ETV Bharat / spiritual

ఆర్ధిక సమస్యలా? శుక్రవారం ఈ స్తోత్రం పఠిస్తే లక్ష్మీదేవి కనక వర్షం కురిపించడం ఖాయం! - Kanakadhara Stotram

author img

By ETV Bharat Telugu Team

Published : May 17, 2024, 5:31 AM IST

Kanakadhara Stotram : ధనమూలం ఇదం జగత్ అని శాస్త్రం చెబుతోంది. ఈ లోకంలో మనిషి మనుగడకు డబ్బే ప్రధానం. ఎవరెన్ని చెప్పినా డబ్బు లేనిదే ఏదీ జరగదు. మరి డబ్బులు బాగా ఉండాలంటే లక్ష్మీదేవి కటాక్షం ఉండి తీరాలని హిందూ ధర్మ శాస్త్రం చెబుతోంది. ఎంత కష్టపడినా చాలీచాలని ఆదాయం, తీరని అప్పులతో విసిగి వేసారి ఉంటే, ఈ మహిమాన్విత స్తోత్రాన్ని పఠించి జరిగే అద్భుతాన్ని చూడండి. ఇంతకీ ఏమిటి ఈ స్తోత్రం? పూర్తి వివరాల కోసం కథనంలోకి వెళ్ళిపోదాం.

Kanakadhara stotram
Laxmi devi (Getty Images)

Kanakadhara Stotram : నడిచే దైవంగా పేరు గాంచిన శ్రీ ఆది శంకరాచార్యులు ఆశువుగా చెప్పిన కనకధారా స్తోత్రం అత్యంత మహిమాన్వితమైనది. కేరళలో ఓ ఇంటికి శంకరులు భిక్ష కోసం వెళ్ళినప్పుడు ఆ ఇంటి ఇల్లాలు కడు పేదరికంలో ఉండడం చూసి తట్టుకోలేని శంకరులు ఆశువుగా చెప్పిన స్తోత్రం ఈ కనకధారా స్తోత్రం. శంకరుల కృపతో ఆ రోజు ఆ పేదరాలి ఇంట కనక వర్షం కురిసింది.

మానవాళికి శంకరుల వరం కనకధారా స్తోత్రం
ఎవరైతే దారిద్య్ర బాధలతో విసిగి వేసారిపోయి ఉన్నారో, అలాంటి వారు క్రమం తప్పకుండా నియమనిష్టలతో కనకధారా స్తోత్రం పారాయణ చేస్తే ఇంట్లో కనక వర్షం కురవడం ఖాయం. సాక్షాత్తు ఆదిశంకరుల నోటి నుంచి వెలువడిన కనకధారా స్తోత్రం మానవాళికి గొప్ప వరం.

కనకధారా స్తోత్రాన్ని ఎలా పఠించాలి
లక్ష్మీ కటాక్షం కోరుకునే వారు 11 శుక్రవారాలు నియమనిష్టలతో కనకధారా స్తోత్రాన్ని పఠిస్తే ఇంట్లోకి తప్పకుండా ధన ప్రవాహం వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో అష్టైఅశ్వర్యాలు సమకూరుతాయి.

ఈ నియమాలు తప్పనిసరి
లక్ష్మీ కటాక్షం కోసం కనకధారా స్తోత్రం పారాయణ చేసే వారు ఈ కింద చెప్పిన నియమాలు తప్పనిసరిగా పాటించాలి.

  • కనకధారా స్తోత్రం శుక్రవారం పారాయణ చేసే వారు ఉదయం నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం వేళ పారాయణం చేస్తే ఫలితం పది రెట్లు ఎక్కువగా ఉంటుంది.
  • కనకధారా స్తోత్రం పూజ సమయంలో లక్ష్మీదేవి విగ్రహం కానీ, పటాన్ని కానీ ఉంచుకొని పారాయణ చేస్తున్నంత సేపు కుంకుమతో పూజ చేస్తూ ఉండాలి.
  • అమ్మవారిని శ్రీగంథంతో అలంకరించాలి.
  • కనకధారా స్తోత్రం పారాయణ సమయంలో తామరపూలు, మల్లెలు, జాజిపూలతో అమ్మవారిని పూజించాలి.
  • పూజ పూర్తయిన తర్వాత పచ్చ కర్పూరంతో శ్రీమహాలక్ష్మికి నీరాజనం ఇవ్వాలి.
  • అమ్మవారికి నైవేద్యంగా తేనె కలిపిన పచ్చిపాలు, కొబ్బరికాయ, అరటిపండ్లు, క్షీరాన్నం వంటివి నివేదించాలి.
  • చివరగా దరిద్ర బాధలు పోగొట్టమని మనసులో నమస్కరించుకుని, అమ్మవారి ఎదుట మూడు ఆత్మ ప్రదక్షిణలు చేయాలి.
  • ఇలా నియమానుసారంగా 11 శుక్రవారాలు కనకధారా స్తోత్రం పారాయణ చేసినట్లయితే సమస్త దారిద్య్ర బాధలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి.

ఇక్కడ ఒక్క విషయం తప్పకుండా గురు పెట్టుకోవాలి. ఎవరికైనా కష్టపడి పనిచేస్తేనే డబ్బు వస్తుంది. ఖాళీగా కూర్చుని పూజలు చేస్తే డబ్బులు రావు. కాకపోతే మనం చేసే పనిలో అనుకూలత, అభివృద్ధి కోరుకుంటూ నీతిగా, నిజాయితీగా ఉంటూ అమ్మవారి అనుగ్రహం కోరుకుంటూ కనకధారా స్తోత్ర పారాయణ చేస్తే తప్పకుండా ఐశ్వర్యం కలుగుతుంది. ఇది శంకరుల మాట. శ్రీ మహాలక్ష్మీదేవి తన భక్తులకు ఇచ్చిన వరం.

ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః

ముఖ్యగమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

వినాయకుడి ముందు గుంజీలు ఎందుకు తీస్తారు? అసలు విషయం తెలిస్తే మీరు కూడా! - Gunjillu In Vinayaka Temple

వ్యాపారంలో ఇబ్బందులా? బుధవారం దుర్గాదేవిని ఇలా పూజిస్తే అన్నీ క్లియర్! - Shukla Durga Ashtami 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.