తెలంగాణ

telangana

ఈ వారమే గుంటూరు కారం, కెప్టెన్ మిల్లర్​ - మొత్తం 25కుపైగా సినిమా/సిరీస్​లు రెడీ

By ETV Bharat Telugu Team

Published : Feb 5, 2024, 6:43 AM IST

Updated : Feb 5, 2024, 6:51 AM IST

This Week Release Movies : ఎప్పటిలాగే ఈ వారం కూడా పలు ఇంట్రెస్టింగ్​ అండ్ హిట్ సినిమా/సిరీస్​లు అటు థియేటర్​లో ఇటు ఓటీటీలో రిలీజ్​కు రెడీ అయిపోయాయి. మొత్తం 25కు పైగా వస్తున్నాయి. వీటిలో ఓ మూడు సినిమాలు మాత్రం ఆడియెన్స్​ను బాగా అట్రాక్ట్​ చేస్తున్నాయి. ఆ వివరాలను తెలుసుకుందాం.

Etv Bharat
Etv Bharat

This Week Release Movies : గతవారం బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాలు సందడి చేసిన సంగతి తెలిసిందే. దాదాపు ఐదు సినిమాల వరకు థియేటర్లలో విడుదలయ్యాయి. కానీ అందులో ఒకటి, రెండు సినిమాలు మినహా ఆడియెన్స్​ను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. ఇప్పుడు మళ్లీ కొత్త వారం మొదలైపోయింది. వీకెండ్‌ ముగిసింది కాబట్టి మూవీ లవర్స్​ ఎప్పటి లాగే మళ్లీ వర్క్‌ మోడ్‌లోకి వెళ్లిపోతారు. అయితే సాయంత్రం పూట ఏమైనా తొందరగా వచ్చినా లేకపోతే లేట్ నైట్​ పడుకునేవారికి కాస్త సినిమా/సిరీస్​లు చూసే ఆసక్తి ఉంటుంది. అలాంటి వారి కోసం కొన్ని చిత్రాలు ఓటీటీలో రెడీగా ఉన్నాయి. అలాగే వచ్చే వీకెండ్​ కోసం కొన్ని స్ట్రీమింగ్​కు సిద్ధంగా ఉన్నాయి.

వీటిలో మహేశ్ బాబు 'గుంటూరు కారం', కోలీవుడ్ స్టార్‌ హీరో ధనుశ్ 'కెప్టెన్ మిల్లర్‌', కన్నడ స్టార్‌ దర్శన నటించిన హిట్ చిత్రం 'కాటేరా' స్ట్రీమింగ్‌కు వచ్చేస్తున్నాయి. ఇంకా భూమి ఫెడ్నేకర్ క్రైమ్ థ్రిల్లర్‌ 'భక్షక్‌', సుస్మితా సేన్ 'ఆర్య-3' వెబ్ సిరీస్ కూడా వచ్చేస్తున్నాయి. ఇంకా ఏఏ చిత్రాలు రాబోతున్నాయో చూసేద్దాం.

థియేటర్​లో ఫిబ్రవరి 8న 'యాత్ర 2', ఫిబ్రవరి 9న 'ఈగల్'​, 'లాల్ సలామ్'​, 'తేరీ బాతోన్ మెయిన్ యైసా ఉలిజా జియా'(కృతిసనన్​ - షాహిద్ కపూర్) రిలీజ్ కానున్నాయి. కోలీవుడ్‌ నటుడు జీవా ప్రధాన పాత్రలో మహి వి. రాఘవ్‌ దర్శకత్వంలో 'యాత్ర' సినిమాకు సీక్వెల్‌గా రూపొందింది 'యాత్ర 2'. మాస్ మాహారాజా రవితేజ ప్రధాన పాత్రలో 'ఈగల్' రాబోతుంది. సూపర్ రజనీకాంత్​ గెస్ట్​ రోల్​లో 'లాల్​ సలామ్'​ ప్రేక్షకుల్ని పలకరించనుంది.

