తెలంగాణ

telangana

ఎడారి దేశంలో భారీ వర్షం- గంటలోనే ఏడాదిన్నర వాన- దుబాయ్​లో ఎటు చూసినా నీరే! - Heavy Rains In Dubai

By ETV Bharat Telugu Team

Published : Apr 17, 2024, 11:05 AM IST

Heavy Rains In Dubai : నిత్యం ఎండలతో మండిపోయే ఎడారి దేశం యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో అకాల వర్షాలు బీభత్సం సృష్టించాయి. మంగళవారం బలమైన గాలులు, ఉరుములు మెరుపులతో కురిసిన భారీ వర్షానికి చాలా ప్రాంతాలు నీటమునిగాయి. జనజీవనం స్తంభించింది. ఎయిర్‌పోర్టులో మోకాలి లోతు నీరు చేరి విమానాల రాకపోకలు నిలిచిపోయాయి.
Heavy Rains In Dubai : దుబాయ్‌ నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తాయి.
బలమైన గాలులు, ఉరుములు మెరుపులతో కురిసిన భారీ వర్షానికి చాలా ప్రాంతాలు నీటమునిగాయి.
వరద ధాటికి ప్రధాన రహదారిలో కొంత భాగం కొట్టుకుపోయింది.
దుబాయ్​లో 142 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
దుబాయ్‌లో ఏడాదిన్నరలో నమోదయ్యే వర్షపాతం, కొన్ని గంటల్లోనే కురిసిందని అధికారులు తెలిపారు.
దుబాయ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం రన్‌వేపైకి భారీగా నీరు చేరడం వల్ల విమానాల రాకపోకలు నిలిచిపోయాయి.
విమానాల రాకపోకలు నిలిచిపోవడం వల్ల ప్రయాణికులు ఎయిర్​పోర్టులోనే చిక్కుకుపోయారు.
రన్‌వేపై మోకాలిలోతు నీటిలో విమానాలు ఉన్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
రాతి ఎడారిగా పేరొందిన ఎమిరేట్ ఆఫ్​ ఫుజైరాలో 145 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
బహ్రెయిన్‌, ఖతర్‌, సౌదీ అరేబియాలోనూ వర్షాలు కురుస్తున్నాయి.
సాధారణంగా గతంలో యూఏఈలో ఈ స్థాయి వర్షాలు చాలా అరుదు.
గత రెండు మూడు సంవత్సరాల్లో తరచూ ఇలా కుంభవృష్టి కురుస్తోంది.
వాతావారణ మార్పుల ప్రభావంతోనే ఈ పరిస్థితులు వస్తున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details