'దేశంలో ప్రజాస్వామ్యం కాదు ధనస్వామ్యం- ఎన్నికల్లో ఇండియా కూటమిదే విజయం' - Lok Sabha Elections 2024

By ETV Bharat Telugu Team

Published : May 14, 2024, 7:31 PM IST

thumbnail
Jairam Ramesh Interview (Source : ETV Bharat)

Jairam Ramesh Interview : దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ, ప్రజాస్వామ్యానికి బదులు ధనస్వామ్య ప్రభుత్వాన్ని నడిపిస్తోందని కాంగ్రెస్​ నేత, ఎంపీ జైరాం రమేశ్ ఆరోపించారు. 2024 ఎన్నికల్లో ప్రజలు బీజేపీని తిరస్కరిస్తారని, ఇండియా కూటమి అద్భుతం విజయం సాధిస్తుందని జోస్యం చెప్పారు. భువనేశ్వర్​లో ఈటీవీ భారత్​కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మరికొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.

"జూన్ 4వ తేదీన వెలువడనున్న ఫలితాల్లో ఇండియా కూటమి ఘన విజయం సాధిస్తుంది. బీజేపీని ప్రజలు గద్దె దించుతారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తుంది. యువత, మహిళలు, రైతులు, కార్మికులకు కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తుంది. అన్ని వర్గాల ప్రజలకు మేలు చేస్తుంది. 2004 నాటి రాజకీయ వాతావరణం దేశంలో మళ్లీ ఏర్పడుతుంది"

-- జైరాం రమేశ్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి

"ఒడిశాలో నవీన్ పట్నాయక్ ప్రభుత్వాన్ని నడిపించలేకపోతున్నారు. అందుకే ఆయన తన అధికారాన్ని ఒడిశాయేతర వ్యక్తులకు అప్పగిస్తున్నారు. బీజేడీ, బీజేపీతో కాంగ్రెస్​ పోరాడుతోంది. అ రెండు పార్టీల మధ్య రహస్య బంధం ఉంది. ఓటర్ల మన్ననలు పొందడానికి రెండు పార్టీలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఇదంతా డ్రామాలోనే భాగం" అంటూ జైరాం రమేశ్​ ఆరోపణలు చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.