తెలంగాణ

telangana

తెలంగాణ ప్రజల గల్ఫ్​ కష్టాలకు తెర ఎప్పుడు - ఎందుకు ఇంకా వలసలు కొనసాగుతున్నాయి?

By ETV Bharat Telangana Team

Published : Feb 22, 2024, 10:03 AM IST

Updated : Feb 22, 2024, 10:21 AM IST

Telangana People Difficulties in Gulf : దుబాయ్‌లో జైలు శిక్ష అనుభవిస్తున్న ఐదుగురు తెలంగాణ వాసులకు ఎట్టకేలకు విముక్తి లభించింది. అయితే ఇలా ఎంతో మంది ప్రజలు గల్ఫ్​ దేశాలకు వెళ్లి అక్కడి జైళ్లలో మగ్గిపోతున్నారు. మరి అసలు తెలంగాణ ప్రజల గల్ఫ్​ కష్టాలకు తెర ఎప్పుడు?

Gulf Crisis of Telangana People End
When Will The Gulf Crisis of Telangana People End

Telangana People Difficulties in Gulf : దుబాయ్‌లో జైలు శిక్ష అనుభవిస్తున్న ఐదుగురు తెలంగాణ వాసులకు ఎట్టకేలకు విముక్తి లభించింది. ఓ హత్యకేసులో 18 ఏళ్లుగా వీరు జైలు శిక్ష అనుభవిస్తున్నారు. వారికోసం చేసిన అనేక ప్రయత్నాల తర్వాత కనికరించిన దుబాయ్​ కోర్టు వారిని ఏడేళ్లు ముందే విడుదల చేసింది. దీంతో సిరిసిల్ల, రుద్రంగి, కొనరావుపేట మండలానికి చెందిన ఐదుగురు సుదీర్ఘ నిరీక్షణల తర్వాత దుబాయ్ నుంచి హైదరాబాద్‌ తిరిగి వచ్చారు.

18 ఏళ్ల తర్వాత కుటుంబ సభ్యులను కలుసుకోవడంతో శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో భావోద్వేగ వాతావరణం నెలకొంది. అయితే వీరి కథ సుఖాంతమైంది. కానీ ఆ గల్ఫ్‌ జైళ్లలో మగ్గిపోతున్న మరెంతోమంది పరిస్థితేంటి? అసలు తెలంగాణ రాష్ట్ర ప్రజల గల్ఫ్‌ కష్టాలకు తెర ఎప్పుడు? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.

Telangana People Released From Dubai Jail :రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఐదుగురు కూలీలు కూలీ పనుల కోసం దుబాయ్ వెళ్లారు. అక్కడ నేపాల్​కు చెందిన వాచ్​మెన్​ బహదూర్​ సింగ్​ హత్య కేసులో నేరస్థులుగా మారారు. ఈ కేసులో 10 మంది ఆరోపణలు ఎదుర్కొగా, తెలంగాణకు చెందిన ఐదుగురు అందులో ఉన్నారు. దీంతో తొలుత పదేళ్ల జైలు శిక్ష విధించిన దుబాయ్​ కోర్టు, నేరం నిరూపణ కావడంతో ఆ శిక్షను 25 ఏళ్లకు పెంచింది.

ఈ విషయం ఈనాడు దినపత్రిక ద్వారా 2011లో కేటీఆర్​ దృష్టికి వెళ్లింది. దీంతో వారిని రప్పించేందుకు యత్నించారు. స్వయంగా నేపాల్​కు వెళ్లి బాధిత కుటుంబానికి రూ.15 లక్షల పరిహారం ఇచ్చి క్షమాభిక్ష రాయించారు. ఆ తర్వాత అక్కడి ప్రభుత్వం మారడంతో నిబంధనలు కఠినతరం కావడంతో విడుదల జాప్యమైంది. బాధితులకు అక్కడి భాష తెలియకపోవడం, ఎవరిని ఆశ్రయించాలో తెలియక ఇబ్బంది పడుతున్న కుటుంబ సభ్యులకు కేటీఆర్​ న్యాయ పోరాటం కోసం ఆర్థిక సహాయం అందించారు. మరోసారి బాధితుల అనారోగ్య కారణాలు చూపుతా మాజీ మంత్రి కేటీఆర్​ న్యాయ పోరాటం చేశారు. ఆఖరికి ఎన్నో ప్రయత్నాల అనంతరం కోర్టు క్షమాభిక్ష ప్రసాదించడంతో కార్మికులు స్వదేశానికి రావడానికి మార్గం సుగమమైంది.

Last Updated :Feb 22, 2024, 10:21 AM IST

ABOUT THE AUTHOR

...view details