ETV Bharat / entertainment

Ustad Bhagat Singh Poster : పవర్ స్టార్ ఫ్యాన్స్​కు 'ఉస్తాద్' ట్రీట్.. మాస్ మేనియా పోస్టర్ అదిరిందిగా

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 2, 2023, 6:57 PM IST

Updated : Sep 2, 2023, 8:33 PM IST

Ustaad Bhagat Singh Poster : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా 'ఉస్తాద్ భగత్​సింగ్' ఓ అప్​డేట్ ఇచ్చింది. మాస్ మేనియా పేరుతో ఓ పోస్టర్​ను రిలీజ్ చేసింది.

Ustad Bhagat Singh Poster
Ustad Bhagat Singh Poster

Ustaad Bhagat Singh Poster : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న 'ఓజీ', 'హరిహర వీరమల్లు' సినిమాల నుంచి ఇప్పటికే అప్​డేట్​లు వచ్చాయి. ఇక ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న మరో చిత్రం 'ఉస్తాద్ భగత్​సింగ్' మూవీ యునిట్​ కూడా.. తాజాగా ఓ అప్​డేట్ ఇచ్చింది.

హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి.. మాస్ మేనియా (Mass Mania) పేరుతో చిత్ర బృందం ఓ పోస్టర్​ను రిలీజ్ చేసింది. ఈ పోస్టర్​లో పవన్ కల్యాణ్.. లుంగీ ధరించి చేతిలో రక్తపు మరకలు ఉన్న కత్తి పట్టుకొని కూర్చున్నారు. అయితే ఈ పోస్టర్​లో పవన్​.. మాస్​ లుక్​లో అదిరిపోయారంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.

పవన్ కల్యాణ్ - హరీశ్ శంకర్​ కాంబినేషన్​లో దశాబ్దం కింద 'గబ్బర్​సింగ్' (Gabbar Singh) సినిమా వచ్చింది. ఈ సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఆ సినిమాకు సీక్వెల్​గా డైరెక్టర్ హరీశ్ శంకర్ 'ఉస్తాద్'​ను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్​కు (Glimps) మంచి రెస్పాన్స్ వచ్చింది.

పవన్​కు జోడీగా యంగ్ బ్యూటీ శ్రీలీల ఈ సినిమాలో హీరోయిన్​గా నటిస్తోంది. నటులు పంకజ్ త్రిపాఠి, అశుతోష్ రానా, నవాబ్ షా, కమెడియన్ చమ్మక్ చంద్ర తదితరులు నటిస్తున్నారు. రాక్​స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్​పై రవిశంకర్ యలమంచిలి, నవీన్ యెర్నేని ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఇక రీసెంట్​గా ఈ సినిమా షూటింగ్​ స్పాట్​ నుంచి పవన్ ఫొటోలు బయటకొచ్చాయి. ఆర్ట్‌ డైరెక్టర్‌ ఆనంద్ సాయి.. పవర్ స్టార్​తో కలిసి నడుస్తున్న ఫొటోలను ఆయన ఇన్​స్టాగ్రామ్​లో షేర్ చేశారు. అంతే ట్విట్టర్​లో #Ustaad Bhagat Singh ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. ఇందులో పవన్​ కల్యాణ్.. పోలీస్ కాస్ట్యూమ్​లో కనిపించారు. ఇక ఈ ఫొటోలు గంటల్లోనే సోషల్ మీడియాలో వైరల్​గా మారాయి. ఎలాంటి సమాచారం లేకుండానే పవర్ స్టార్ ఫొటోలు బయటకు రావడం వల్ల ఆయన ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

పవన్ మళ్లీ ఏమైంది.. థాయ్​లాండ్​కు పవర్​స్టార్​.. కన్ఫ్యూజన్​లో 'ఉస్తాద్'​ - 'ఓజీ' రిలీజ్!

OG Glimpse : చిరుతలా వేటాడుతూ పవన్ ఊచకోత.. 'ఓజీ' హంగ్రీ చీతా గ్లింప్స్ గూస్​బంప్సే

Last Updated : Sep 2, 2023, 8:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.