ETV Bharat / entertainment

ఆన్‌లైన్‌లో ఈ స్టార్స్ ఎటువంటి ఫుడ్ ఆర్డర్ చేస్తారంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 4, 2024, 6:04 PM IST

Actors Favourite Food Item In Online :తమకు సమయం దొరికి, నచ్చిన ఫుడ్‌ తినాలనుకున్నప్పుడు ఈ స్టార్స్​ ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ పెట్టి తెప్పించుకునేవి ఏంటో తెలుసా ?

Telugu Actors Favourite Food Item In Online
Telugu Actors Favourite Food Item In Online

Actors Favourite Food Item In Online : ఎప్పుడూ ఇంట్లో తినీ బోర్‌ కొట్టినప్పుడో, లేకుంటే డైటింగ్‌ చేస్తున్న సమయంలో చీట్‌మీల్‌ తినాలకున్నప్పుడో మనం బయటి ఫుడ్​పై ఫోకస్​ పెడుతాం. ఒకప్పుడు అయితే బయటికి వెళ్లి తినడం చేసే వాళ్లం. ఇప్పుడు ఆన్​లైన్​ ఫుడ్​ డెలివిరీ సర్వీస్​ల వల్ల నిమిషాల్లో ఇంటికే మనకు నచ్చిన వంటకాలు వస్తున్నాయి. అయితే మనలాగే సెలబ్రిటీలు కూడా తమకు టైమ్​ దొరికినప్పుడు, నచ్చిన ఫుడ్‌ తినాలనుకున్నప్పుడు ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ పెట్టి తెప్పించుకునేవి ఏంటో తెలుసా?

