ETV Bharat / spiritual

మీరు ధరించే రుద్రాక్ష ఏ రకం? - మొత్తం 21 రకాలు - వాటి విశిష్టతలు తెలుసా?

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 29, 2024, 11:45 AM IST

Different Types Of Rudraksha : దైవారాధన చేసేవారిలో చాలా మంది రుద్రాక్షలు ధరిస్తుంటారు. అయితే.. రుద్రాక్షలన్నీ ఒకే రకం కాదని మీకు తెలుసా? ఏకంగా 21 రకాలు ఉన్నాయి! అంతేకాదు.. ఒక్కో రుద్రాక్షకు ఒక్కో ప్రాముఖ్యత ఉంది! ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Different Types Of Rudraksha
Different Types Of Rudraksha

Different Types Of Rudraksha : పరమేశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైన వాటిలో రుద్రాక్ష ఒకటి. ఆ దేవదేవుడి అనుగ్రహం తమపై ఉండాలని.. భక్తులు రుద్రాక్షలు ధరిస్తుంటారు. అయితే.. ఈ రుద్రాక్షలో ఏకంగా 21 రకాలున్నాయి. ప్రతిదానికీ ప్రత్యేకత ఉంది. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

రుద్రుడి కన్నీళ్లే :
రుద్రాక్ష ధరించండం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు తొలగిపోయి, సిరిసంపదలు వర్ధిల్లుతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. పురాణాల ప్రకారం రుద్రుడి (శివుడు) కన్నీళ్లు భూమిపై పడి.. రుద్రాక్ష చెట్లుగా మారాయని చెబుతారు. ఆ చెట్లకు కాసిన కాయలే ఈ రుద్రాక్షలు అని అంటారు. అయితే.. రుద్రాక్షలను వాటి ముఖాల ఆధారంగా విభజిస్తారు. ఇవి ఒక ముఖము నుంచి ఇరవై ఒక్క ముఖాలను కూడా కలిగి ఉంటాయని పండితులు చెబుతున్నారు. అయితే.. అత్యధికంగా దొరికేవి పంచముఖ రుద్రాక్షలని తెలియజేస్తున్నారు. వీటన్నింటిలో అత్యంత శక్తివంతమైనది 'ఏక ముఖి' రుద్రాక్షగా చెబుతున్నారు.

రుద్రాక్షలు.. వాటి విశిష్టత:

ఏక ముఖి రుద్రాక్ష : ఈ రుద్రాక్షను ధరించడం వల్ల ఆ పరమేశ్వరుడి కృప ఎల్లప్పుడూ మనతోనే ఉంటుందట. అలాగే ఇది ధరించిన వారు ఆధ్యాత్మిక జ్ఞానోదయం కలిగి జీవితంలో ముందుకెళ్తారని చెబుతున్నారు.

ద్విముఖి రుద్రాక్ష : ఈ రుద్రాక్షను శివపార్వతి రూపంగా చెబుతారు. దీనిని ధరించడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ పెరుగుతుందని విశ్వసిస్తారు.

త్రిముఖి రుద్రాక్ష : బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు స్వరూపంగా ఈ రుద్రాక్ష ఉంటుందని నమ్ముతారు. దీనిని ధరించడం వల్ల కోపం తొలగిపోతుందట. అలాగే మనం చేసే పనులపై స్పష్టత కలుగుతుందని చెబుతున్నారు. ఇంకా ఆలోచనలను సమన్వయం చేస్తుందని అంటున్నారు.

చతుర్ముఖి రుద్రాక్ష : ఈ రుద్రాక్ష నాలుగు వేదాల స్వరూపం. దీనిని ధరించడం వల్ల జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయట.

పంచముఖి రుద్రాక్ష : ఈ రుద్రాక్ష పంచభూతాల స్వరూపం. ఇది ధ్యానం, సమతుల్యత, ప్రకృతితో సంబంధాన్ని పెంపొందిస్తుందట.

షట్ముఖి రుద్రాక్ష : ఈ రుద్రాక్ష వల్ల సంకల్ప శక్తి పెరుగుతుందట. అలాగే, దూకుడు, అసూయ, ఆందోళనలను తగ్గిస్తుందని చెబుతున్నారు.

