తెలంగాణ

telangana

అన్నం తిన్న తర్వాత ప్లేట్‌లోనే చేతులు కడుగుతున్నారా ? ఈ సమస్యలు తప్పవట!

By ETV Bharat Telugu Team

Published : Mar 1, 2024, 12:43 PM IST

Vastu Tips In Telugu : సాధారణంగా చాలా మంది ఇంట్లో భోజనం చేసిన తర్వాత చేతులను ప్లేట్‌లోనే కడుగుతుంటారు. అయితే, వాస్తు ప్రకారం ఇలా చేయడం మంచిది కాదంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం..

Vastu Tips In Telugu
Vastu Tips In Telugu

Washing Hands in Plate is Good or Bad:అన్నం పరబ్రహ్మ స్వరూపం. అందుకే అన్నాన్ని పడేయడం కానీ, తొక్కడం కానీ చేయొద్దంటారు పెద్దలు. అంతేకాకుండా అన్నం తినేటప్పుడు మాట్లాడకూడదని కూడా అంటుంటారు. అలాగే తినే అన్నాన్నే కాకుండా ఎందులో అయితే తింటున్నామో ఆ ప్లేటును కూడా గౌరవించాలని అంటుంటారు. అయితే చాలా మంది తమకు తెలియకుండానే అన్నం తినే విషయంలో ఎన్నో తప్పులు చేస్తారు. అందులో ఒకటి.. అన్నం తిని ప్లేట్‌లోనే చేతులు కడగడం. ఇంట్లో చేతులు కడుక్కోవడానికి వాష్‌ బేషిన్‌ వంటివి ఉన్నా కూడా, ఎక్కువ మంది తిన్న ప్లేట్‌లోనే కడిగి పక్కకు జరుగుతుంటారు. అయితే, వాస్తు శాస్త్రం ప్రకారం ఇలా తిన్న తర్వాత ప్లేట్‌లో చేతులు కడగడం మంచిది కాదట. ఎందుకో ఈ స్టోరీలో చూద్దాం..

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో భోజనం చేసిన తర్వాత ప్లేట్‌లో చేతులను కడగకూడదని అంటున్నారు నిపుణులు. ఇలా చేయడం వల్ల ఆ కుటుంబం పేదరికంలో మగ్గుతుందని తెలియజేస్తున్నారు. అలాగే తిన్న తర్వాత చేతులు కడగడం వల్ల ఇంటికి అశుభం కలుగుతుందని చెబుతున్నారు. కాబట్టి తిన్న తర్వాత చేతులు పక్కకి వెళ్లి కడగాలి. అలాగే ఎక్కువ మంది తిన్న వెంటనే ప్లేట్ ముందు నుంచి కూడా లేవరు. అయితే తినడం అయిపోయిన తర్వాత కూడా కూర్చుని ప్లేట్​ను ఎండిపోనివ్వడం మంచిది కాదంటున్నారు. అలా చేస్తే కూడా దరిద్రం వస్తుందని.. అందుకే తినడం అయిపోయిన తర్వాత చేతులు కడగకుండా ప్లేట్లో కనీసం కొన్ని నీళ్లు పోయాలని అంటున్నారు.

ప్లేట్లో ఎందుకు కడగకూడదంటే ?ఆహారాన్ని లక్ష్మీదేవీ, అన్నపూర్ణ దేవిగా భావిస్తారు. అయితే, తిన్న తర్వాత చేతులు కడగడం వల్ల ఈ దేవతలకు కోపం వస్తుందట. అలాగే ఆహారం కూడా దొరకదని, లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభించదని అంటున్నారు. ఇంకా ఇలా చేయడం వల్ల ప్లేట్‌లో మిగిలిపోయిన ఆహారాన్ని అగౌరవ పరిచినట్లు అవుతుందని అంటున్నారు. అందుకే ఇలా చేయకూడదని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

వాస్తు - ఈ ఫొటో మీ ఇంట్లో ఉంటే విజయాలను ఎవ్వరూ అడ్డుకోలేరు!

భోజనం చేసేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి:

  • భోజనం ఎప్పుడూ నేల మీద కూర్చొని తినే విధంగా చూసుకోండి.
  • అన్నంతో నిండిన ప్లేట్​ను ఎప్పుడూ ఒక చేత్తో పట్టుకోకూడదు. ఇలా చేయడం వల్ల అన్నపూర్ణను, లక్ష్మీదేవిని అవమానించినట్లే అవుతుంది. అలాంటివారికి ఆహారం, డబ్బు ఉండదని చెబుతుంటారు.
  • అలాగే అన్నం వృథా చేయకుండా పూర్తిగా తినాలి.
  • అన్నం తినే సమయంలో మెతుకులు ప్లేట్‌ చుట్టూ పడకుండా జాగ్రత్తగా తినాలి.
  • అన్నం పారేయడాన్ని అశుభంగా పరిగణిస్తారు.
  • భోజనం చేసే ముందు భగవంతుడిని స్మరించి తినాలని శాస్త్రాలలో ఉంది.
  • ఇంకా ఎవరిపైనైనా అరవడం గానీ, కోపంగా మాట్లాడటం చేయకూడదని నిపుణులు తెలియజేస్తున్నారు.

పసుపు నీటితో స్నానం చేస్తున్నారా? - జ్యోతిష్యం ఏం చెబుతోందో తెలుసా?

మీరు ధరించే రుద్రాక్ష ఏ రకం? - మొత్తం 21 రకాలు - వాటి విశిష్టతలు తెలుసా?

ABOUT THE AUTHOR

...view details