తెలంగాణ

telangana

ఉమెన్స్​ డే స్పెషల్ : ​'స్త్రీ'నిమా లోకం - తొలితరం మహిళా దర్శకురాలు ఎవరో తెలుసా?

By ETV Bharat Telugu Team

Published : Mar 8, 2024, 6:11 AM IST

Womens Day 2024 Tollywood Lady Directors: నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని తెర వెనుక ఉన్న 'స్త్రీ'నిమా లోకం గురించి తెలుసుకుందాం. అలాగే తొలి తరం మహిళా దర్శకురాలు ఎవరో కూడా చూద్దాం.

ఉమెన్స్​ డే స్పెషల్ : ​'స్త్రీ'నిమా లోకం - తొలితరం మహిళా దర్శకురాలు ఎవరో తెలుసా?
ఉమెన్స్​ డే స్పెషల్ : ​'స్త్రీ'నిమా లోకం - తొలితరం మహిళా దర్శకురాలు ఎవరో తెలుసా?

Womens Day 2024 Tollywood Lady Directors: మహిళలు ఈ మధ్య కాలంలో మగవాళ్లకు పోటీగా అన్నీ రంగాల్లో సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. ఇక సినీ ఫీల్డ్​ విషయానికొస్తే తెరపైనే కాదు తెరవెనుక కూడా రాణిస్తున్నారు. ఆర్టిస్టులకు మేకప్‌ వేసే దగ్గర నుంచి యాక్షన్‌ చెప్పడం, నిర్మాణ బాధ్యతలు చూసుకోవడం సహా అన్ని విభాగాల్లోనూ ముందుకు దూసుకెళ్తున్నారు. తమ ప్రతిభతో సినీ రంగానికి మరిన్ని రంగులు అద్దుతూ ఆకట్టుకుంటున్నారు. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని తెర వెనుక ఉన్న 'స్త్రీ'నిమా లోకం గురించి తెలుసుకుందాం.

భానుమతి రామకృష్ణ- తెలుగు చిత్ర పరిశ్రమ తొలితరంలో భానుమతి రామకృష్ణ దర్శకురాలిగా రాణించారు. ఆ తర్వాత నిర్మాతగా, నేపథ్య గాయనిగా కెరీర్​లో ముందుకెళ్లారు. వర విక్రయం, చండీరాణి చిత్రాలకు దర్శకత్వం వహించారు. సావిత్రి ఆరు సినిమాలకు డైరెక్షన్ చేశారు. విజయ నిర్మల 44 చిత్రాలకు దర్శకత్వం వహించి గిన్నిస్‌ రికార్డుల్లోనూ ఎక్కారు.

జీవితా రాజశేఖర్- ఎవడైతే నాకేంటి, సత్యమేవ జయతే, మహంకాళి చేయగా బి. జయ - చంటిగాడు, లవ్లీ, సుచిత్ర చంద్రబోస్​- పల్లకిలో పెళ్లి కూతురు, శ్రీప్రియ - దృశ్యం సినిమాలు చేశారు.

నందిని రెడ్డి- ఇప్పటి తరం వారిలో నందిని రెడ్డి తొలి సినిమాతోనే ఉత్తమ నూతన దర్శకురాలి’గా నంది పురస్కారం అందుకుంది. అలా మొదలైందితో ప్రయాణం మొదలైంది. కళ్యాణ వైభోగమే, జబర్దస్త్​, ఓ బేబీ, అన్నీ మంచి శకునములే వంటి చిత్రాలు చేసింది. ఇక సుధా కొంగర - గురు, ద్రోహి, ఆకాశమ నీ హద్దురా చేశారు.

లక్ష్మీ సౌజన్య- వరుడు కావలెను, చునియా - పడేశావే, శేష సింధు - చూసి చూడంగానే, అక్షతా శ్రీనివాస్ - శేఖం గారి అబ్బాయి, శ్రీరజనీ - రంగుల రాట్నం, సంజనా రెడ్డి - రాజుగాడు సినిమాలను తెరక్కించారు. ఎంఎస్​ నారాయణ కుమార్తె శశికిరణ్​ కూడాదర్శకురాలే. సాహేబా సుబ్రహ్మణ్యం సినిమా చేసింది.

ఫర్హా ఖాన్- ఓం శాంతి ఓం’ సినిమాతో అన్ని భాషల్లో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. బుల్లితెరపై కూడా న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. రైటర్‌గా, నిర్మాతగా, దర్శకురాలిగా, డ్యాన్సర్‌గా, కొరియోగ్రాఫర్‌గా వర్క్ చేస్తూ మల్టీటాలెంటెడ్‌ అనిపించుకుంటున్నారు.

ఇలా చెప్పుకుంటూ పోతే సినీ రంగంలో దర్శకత్వం వహిస్తున్న మహిళా కెప్టెన్లు ఎంతో మంది ఉన్నారు. అనుకున్నది సాధించడంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా ధైర్యంగా ముందుకెళ్తున్నారు. అలాంటి మహిళలకు, వాళ్లను చూసి స్ఫూర్తి పొందుతున్న కెరీర్​లో ముందుకు వెళ్తున్న నేటి యువతులకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.

'9వ తరగతి వరకు చెప్పులు లేకుండానే - వాటిని భరించలేక ఇండస్ట్రీకి వచ్చా'

పెరుగుతున్న సుహాస్ క్రేజ్​ - రూ.1000తో మొదలై ఇప్పుడు ఒక్కో సినిమాకు ఎన్ని కోట్లంటే?

ABOUT THE AUTHOR

...view details