సప్తముఖి రుద్రాక్ష : ఇది ఏడు ఉపరితల రేఖలతో ఉంటుంది. దీనిని ధరించడం వల్ల మానసిక శాంతి కలుగుతుందట.

అష్టముఖి రుద్రాక్ష : ఈ రుద్రాక్ష గణపతి దేవుడితో సంబంధం కలిగి ఉంది. దీనిని ధరించడం వల్ల ఎటువంటి ఆటంకాలు కలగకుండా విజయం సిద్ధిస్తుందట.

నవముఖి రుద్రాక్ష : ఈ రుద్రాక్ష నవగ్రహాల స్వరూపం. అలాగే దుర్గాదేవి అనుగ్రహం ముడిపడి ఉంటుంది. దీనిని ధరించడం వల్ల ధైర్యం, బలం పెరుగుతాయట.

దశముఖి రుద్రాక్ష : ఈ రుద్రాక్ష ధరించడం వల్ల ప్రతికూల శక్తుల నుంచి రక్షణ ఉంటుందని నిపుణులంటున్నారు. అలాగే విష్ణువు అనుగ్రహం ఉంటుందట.

11 ముఖాల రుద్రాక్ష : ఈ రుద్రాక్షను శివుని 11వ అవతారంగా భావిస్తారు. దీనిని ధరించడం వల్ల అపారమైన శక్తి మన సొంతం అవుతుంది.

12 ముఖాల రుద్రాక్ష : ఈ రుద్రాక్ష సూర్య భగవానుడితో అనుసంధానమై ఉంది. దీనిని ధరించడం వల్ల నాయకత్వ లక్షణాలు, నిర్ణయాత్మక సామర్థ్యం పెరుగుతుందట.

13 ముఖాల రుద్రాక్ష : దీనిని ధరించడం వల్ల వైవాహిక జీవితం సుఖంగా ఉంటుందట.

14 ముఖాల రుద్రాక్ష : ఈ రుద్రాక్ష హనుమంతునితో అనుసంధానమై ఉంది. దీనిని ధరించడం వల్ల ధైర్యం కలుగుతుందట. అలాగే ప్రతికూల శక్తి తాకిడిని తగ్గిస్తుందట. విజయానికి దోహదపడుతుందని చెబుతున్నారు.

15 ముఖాల రుద్రాక్ష : ఇది శక్తివంతమైనది. దీనిని ధరించడం వల్ల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చట.

16 ముఖాల రుద్రాక్ష : ఈ రుద్రాక్ష వల్ల మరణ భయం తొలగిపోతుందట. అలాగే దీర్ఘకాలిక వ్యాధులు దరి చేరవు.

17 ముఖాల రుద్రాక్ష : ఈ రుద్రాక్ష వల్ల సృజనాత్మకత, నైపుణ్యాలు, జ్ఞాపకశక్తి, తెలివితేటలు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు.

18 ముఖాల రుద్రాక్ష : ఈ రుద్రాక్ష వల్ల జీవితంలో వృత్తి పరంగా పురోగతి కలుగుతుందట.

19 ముఖాల రుద్రాక్ష : ఈ రుద్రాక్ష మొత్తం ఏడు చక్రాలను తెరుస్తుందని నమ్ముతారు.

20 ముఖాల రుద్రాక్ష : ఈ రుద్రాక్ష బ్రహ్మదేవునితో అనుసంధానమై ఉంది. ఇది ప్రశాంతతను కలిగిస్తుంది.

21 ముఖాల రుద్రాక్ష : ఈ రుద్రాక్ష చాలా అరుదుగా లభ్యమవుతుంది. ఇది సిరి సంపదలను కలిగించే కుబేరుడితో అనుసంధానమై ఉందని నిపుణులంటున్నారు.

పర్సులో ఈ వస్తువులు పెడుతున్నారా? - వాస్తు ప్రకారం మీకు ఆర్థిక కష్టాలు గ్యారెంటీ!

వాస్తు ప్రకారం ఇంట్లో అద్దం ఏ దిశలో ఉండాలో తెలుసా? - లేదంటే ఆ సమస్యలు తప్పవట!

వాస్తు - మీ ఇంట్లో ఈ మొక్కలు ఉంటే ధనలాభం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.