ETV Bharat / spiritual

వ్యాపారంలో ఇబ్బందులా? బుధవారం దుర్గాదేవిని ఇలా పూజిస్తే అన్నీ క్లియర్! - Shukla Durga Ashtami 2024

author img

By ETV Bharat Telugu Team

Published : May 14, 2024, 5:15 PM IST

Shukla Durga Ashtami Puja Benefits In Telugu : హిందూ పంచాంగం ప్రకారం అష్టమి తిథికి ఎంతో ప్రాధాన్యం ఉంది. అష్టమి తిథికి దుర్గాదేవి అధిదేవత. వైశాఖ మాసం శుక్ల పక్షంలో వచ్చే అష్టమి తిథి దుర్గాదేవి పూజకు విశిష్టమైనది. తీరని సమస్యలతో బాధపడేవారు అమ్మవారిని ఆరాధిస్తే కష్టాల నుంచి విముక్తి పొందుతారు. మరి అమ్మవారిని ఎలా పూజించాలి? ఆ పూజాఫలం ఏమిటి?

Shukla Durga Ashtami
Shukla Durga Ashtami (Source : Getty Images)

Shukla Durga Ashtami Puja Benefits In Telugu : వైశాఖ మాసం శుక్ల పక్షంలో వచ్చే అష్టమిని శుక్ల దుర్గాష్టమి అంటారు. అయితే మే 15వ తేదీ బుధవారం శుక్ల దుర్గాష్టమి సందర్భంగా అమ్మవారిని ఎలా పూజిస్తే మంచిదో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

ఆరోజు ఏం చేయాలి?
వ్యాపారంలో అభివృద్ధి కోరుకునే వారు శుక్ల దుర్గాష్టమి రోజు బ్రహ్మీ ముహూర్తంలో నిద్ర లేచి శుచియై ఈ రోజు ఉపవాసం ఉంటానని మనసులో సంకల్పించుకోవాలి. ఇంట్లో దుర్గాదేవి ఫొటో ముందు ఆవు నేతితో దీపాన్ని వెలిగించి, రాగి పాత్రలో గంగా జలాన్ని పోసి దానిపై కొబ్బరికాయను ఉంచి కలశం ఏర్పాటు చేసుకోవాలి. అనంతరం దుర్గాష్టోత్తరం చదువుకుని అమ్మవారికి నిమ్మకాయలతో చేసిన పులిహోర నైవేద్యంగా పెట్టాలి. తర్వాత కర్పూర నీరాజనం ఇచ్చి నమస్కరించుకోవాలి.

దుర్గాదేవి ఆలయంలో పూజ
ఇంట్లో పూజ పూర్తి అయిన తర్వాత సమీపంలోని దుర్గా దేవి ఆలయానికి వెళ్లి అక్కడ అమ్మవారిని దర్శనం చేసుకుని, ఎరుపు రంగు వస్త్రాన్ని, ఎరుపు రంగులో ఉండే పుష్ప మాలను సమర్పించాలి. కుదిరితే అమ్మవారికి నిమ్మకాయల దండను కూడా ఇవ్వవచ్చు. ఇంటికి తిరిగి వచ్చి సాయంత్రం వరకు అమ్మవారి ధ్యానంలో కాలం గడపాలి. సూర్యాస్తమయం తర్వాత తిరిగి స్నానం చేసి అమ్మవారి సమక్షంలో దీపారాధన చేసి అమ్మవారికి నివేదించిన ప్రసాదాన్ని భక్తితో స్వీకరించాలి.

శుక్ల దుర్గాష్టమి పూజాఫలం
ఈ విధంగా ఎవరైతే శుక్ల దుర్గాష్టమి రోజు దుర్గా దేవిని పూజిస్తారో వారికి వ్యాపారంలో ఉన్న కష్టనష్టాలు తొలగిపోతాయి. శుక్ల దుర్గాష్టమి రోజు అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే వైవాహిక జీవితంలో ఏవైనా సమస్యలుంటే తొలగిపోయి అన్యోన్య దాంపత్యం సిద్ధిస్తుంది. శుక్ల దుర్గాష్టమి రోజు నియమ నిష్ఠలతో దుర్గాదేవిని పూజిస్తే ఎన్నో రోజులుగా జీవితంలో ఆటుపోట్లు ఎదుర్కొంటూ బాధపడేవారికి అమ్మవారి అనుగ్రహంతో అన్ని కష్టాలు తీరుతాయి. సకల మనోభీష్టాలు నెరవేరుతాయి.

ముఖ్యగమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

నాగదోషంతో రకరకాల సమస్యలా? ఆ గుడిలో మంగళవారం అలా పూజ చేస్తే చాలు! - Subramanya Swamy Temple Mopidevi

పెళ్లి లేట్ అవుతుందా? గంగా సప్తమి రోజు శివుడికి అభిషేకం చేస్తే వెంటనే మ్యాచ్​ సెట్​! - Ganga Sapthami Importance

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.