వేగంగా వచ్చి ట్రక్కును ఢీకొట్టిన బైక్- వాహనం కిందపడ్డా లక్కీగా!

By ETV Bharat Telugu Team

Published : Dec 7, 2023, 7:21 AM IST

thumbnail

Uttarakhand Bike Accident Video Viral : అతివేగంగా వస్తున్న బైక్​ ముందు వెళ్తున్న ఓ ట్రక్కును ఢీ కొట్టింది. దీంతో బైక్​పై ఉన్న వ్యక్తి పక్కన పడిపోగా ద్విచక్రవాహనం ట్రక్కు కిందకు వెళ్లింది. ఈ ఘటన ఉత్తరాఖండ్ పౌడీ గఢ్వాల్ జిల్లాలోని​ శ్రీనగర్​ ప్రాంతంలో జరిగింది. ఈ దృశ్యాలు అక్కడే ఉన్న ఓ దుకాణంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. 

శ్రీనగర్​లోని సిద్ధార్థ్​ హోటల్​ దగ్గర ఉన్న జాతీయ రహదారిపై బైక్​ అతివేగంగా వచ్చింది. అదుపుతప్పిన బైక్ ముందు ఉన్న ట్రక్కును ఢీ కొట్టింది. అయితే, బైక్ కిందపడినప్పటికీ ఆ ట్రక్కు ఆగకుండా ముందుకు వెళ్లిపోయింది. బైక్​పై ఉన్న వ్యక్తి పక్కకు పడిపోవటం వల్ల పెను ప్రమాదం తప్పినట్లైంది. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. బైక్​పై నుంచి కింద పడిన వ్యక్తి ప్రస్తుతం సురక్షితంగా ఉన్నాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్​ అవుతోంది.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.