  • ఫస్ట్​ నుంచి నాన్​ వెజ్​ ఎక్కువగా తినడం అలవాటు. ఒకటి రెండు ఐటమ్స్‌తో సరిపెట్టుకోకుండా రకరకాల ఫుడ్​ను కోరుకుంటాను. ఎంత డైటింగ్​లో ఉన్నా కూడా ఏడు లేదా ఎనిమిది రోజులకు ఓ సారి చీట్‌మీల్‌ ఉండాల్సిందే. ఇక ఆ రోజు రకరకాల బిర్యానీలు, కూరలతో పాటు ఘాటుగా ఉండే రొయ్యల పలావ్‌ కూడా తెప్పించుకుంటాను. బయట నుంచి ఆర్డర్‌ చేసుకోవడమే కాదు నాకు కుకింగ్​ కూడా వచ్చు. సెట్‌లో ఉన్న వాళ్ల టెస్టుకు తగ్గట్లుగా ఆతిథ్యం ఇవ్వడం నాకు ఓ హాబీ. - ప్రభాస్
  • ఫిట్‌గా ఉండటానికి డైటింగ్‌ తప్పనిసరి. అయితే ఒక్కోసారి సినిమాలో రోల్​కు తగినట్టు బరువు పెరగడమో లేకుంటే తగ్గడమో చేస్తుంటాం. అలాంటి సమయంలో ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ చెప్పిందే తినాల్సి ఉంటుంది. కానీ షూటింగ్‌ మధ్యలో బ్రేక్​ దొరికినప్పుడో, లేకుంటే పండుగల సమయంలోనో నాకు నచ్చినవి తినే ఛాన్స్​ దొరుకుతుంది. అప్పుడు ఆన్‌లైన్‌లో నాకు ఎంతో ఇష్టమైన పచ్చిపులుసు, ముద్దపప్పు, మటన్‌, రొయ్యల వేపుడు ఆర్డర్‌ పెట్టుకుంటాను. వేడి వేడి అన్నంలో పచ్చిపులుసు, పప్పు, నెయ్యి వేసుకుని తింటుంటే ఆ రుచే వేరు. అందులోకి మటన్‌, రొయ్యల వేపుడు నంజుకుంటే ఇంకా అద్భుతంగా అనిపిస్తుంది. నాకెంతో ఇష్టమైన ఈ ఫుడ్​ను నా ఫ్రెండ్స్​కు కూడా అప్పుడప్పుడూ రుచి చూపిస్తుంటాను. - నాగచైతన్య
    • " class="align-text-top noRightClick twitterSection" data="">
  • చిన్నప్పటి నుంచి నాకు ఇంట్లో చెంచాల కొద్దీ నెయ్యి వేసిన ముద్దపప్పు అన్నాన్ని తినిపించేవారు. అయితే నాకు మాత్రం బేకరీ ఫుడ్‌ చాలా నచ్చేది. అమ్మ డాక్టర్‌ కావడం వల్ల హెల్త్​కు ఎక్కువ ఇంపార్టెన్స్​ ఇచ్చేది. అందుకే అవి తినడానికి ఒప్పుకునేది కాదు. నేను నా ఫ్రెండ్స్​తో బయటకు వెళ్లినప్పుడు మా అమ్మకు తెలియకుండా ప్లమ్‌ కేక్‌, బనానా పుడ్డింగ్​ను ఇష్టపడి తినేదాన్ని. ఇప్పటికి కూడా ఏమీ తోచకపోతే వాటిని ఆర్డర్‌ చేసుకుని తింటుంటాను. అలాగే మల్బరీ క్రీమ్‌తో చేసే షా దూధ్‌ మలై కూడా నాకు చాలా చాలా ఇష్టం. నా ఫోన్‌లోని ఫుడ్‌ ఆప్స్‌ ఆర్డర్స్‌ హిస్టరీలో చాలావరకు ఈ ఐటమ్సే కనిపిస్తాయి. - శ్రీలీల
  • చిన్నప్పుడు నేను హాస్టల్‌లో ఉండటం వల్ల నాకు ఇష్టమైన ఫుడ్‌ని చాలా మిస్‌ అయ్యాను. సినిమాల్లోకి వచ్చాక ఫిట్‌నెస్‌ కోసం నేను అసలు తినడం లేదు. సహజంగా నేను ఫుడీని. నాకు బిర్యానీ అంటే చాలా ఇష్టమో. పండుగలు, ప్రత్యేక సందర్భాల్లోనూ ఇంట్లో చేసిన బిర్యానీని ఇష్టంగా తింటాను. బయట కూడా హైదరాబాదీ బిర్యానీని చూస్తే అస్సలు ఆగలేను. అసలు దాని వాసనలోనే ఏదో మ్యాజిక్‌ ఉంది. అలా కారులో హోటళ్ల ముందు నుంచి వెళ్తున్న సమయంలో బిర్యానీ వాసన వస్తే దాన్ని ఆస్వాదిస్తుంటాను. అంత ఇష్టం కాబట్టే అప్పుడప్పుడూ వేర్వేరు హోటళ్ల నుంచి తెప్పించుకుంటాను. బిర్యానీతో పాటు నా మెనూలో పిజ్జాలు కూడా ఉండాల్సిందే. అప్పుడే నాకిష్టమైన భోజనం పూర్తి అయిన ఫీలింగ్‌ నాకు కలుగుతుంది. - విజయ్​ దేవరకొండ
  • నాన్​ వెజ్​ లేనిదే నాకు ముద్ద దిగదు. ఇంట్లో అమ్మ ఎప్పడూ బియ్యం పిండి- కొబ్బరిపాల రొట్టె చేస్తుంటారు. విదేశాలకు వెళ్లి వచ్చాకా, షూటింగుల కోసం దూరప్రాంతాలకు వెళ్లి ఇంటికొచ్చాకా మా అమ్మ చాలా వెరైటీలు చేసి పెడుతుంటారు. అవన్నీ నాకెంత ఇష్టమో, హోటళ్లలో చేసే పెరీ పెరీ చికెన్‌- ఎగ్‌కార్న్‌ రైస్‌ అన్నా కూడా అంతే ఇష్టం. ఇంట్లో ఉంటే నెలకోసారైనా వాటిని తెప్పించి ఇంటిల్లిపాదికీ తినిపిస్తుంటాను. తెలుగు రాష్ట్రాలకు వస్తే మాత్రం ఉలవచారు బిర్యానీ ఆర్డర్‌ చేస్తుంటాను. నన్ను చూసి చాలామంది నువ్వు వెజ్‌ కూడా తింటావా అంటూ ఆట పట్టిస్తుంటారు. - దుల్కర్ సల్మాన్​.
    • " class="align-text-top noRightClick twitterSection" data="">

వెన్నతో పరోటా.. చికెన్‌ లేకుండా గ్రేవీ.. మన క్రికెటర్స్​ టేస్టులే వేరయా!

బావతో భలే విందు అంటూ స్టార్ హీరో కుమార్తె సందడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.