ETV Bharat / spiritual

మీ ఇంట్లో ఈ పండ్ల చెట్లు పెంచుతున్నారా? - వాస్తు దోషం ఖాయమట!

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 9, 2024, 2:56 PM IST

Vastu Rules For Fruit Trees : ఈ రోజుల్లో చాలా మంది ఇళ్లలో వివిధ రకాల పండ్ల చెట్లను పెంచుతున్నారు. అయితే.. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో కొన్ని రకాల పండ్ల చెట్లు ఉంచకూడదట! లేకపోతే.. ఇంట్లోకి నెగటివ్‌ ఎనర్జీ చేరుతుందట!

Vastu Rules For Fruit Trees
Vastu Rules For Fruit Trees

Vastu Rules For Fruit Trees : ఇంటి ఆవరణలో ఏమాత్రం స్థలం ఉన్నా.. దాదాపుగా అందరూ పూల మొక్కలు, లేదా పండ్ల చెట్లను పెంచుతుంటారు. చెట్ల ద్వారా ఆహ్లాదకరమైన వాతావరణం ఉండడమేకాకుండా.. స్వచ్ఛమైన పండ్లు లభిస్తాయి. అయితే.. ఇష్టారీతిన పండ్ల చెట్లను ఇంట్లో పెంచొద్దని చెబుతున్నారు వాస్తు నిపుణులు. ఇంటి నిర్మాణం విషయంలో వాస్తు నియమాలను పాటించిన విధంగానే.. పండ్ల మొక్కల విషయంలోనూ వాస్తు పాటించాలని సూచిస్తున్నారు. లేదంటే.. ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీ వస్తుందని చెబుతున్నారు. మరి.. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ఆవరణలో ఉండాల్సిన పండ్ల చెట్లు ఏంటి? ఏ చెట్లను పెంచకూడదు? అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

ఈ చెట్లు వద్దు..
వాస్తు ప్రకారం ఇంట్లో ఉసిరి, జామ, దానిమ్మ, బొప్పాయి, అరటి, కొబ్బరి, కివి, నారింజ చెట్లను పెంచుకోవచ్చని వాస్తు నిపుణులు తెలియజేస్తున్నారు. ఇవి ఇంట్లో పాజిటివ్‌ ఎనర్జీని కలుగజేస్తాయని అంటున్నారు. అయితే.. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంట్లో రేగు, ఖర్జూరం, పైనాపిల్ చెట్లను పెంచకూడదని చెబుతున్నారు. వీటివల్ల ఇంట్లో అశాంతి, అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. కాబట్టి, ఏ చెట్లను నాటుతున్నామనే విషయాన్ని ముందుగానే గమనించాలని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.

ఆ చెట్లతో సిరిసంపదలు..
వాస్తు సూచించిన పండ్ల చెట్లను ఇంట్లో పెంచుకోవడం చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఉసిరి, జామ, దానిమ్మ, బొప్పాయి, అరటి, కొబ్బరి, నారింజ చెట్ల కారణంగా ఇంట్లో సిరిసంపదలు, ఐశ్వర్యం, శ్రేయస్సు కలుగుతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఈ పండ్ల చెట్లను ఇంట్లో పెంచడం వల్ల సానుకూల ప్రభావం కలుగుతుందని తెలియజేస్తున్నారు. అలాగే ఇంట్లో కాసిన తాజా పండ్లను తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చని సూచిస్తున్నారు.

వాస్తు ప్రకారం పండ్ల చెట్లు ఏ దిశలో ఉండాలి?
కొత్తగా ఇంటిని నిర్మించేవారు.. వాస్తు ప్రకారం పూజ గది, కిచెన్‌, బెడ్‌రూమ్‌ వంటివి ఏ దిశలో ఉండాలో ముందుగానే చూసుకుంటారు. కానీ.. ఇంటి ఆవరణలో పండ్ల చెట్లను నాటే విషయంలో మాత్రం వాస్తు నియమాలను పెద్దగా పాటించరు. కానీ.. ఇలా చేయడం మంచిది కాదని చెబుతున్నారు. ఇది పెద్ద పొరపాటుగా వాస్తు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇంటి ఆవరణలో పండ్ల మొక్కలు ఏ దిశలో ఉండాలో కూడా వాస్తు శాస్త్రం చెబుతోందని.. దాన్ని పాటించాలని సూచిస్తున్నారు. వాస్తు ప్రకారం ఇంట్లో పండ్ల మొక్కలను తూర్పు లేదా ఈశాన్య దిశలో నాటాలని చెబుతున్నారు. దీనివల్ల ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుందని, ఐశ్వర్యం సిద్ధిస్తుందని తెలియజేస్తున్నారు.

ఇంట్లో వాటర్ ట్యాంక్ ఎక్కడ ఉండాలి? ఆగ్నేయంలో బావి ఉంటే అరిష్టమా?

భార్యాభర్తల మధ్య ప్రేమ వికసించాలంటే - బెడ్​రూమ్​లో వాస్తు పాటించాల్సిందేనట!

వాస్తు ప్రకారం ఇంట్లో బోర్​వెల్ ఏ దిశలో ఉండాలి? ప్రహరీ గోడ ఎత్తు ఎక్కువైతే జరిగేది ఇదే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.