ETV Bharat / entertainment

విడుదలైన 19 ఏళ్లకు ఓటీటీలో - అమితాబ్​ 'బ్లాక్' మూవీ ఎక్కడ స్ట్రీమ్ అవుతోందంటే ?

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 4, 2024, 7:41 PM IST

Amitabh Bachchan Black Movie : అమితాబ్ బచ్చన్, రాణి ముఖర్జీ లీడ్​ రోల్స్​లో తెరకెక్కిన 'బ్లాక్​' మూవీ 19 ఏళ్ల తర్వాత ఓటీటీలో స్ట్రీమ్​ అవుతోంది. ఆ విశేషాలు మీ కోసం

Amitabh Bachchan Black Movie
Amitabh Bachchan Black Movie

Amitabh Bachchan Black Movie : బాలీవుడ్​లో ఓ సినిమా రిలీజైన 19 ఏళ్లకు ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ రూపొందించిన 'బ్లాక్' మూవీ ఇప్పుడు ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్​ఫ్లిక్స్ వేదిక స్ట్రీమ్​ అవుతోంది. ఈ మేరకు నెట్​ఫ్లిక్స్ ఓ స్పెషల్ వీడియోను షేర్ చేసి ఈ విషయాన్నిఅనౌన్స్​ చేసింది.

"బ్లాక్ సినిమా విడుదలై 19 సంవత్సరాలు అయ్యింది. ఈ రోజు నెట్ ఫ్లిక్స్ లోకి ఈ చిత్రాన్ని తీసుకొస్తున్నాం. దేబ్రాజ్, మిచెల్ ప్రయాణం మా అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచింది. మీకు కూడా స్ఫూర్తిని కలిగిస్తుందని మేము భావిస్తున్నాం" అంటూ ఆ వీడియోను పోస్ట్ చేశారు.

Black Movie Cast : దేబ్రాజ్ అనే టీచర్​ రోల్​లో బిగ్​బీ అమితాబ్ బచ్చన్ కనిపించారు. సీనియర్ నటి రాణి ముఖర్జీ ఇందులో చెవిటి, చూపు కోల్పోయిన అమ్మాయిగా కనిపించింది. అయేషా కపూర్, షెర్నాజ్ పటేల్, ధృతిమాన్ ఛటర్జీ ఈ సినిమాల్లో కీలక పాత్రలు పోషించారు. 2005లో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో సంచనల విజయాన్ని సాధించింది. అంతే కాకుండా ప్రశంసలతో పాటు పలు అవార్డులను సైతం అందుకుంది.

Black Movie Awards : ఇక 'బ్లాక్' సినిమాలో అమితాబ్ బచ్చన్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక ఇందులో ఆయన నటనకు గానూ అమితాబ్ బెస్ట్​ యాక్టర్​గా నేషనల్ అవార్డును అందుకున్నారు. ఇక 2006లో జరిగిన ఫిల్మ్‌ ఫేర్ అవార్డ్స్​లో, ఉత్తమ చిత్రం, ఉత్తమ చిత్రం (క్రిటిక్స్), బెస్ట్ యాక్టర్ (అమితాబ్ బచ్చన్​), బెస్ట్​ యాక్ట్రెస్​(రాణి ముఖర్జీ), బెస్ట్​ డైరెక్టర్ (సంజయ్​ లీలా భన్సాలీ), సహా మొత్తం 11 విభాగాల్లో అవార్డులను దక్కించుకుంది.

స్టోరీ ఏంటంటే ?
హీరోయిన్‌(రాణీ ముఖర్జీ)కి కళ్లు కనబడవు. చెవులు కుడా వినబడవు. ఆమెకు టీచర్‌ అమితాబ్‌ బచ్చన్‌. వీరి మధ్య మంచి అనుబంధం ఏర్పడుతుంది. అయితే అమితాబ్​కు క్రమంగా అల్జీమర్స్‌ (మతిమరుపు) వస్తుంది. దీంతో ఆయన రాణి ముఖర్జీని మరిచిపోతారు. ఆ తర్వాత ఏం జరిగిందనేదే అసలు స్టోరీ. ఈ ఎమోషనల్​ సినిమాకు చాలా మంది కనెక్టయ్యారు.

నేషనల్ అవార్డులు - అత్యధిక సార్లు ఈ పురస్కారాన్ని అందుకున్న నటుడెవరంటే ?

కుమార్తెకు బిగ్​బీ కాస్ట్​లీ గిఫ్ట్​ - విలువ తెలిస్తే షాకవ్వాల్సిందే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.