ETV Bharat / spiritual

వాస్తు ప్రకారం ఇంట్లో బోర్​వెల్ ఏ దిశలో ఉండాలి? ప్రహరీ గోడ ఎత్తు ఎక్కువైతే జరిగేది ఇదే!

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 3, 2024, 12:41 PM IST

Vastu Tips For Borewell : మీరు కొత్త ఇల్లు కట్టాలనుకుంటున్నారా? ఇంటికి బోరువెల్​ ఏ దిశలో ఉంటే మంచిది? ఉత్తరవీధి స్థలం విషయంలో పాటించాల్సిన వాస్తు నియమాలు ఏవి? ఇలాంటి విషయాలపై మీకు సందేహాలున్నాయా? అయితే ఈ ఆర్టికల్ మీ కోసమే. వాస్తు విషయంలో పాటించాల్సిన నియమాలను వాస్తు పండితులు మాచిరాజు వేణుగోపాల్ సూచించారు. ఆ వివరాలు మీ కోసం.

Vastu Tips For Borewell
Vastu Tips For Borewell

Vastu Tips For Borewell : వాస్తుశాస్త్రం ప్రకారం ఇంటి నిర్మాణం చేసుకుంటే ఆనందం, ఆరోగ్యం, ఆయుష్షు ఉంటాయని చాలా మంది నమ్మకం. అయితే కొత్త ఇంటిని నిర్మించే క్రమంలో చాలా మందికి అనేక వాస్తు సందేహాలు రావడం సహజం. మీకు కూడా వాస్తు విషయంలో ఇలాంటి సందేహాలే ఉన్నాయా? ఇంటికి బోరువెల్​ ఏ దిశలో వేస్తే మంచిది? ఉత్తరదక్షిణ దిశలో వీధి ఉంటే పాటించాల్సిన వాస్తునియమాలు తదితర వివరాలపై వాస్తు పండితులు మాచిరాజు వేణుగోపాల్ సూచనలు మీ కోసం.

ఉత్తర వీధి స్థలానికి పాటించాల్సిన వాస్తు నియమాలు ఇవే!
Vastu Tips For North Facing House : 'ఇల్లు కట్టుకునే స్థలానికి ఉత్తర దిశలో వీధి ఉంటే అలాంటి స్థలాన్ని ఉత్తర వీధి స్థలం అని అంటారు. ఉత్తర దిశకు ధనాన్ని ఎక్కువగా ఆకర్షించే స్వభావం ఉంటుంది. కనుక ఇలాంటి స్థలాలు అందరికీ కలిసి వస్తాయి. అయితే ఉత్తర వీధి స్థలం విషయంలో కొన్ని నియమాలను పాటించడం ద్వారా ఫలితాలను మరింత అనుకూలంగా మార్చుకోవడానికి అవకాశం ఏర్పడుతుందని వాస్తుశాస్త్రం చెబుతోంది. వాటి గురించి మరింత వివరంగా తెలుసుకుందాం.

ఉత్తర వీధి స్థలంలో ఇల్లు కట్టేటప్పుడు ఉత్తరం వైపు ఎక్కువ ఖాళీ ఉండేలా చూసుకోవాలని వాస్తు నియమాలు చెబుతున్నాయి. దీని వల్ల ఆర్థిక అభివృద్ధి జరుగుతుందని వాస్తు వివరిస్తోంది. అలాగే ఉత్తరం వైపు విశాలంగా ఉంటే సుఖ సంపదలు కలుగుతాయని వాస్తుశాస్త్రంలో ఉంది. ఉత్తరాన పల్లంగా ఉంటే సంపదలు కలుగుతాయని, ఆరోగ్యం పదిలంగా ఉంటుందని మాచిరాజు వేణుగోపాల్​ సూచించారు.

బోరు ఏ దిశలో ఉంటే మంచిది?
Best Direction To Dig Borewell : అలాగే ఉత్తర దిశలో బావి, బోరు ఉంటే శుభ ఫలితాలు కలుగుతాయని వాస్తు నియమాలు చెబుతున్నాయి. ఉత్తరం, దక్షిణం కన్నా పల్లంగా ఉంటే యజమానికి సుఖం కలుగుతుందని, ఉత్తర, ఈశాన్యంలో ప్రవేశ ద్వారాలు ఉంటే శుభ ఫలితాలు కలుగుతాయని వాస్తు చెబుతోంది. 'ప్రహరీ గోడ (కంపౌండ్ గోడ) ఉత్తరంలో తక్కువ ఎత్తులో, దక్షిణం దిశలో ఎక్కువ ఎత్తులో ఉంటే మంచి ఫలితాలు వస్తాయి. గృహానికి, గృహ ఆవరణలో ఉత్తరంలో పల్లం తక్కువగా ఉంటే శుభాలు కలుగుతాయని, గృహంలోని నీరు ఉత్తరం నుండి బయటకు వెళితే అభివృద్ధి కలుగుతుందని వాస్తు నియమాలు వివరిస్తున్నాయి. స్థలం ఉత్తరం వైపు వాలు కలిగి ఉన్నట్లయితే ఆర్థికాభివృద్ధి బాగా జరుగుతుందని వాస్తుశాస్త్రం చెబుతోంది. దక్షిణం వైపు ఎక్కువ ఎత్తు ఉండే చెట్లు, ఉత్తరం వైపు ఎత్తు పెరగని చెట్లు వేసుకోవడం వల్ల మరిన్ని అనుకూల ఫలితాలు వస్తాయి' అని వాస్తు నియమాలు చెబుతున్నాయి.

దక్షిణ వీధి స్థలం కలిగిన వారు పాటించాల్సిన నియమాలు
గృహ నిర్మిత స్థలానికి దక్షిణం వైపు వీధి ఉంటే దక్షిణ వీధి స్థలం అని అంటారు. ఈ రకమైన స్థలం అనుకూల ఫలితాలను, ప్రభావాలను కలిగి ఉంటుంది. ఈ స్థలంలో ఇల్లు కడితే అభివృద్ధి, ఆరోగ్యంతో పాటు సుఖ సంతోషాలు కలుగుతాయి. అయితే దక్షిణ వీధి స్థలం కలిగిన వాళ్లు ఇల్లు కట్టేటప్పుడు దక్షిణం వైపు ఖాళీ స్థలం ఉంచడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. దక్షిణ భాగాన్ని ఎక్కువ ఎత్తులో ఉంచుకోవాలి. అలాగే ప్రహరీ గోడ (కంపౌండ్ గోడ)ను వీధి కన్నా ఎత్తులో నిర్మించుకోవాలి. దక్షిణ దశలో నీరు నిలువకుండా ఉంటే ఆరోగ్య స్థిరత్వం కలుగుతుందని వాస్తులో వివరించడం జరిగింది. ఇక దక్షిణ నైరుతి దిశలో సంజీవని పర్వతాన్ని మోస్తున్న ఆంజనేయుడి జెండాను ఉంచితే శుభం కలుగుతుందని వాస్తు నిపుణులు వివరిస్తున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

మీ చేతిలో డబ్బు నిలవట్లేదా? - ఈ వాస్తు లోపం ఉన్నట్టే!

పూజ గదిలో ఈ వస్తువులు ఉంటే - లక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంటిపైనే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.