ETV Bharat / Pawan Kalyan Birthday Special

Pawan Kalyan Birthday Special

పవర్ స్టార్ పవన్ కల్యాణ్​ బర్త్​డే సందర్భంగా ఆయన అభిమానులతో పాటు సినీ సెలబ్రిటీలు కూడా సోషల్ మీడియా వేదికగా స్పెషల్ విషెస్ తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో పవన్ అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి కూడా నెట్టింట ఓ స్పెషల్ పోస్ట్ షేర్ చేశారు.

"కల్యాణ్‌ బాబు. ప్రతీ సంవత్సరం నీకు పుట్టినరోజు వస్తుంటుంది. కానీ, ఈ పుట్టినరోజు మరీ ప్రత్యేకం. ఆంధ్ర ప్రజానీకానికి కావలసిన సమయంలో కావాల్సిన నాయకుడు వాళ్ల జీవితంలో పెను మార్పులు తీసుకురావడానికి వాళ్ల ఇంటి పెద్ద బిడ్డగా వచ్చాడు. రాజకీయాల్లో నీతి, నిజాయితీ, నిలకడ, నిబద్ధత కలిగిన ఒక నాయకుడిగా నిన్ను వాళ్ల జీవితాల్లోకి ఆహ్వానించారు. గుండెల్లో స్థానం ఇచ్చారు. అది సుస్థిరం. ఈ రోజుల్లో నీలాంటి నాయకుడు కావాలి, రావాలి. అద్భుతాలు జరగాలి. అది నువ్వు మాత్రమే చేయగలవు, చేస్తావనే నమ్మకం నాతో పాటు ఆంధ్ర ప్రజలందరికీ ఉంది. పుట్టిన రోజు శుభాకాంక్షలు. దీర్ఘాయుష్మాన్ భవ!" అంటూ తమ్ముడ్ని ఆశీర్వదించారు చిరు.

లేటెస్ట్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.