ETV Bharat / spiritual

ఇంటి గేట్లు ఆ దిక్కున అస్సలు ఉండకూడదు- ఆ విషయంలో పాటించాల్సిన వాస్తు నియమాలివే!

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 17, 2024, 6:30 AM IST

Vastu For Main Gate Of House : చాలా మంది వాస్తు ప్రకారం ఇళ్లు నిర్మించుకుంటారు. ప్రతి విషయంలోనూ వాస్తు పాటిస్తారు. అలాగే ప్రహరీ గోడ, ఇంటి గేటుకు సంబంధించిన నియమాలు, విధి విధానాలు కూడా ఉన్నాయి. అవేంటో ఈ ఆర్టికల్​లో తెలుసుకుందాం.

Vastu For Main Gate Of House
Vastu For Main Gate Of House

Vastu For Main Gate Of House : వాస్తును చాలా మందే నమ్ముతారు. ఇళ్లు కట్టేముందు సిద్ధాంతిని పిలిపించుకుని వారి సూచనల మేరకు నిర్మాణం చేపడతారు. అందులో వాస్తు కూడా ఒకటి. మరి పూర్తి ఇంట్లో కాకుండా ప్రహరీ గోడ, గేట్ల విషయంలో కూడా వాస్తు పాటించే వాళ్లున్నారు. మరి వాటికి సంబంధించిన నియమాలు, విధి విధానాలేంటో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

ఇల్లంతా చక్కగా కట్టుకుని ప్రహరీ గోడ కూడా నిర్మించుకున్నారు. వాటికి గేట్లు పెట్టే విషయంలో కొంత మంది తెలిసీ తెలియక తప్పులు చేస్తారు. గేట్ల డెకరేషన్ విషయంలో శుభం, క్షేమం అనే వాటికి గుర్తుగా 'ఐ' గుర్తు ఉన్న గేట్లు, ఐశ్వర్యదాయకంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రహరీ గేట్ల ఉచ్ఛ నీచ స్థానాల్ని గుర్తించాలి. ఉచ్ఛ అంటే మంచి, నీచ అంటే చెడు స్థానం అని అర్థం. గేట్లు సహజ సిద్ధంగా రోడ్డు ఏ వైపు ఉంటుందో ఆ వైపే పెడతాం. అయితే స్థలానికి ఎన్ని పక్కల రోడ్లు ఉంటే అన్ని పక్కలా ఉండాల‌ని లేదు.

ఉత్త‌ర దిశ‌లో ఇళ్లు నిర్మించే వారు గేట్ల విష‌యంలో గుర్తు పెట్టుకోవాల్సిన పెద్ద నియ‌మం ఏంటంటే, ఈశాన్యంలో పెద్ద గేటు ఉంచి, సింహ‌ద్వారంలో చిన్న గేటు పెట్టుకోవాలి. వాయువ్యంలో గేటు పెట్ట‌కూడ‌దు. ఇలా పెడితే అన‌ర్థ‌దాయ‌మైన ప్ర‌భావం ఉంటుంది. రోడ్లు తూర్పున‌కు, ఉత్త‌రం వైపున‌కు ఉన్న‌ప్పుడు రెండు గేట్లు పెట్ట‌డం మంచిది.

ఉత్త‌ర, ప‌డ‌మ‌ర రోడ్లు ఉన్న‌ప్పుడు, ఉత్త‌ర దిక్కునే గేట్లు పెట్టుకోవాలి. తూర్పు, ఈశాన్యం గేటు వ‌ల్ల పుత్ర సంత‌తి అభివృద్ధి చెంద‌డానికి, పుత్ర సంతానం క‌ల‌గ‌డానికి అవ‌కాశ‌ముంటుంది. వివాహ శుభ‌కార్యాలు జ‌రుగుతాయి. ఉద్యోగ ఉన్న‌తి, ఆయుష్షు కూడా పెరుగుతుంది. అదే తూర్పు, ఆగ్నేయ గేటు వ‌ల్ల విప‌త్క‌ర ప‌రిస్థితులు ఏర్ప‌డ‌తాయి. గృహానికి ఉత్త‌ర, ఈశాన్య సింహ‌ద్వారం మంచిది క‌లిగిస్తుందంటుంది శాస్త్రం. దీని వ‌ల్ల ధ‌న‌యోగం, కీర్తి ప్ర‌తిష్ఠ‌లు పెరుగుతాయి.

అలాగే ద‌క్షిణ వైపు గేట్లు పెట్టాల‌నుకుంటే ద‌క్షిణం మ‌ధ్య నుంచి ద‌క్షిణ‌ ఆగ్నేయం వ‌ర‌కు ఎక్క‌డైనా ఉంచ‌వ‌చ్చు. ప‌డ‌మ‌ర ప్ర‌హ‌రీ గేటు విష‌యానికి వ‌స్తే ప‌డ‌మ‌ర మ‌ధ్య భాగం నుంచి వాయువ్యం వర‌కు ఎక్క‌డైనా పెట్టుకోవ‌చ్చు. కానీ ఎలాంటి ప‌రిస్థితుల్లోనూ ప‌డ‌మ‌ర నైరుతి వైపు గేటు ఉంచ‌డ‌కూడ‌దు. గేటు ఎదురుగా ఇంటి పిల్ల‌ర్ ఉండ‌కూడ‌దు. అలాగే గేటు ఎదురుగా గొయ్యి, బోరు, డ్రైనేజీ మ్యాన్ హోల్ ఉండటం పనికిరావు. గేటు ఎదురుగా చెట్లు కూడా ఉండకూడదు. దాని వల్ల వృక్షవేదా దోషం వస్తుంది. గేటు ప్రహరీ కంటే ఎత్తు ఉండకూడదు.

మంచి గేట్లు, చెడు గేట్లు అంటే ఏంటి ?
ఉత్తర-ఈశాన్యం, తూర్పు-ఈశాన్యం, దక్షిణ-ఆగ్నేయం, పడమర-వాయువ్యం వైపున ఉండే గేట్లు వాస్తు ప్రకారం మంచివి. చెడు గేట్ల విషయానికి వస్తే ఉత్తర-వాయువ్యం, తూర్పు-ఆగ్నేయం, దక్షిణ-నైరుతి, పడమర-నైరుతి వైపు ఉన్న గేట్లు చెడు ఫలితాన్నిస్తాయి.

గేట్లకు కలర్స్ వేసే విషయంలోనూ వాస్తు విషయం పాటించాలి. గేటు, గ్రిల్, జాలిలు కూడా దాని ప్రకారమే పెట్టాలి. వీటి విషయంలో డిజైన్లు బాగా ఉండేలా చూసుకోవాలి. వీటి లోపం వల్ల గాయాలు తగిలే ప్రమాదముంది. వీలైనంత వరకు రేఖా గణితాన్ని అనుసరించి డిజైన్ చేయించాలి. రంగులు సాధారణంగా నల్లగా ఉండేలా చూసుకోవాలి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

మీ ఇంట్లో తరుచూ అనారోగ్యం వేధిస్తోందా? - ఈ వాస్తు పాటించాల్సిందేనట!

మీ ఇంట్లో ఈ పండ్ల చెట్లు పెంచుతున్నారా? - వాస్తు దోషం ఖాయమట!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.