గదిని ఆగ్నేయ దిశలో ఉంచడం వల్ల పాజిటివ్ ఎనర్జీ నిండుతుందట. అలాగే కిచెన్​లో స్టవ్‌, డైనింగ్ టేబుల్​ను తూర్పు దిశలో ఉండేలా చూసుకోవాలంటున్నారు వాస్తుపండితులు. ఇది మంచి జీర్ణక్రియను ప్రోత్సహిస్తుందని చెబుతున్నారు. అంతేకానీ, ఈశాన్య దిశలో స్టవ్​ పెట్టడం, కిచెన్​ను ప్లాన్ చేయడం మంచిది కాదంటున్నారు. అలాగే వంటగదిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి.

పర్సులో ఈ వస్తువులు పెడుతున్నారా? - వాస్తు ప్రకారం మీకు ఆర్థిక కష్టాలు గ్యారెంటీ!

గోడల పెయింట్ : మీ ఇంట్లో ఎవరైనా తరచుగా అనారోగ్యంతో ఇబ్బందిపడుతున్నట్టయితే వాస్తుప్రకారం ఇంటికి వేసిన పెయింట్ కూడా కారణం కావొచ్చంటున్నారు వాస్తుశాస్త్ర నిపుణులు. కాబట్టి ఎలాంటి ఆరోగ్య సమస్యలను ఎదుర్కోకుండా ఉండాలంటే వాస్తుప్రకారం.. గోడలకు సరైన కలర్ వేయించాలి. చాలా మంది ఎరుపు లేదా ఆకుపచ్చ రంగులను శుభప్రదంగా భావిస్తారు. ఎరుపు శక్తిని ఆకర్షిస్తే, ఆకుపచ్చ ప్రశాంతతకు చిహ్నంగా చెబుతారు. అలాగే, గోడలకు పగుళ్లు ఏర్పడితే వెంటనే వాటిని పెయింట్​తో మూసివేయించాలి. అంతేకాకుండా వాల్స్​కు చెదపురుగులు పట్టకుండా ఎప్పటికప్పుడూ ఇంటిని శుభ్రం చేసుకోవాలి.

విరిగిన అద్దాలు, కిటికీలు : వాస్తుప్రకారం ఇంట్లో విరిగిన అద్దాలు లేదా కిటికీలు ఉండకుండా చూసుకోవడం చాలా ముఖ్యమంటున్నారు వాస్తుశాస్త్ర నిపుణులు. ఎందుకంటే పగిలిన గ్లాస్ ఐటమ్స్ ఆందోళన, ఒత్తిడి లక్షణాలతోపాటు అదృష్టాన్ని ఆకర్షిస్తాయి.

ఇవేకాకుండా వాస్తు ప్రకారం.. ఇంటి మెట్ల కింద ఎక్కువ చెత్త పెట్టుకోకుండా చూసుకోవాలి. వాష్​రూమ్​లు, బాత్​రూమ్​లు ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. క్రమం తప్పకుండా క్లీన్ చేసుకోవాలి. ముఖ్యంగా బాత్​రూమ్​లో నీరు నిల్వ లేకుండా బాగా వెలుతురు ఉండేలా చూసుకోవాలి. వీటితో పాటు ఇంట్లో వాటర్ లీకేజీ లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే.. వాస్తుప్రకారం ఇవన్నీ మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి కాబట్టి వీటి విషయంలో జాగ్రత్తగా ఉండాలంటున్నారు వాస్తుశాస్త్ర నిపుణులు.

మీ చేతిలో డబ్బు నిలవట్లేదా? - ఈ వాస్తు లోపం ఉన్నట్టే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.