నెట్​ఫ్లిక్స్​లో

  • ఆక్వామాన్ అండ్ ది లిస్ట్ కింగ్‌డమ్ - ఫిబ్రవరి 05
  • డీ అండ్ ఫ్రెండ్స్ ఇన్ ఓజ్ (యానిమేషన్ సిరీస్)- ఫిబ్రవరి 05
  • మాంక్ సీజన్స్(అమెరికన్ సిరీస్)- ఫిబ్రవరి 05
  • ది రీ-ఎడ్యుకేషన్ ఆఫ్ మోలీ సింగర్(అమెరికన్ సిరీస్)-ఫిబ్రవరి 05
  • మై వైఫ్ అండ్ కిడ్స్ సీజన్స్(కిడ్స్ సిరీస్)-ఫిబ్రవరి 05
  • రైల్: ది లాస్ట్ ప్రొఫెట్(డాక్యుమెంటరీ సిరీస్)- ఫిబ్రవరి 07
  • లూజ్: ది లైట్ ఆఫ్ హార్ట్ (బ్రెజిలియన్ కిడ్స్ సిరీస్)- ఫిబ్రవరి 07
  • లవ్ నెవర్ లైస్ పోలాండ్- సీజన్ 2 -పార్ట్ 2 -ఫిబ్రవరి 07
  • వన్ డే (వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 08
  • మహేశ్ బాబు గుంటూరు కారం(తెలుగు)- ఫిబ్రవరి 09(Gunturkaram Netflix OTT Release)
  • భూమి పెడ్నేకర్​ భక్షక్-(హిందీ క్రైమ్ థ్రిల్లర్‌ )- ఫిబ్రవరి 09
  • ఫిబ్రవరి 9 ఏ కిల్లర్​ పారాడాక్స్​(కొరియన్​ సిరీస్​)
  • లవర్ స్టాకర్ కిల్లర్ ( డాక్యుమెంటరీ సిరీస్)- ఫిబ్రవరి 09
  • యాషెస్ ( టర్కీ సిరీస్)- ఫిబ్రవరి 09
  • హారిబుల్ బాసెస్ - ఫిబ్రవరి 10
  • ఆల్ఫా మేల్స్ -సీజన్ 2 (స్పానిష్ సిరీస్)- ఫిబ్రవరి 09
  • బ్లాక్‌లిస్ట్ సీజన్- 10- ఫిబ్రవరి 11

అమెజాన్​ ప్రైమ్​లో

  • కెప్టెన్ మిల్లర్(తెలుగు డబ్బింగ్ మూవీ) - ఫిబ్రవరి 9(Captain Miller OTT Release)

ఆహాలో

  • బబుల్​గమ్​ ప్రీమియర్స్​ - ఫిబ్రవరి 9

జీ5లో

  • హిట్​ మూవీ కాటేరా(కన్నడ డబ్బింగ్ మూవీ) - ఫిబ్రవరి 9(Katera OTT Release)
  • లాంత్రానీ(హిందీ సినిమా) - ఫిబ్రవరి 9

డిస్నీ హాట్ స్టార్​లో

  • ఆర్య: అంతిమ్ వార్-సీజన్-3(వెబ్ సిరీస్) - ఫిబ్రవరి-0 9

బుక్ మైషోలో

  • అక్వామాన్​ అండ్ ది లాస్ట్ కింగ్​డమ్​ - ఫిబ్రవరి 5

విడుదలైన 19 ఏళ్లకు ఓటీటీలో - అమితాబ్​ 'బ్లాక్' మూవీ ఎక్కడ స్ట్రీమ్ అవుతోందంటే ?

ఆన్‌లైన్‌లో ఈ స్టార్స్ ఎటువంటి ఫుడ్ ఆర్డర్ చేస్తారంటే?

Last Updated :Feb 5, 2024, 6:51 AM IST

ABOUT THE AUTHOR

...view details