ETV Bharat / spiritual

పూజ గదిలో ఈ వస్తువులు ఉంటే - లక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంటిపైనే!

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 2, 2024, 2:42 PM IST

Vastu Tips For Home : దాదాపుగా అందరి ఇళలో పూజగది ఉంటుంది. సిరిసంపదలు కలగాలని, కష్టాలు తీరిపోవాలని భక్తులు నిత్యం దేవుడిని ప్రార్థిస్తుంటారు. అయితే.. వాస్తు ప్రకారం పూజ గదిలో కొన్ని వస్తువులు తప్పకుండా ఉండాలట. అప్పుడే లక్ష్మీదేవి అనుగ్రహం ఆ ఇంటిపై ప్రసరిస్తుందట! మరి.. ఆ వస్తువులు ఏంటో మీకు తెలుసా ?

Vastu Tips For Home
Vastu Tips For Home

Vastu Tips For Home : భగవంతుడని పూజించడానికి ప్రతీ ఇంట్లో చిన్నదో పెద్దదో.. ఒక పూజగది ఉంటుంది. తమ ఇష్టదైవాన్ని అందులో ప్రతిష్టించి.. శ్రద్ధతో నిత్యం పూజలు చేస్తుంటారు. అయితే.. పూజగదిలో సరైన వాస్తు నియామాలను పాటిస్తేనే ఆ ఇంట్లో సుఖశాంతులు, సిరిసంపదలు వర్ధిల్లుతాయని.. కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉంటారని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇంటిపై లక్ష్మీదేవీ చల్లని చూపు ఉండాలంటే.. పూజ గది సరైన దిశలో ఉండడంతోపాటు అందులో కొన్ని వస్తువులు తప్పకుండా ఉంచాలట. మరి.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

నెమలి ఈక : శ్రీకృష్ణుడికి నెమలి ఈకలు అంటే చాలా ఇష్టం. ఇది అందరికీ తెలిసిందే. అయితే, పూజ గదిలో నెమలి ఈకలను పెట్టడం వల్ల ఆ ఇళ్లంతా పాజిటివ్‌ ఎనర్జీతో నిండిపోతుందట. కాబట్టి.. మీరు కూడా పూజ గదిలో నెమలి ఈకలను ఉంచాలని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.

మీరు ధరించే రుద్రాక్ష ఏ రకం? - మొత్తం 21 రకాలు - వాటి విశిష్టతలు తెలుసా?

శంఖం : వాస్తు ప్రకారం పూజ గదిలో శంఖం ఉండటం మంచిది. రోజూ దేవుడికి పూజ చేసిన తర్వాత శంఖం ఊదడం వల్ల పాజిటివ్‌ ఎనర్జీ వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో సుఖశాంతలు, శాంతి, సౌభాగ్యాలు కలుగుతాయని అంటున్నారు.

గంగా జలం : వాస్తు ప్రకారం ప్రతి ఇంట్లోని పూజ గదిలో గంగా జలం తప్పకుండా ఉండాలట. దీనివల్ల ఇంట్లో ప్రతికూల శక్తి తొలగిపోతుందని నిపుణులంటున్నారు. అలాగే పూజ గదిలో గంగాజలం ఉండటం వల్ల ఆధ్యాత్మిక భావన పెరుగుతుందని చెబుతున్నారు. ఇంకా ఇంట్లో ఐశ్వర్యం కలుగుతుందని తెలియజేస్తున్నారు.

సాలగ్రామం : సాలగ్రామాన్ని విష్ణువు శిలా రూపంగా చెబుతారు. దీనిని ఇంట్లోని పూజ గదిలో ఉంచి, పూజించడం వల్ల.. లక్ష్మీదేవీ అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుందని, సిరిసంపదలు కలుగుతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అలాగే.. ఇంట్లోని కుటుంబ సభ్యుల మధ్య అశాంతులు, కలహాలు తొలగిపోయి ప్రేమ, అప్యాయతలు చిగురిస్తాయని అంటున్నారు.

పూజ గది ఏ దిశలో ఉండాలి ?
కొత్తగా ఇంటిని నిర్మించే వారు పూజ గదిని ఈశాన్య దిక్కులో ఉండేలా చూసుకోవాలని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. పొరపాటున కూడా పూజ గదిని దక్షిణ దిశలో ఏర్పాటు చేయకూడదని అంటున్నారు. ఇలా చేయడం వల్ల ఆ ఇంట్లో ఆర్థిక సమస్యలు, కుటుంబ సభ్యుల మధ్య గొడవలు రగిలే అవకాశం ఉంటుందట. ఇంకా.. కుటుంబ సభ్యులకు అనారోగ్య సమస్యలు కూడా వస్తాయని చెబుతున్నారు.

మీ చేతిలో డబ్బు నిలవట్లేదా? - ఈ వాస్తు లోపం ఉన్నట్టే!

అన్నం తిన్న తర్వాత ప్లేట్‌లోనే చేతులు కడుగుతున్నారా ? ఈ సమస్యలు తప్పవట!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.