ఒకేసారి ఓటేసిన 96 మంది కుటుంబసభ్యులు - lok sabha election 2024

By ETV Bharat Telugu Team

Published : May 7, 2024, 4:19 PM IST

thumbnail
ఒకేసారి ఓటేసిన 96మంది కుటుంబసభ్యులు (ETV Bharat)

Lok Sabha Election 2024 : లోక్​సభ ఎన్నికల మూడో విడత పోలింగ్​లో అరుదైన సంఘటన జరిగింది. కర్ణాటకలోని హుబ్బళి-ధార్వాడ్​ స్థానానికి జరిగిన పోలింగ్​లో ఒకే కుటుంబానికి చెందిన 96మంది ఓటేశారు. హుబ్బళి తాలుకాలోని నూల్వి గ్రామానికి చెందిన కంటెప్ప టోతాడ కుటుంబం ఒకేసారి వచ్చి ఓటేశారు. అనంతరం పోలింగ్​ కేంద్రం ఆవరణలో సెల్ఫీలు, ఫొటోలు దిగుతూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మూడు తరాలకు చెందిన ఓటర్లు ప్రతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఆసక్తి చూపిస్తారు. మరోవైపు అసోంలో ధిబ్రూ ఘాట్​కు చెందిన ప్రజలు ఓటు వేసేందుకు ఉత్సాహం చూపారు. పోలింగ్​ కేంద్రానికి పడవల్లో వెళ్లారు.

లోక్​సభ ఎన్నికల మూడో విడతలో భాగంగా 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 93 లోక్‌సభ నియోజకవర్గాల్లో మంగళవారం ఓటింగ్‌ జరిగింది. 1,300 మందికిపైగా అభ్యర్థులు మూడో దశలో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. వారిలో 120 మందికిపైగా మహిళలు ఉన్నారు. కర్ణాటకలో మొత్తం 28 సీట్లు ఉండగా 14 చోట్ల రెండో విడతలో ఏప్రిల్‌ 26న పోలింగ్ ముగిసింది. మిగిలిన 14 లోక్‌సభ స్థానాలకు మంగళవారమే మూడో విడతలో పోలింగ్ జరిగింది. 14 స్థానాల్లో 227 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.