ఓనం స్పెషల్ ఫీస్ట్ - 17 రకాల పండ్లు, కూరగాయలతో కోతులకు ప్రత్యేక విందు! - Onam Feast To Monkeys
Published : Sep 16, 2024, 10:47 PM IST
Onam Feast To Monkeys : కేరళలో అత్యంత పవిత్రంగా జరుపుకునే పండగలలో ఓనం ఒకటి. దాదాపు పది రోజుల పాటు సాగే ఈ ఓనం పండగలో ఆట పాటలు, పసందైనా విందుతో ప్రజలను ఆనందంగా గడుపుతుంటారు. అయితే ఈ పండగలో భాగంగా కాసర్గోడ్లోని ఇడైలాక్కడ్ కావులో వందల సంఖ్యలో కోతులకు ప్రత్యేక విందును ఏర్పాటు చేయడం ప్రత్యేకంగా నిలిచింది. నవోదయ లైబ్రరీ సభ్యులు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. బొప్పాయి, దోసకాయ, సపోటా, జామ, జాక్ ఫ్రూట్, మామిడి, క్యారెట్, పుచ్చకాయ, బీట్రూట్, టమాటో, పైన్ యాపిల్, కస్టర్డ్ యాపిల్, అరటి పండు, గూస్ బెర్రీ, దానిమ్మ, అన్నం సహా మొత్తం 17 రకాల పండ్లు, కూరగాయలతో విందును ఏర్పాటు చేశారు. అరటికాలపై వీటిని వడ్డించి కోతులకు అందించారు. ఈ సందర్భంగా వందల సంఖ్యలో కోతులు విందును ఆరగించాయి. కాగా, ఈ కోతులకు ప్రత్యేక విందును ఏర్పాటు చేసే ఆచారాన్ని మొదలు పెట్టింది చలిల్ మణికమ్మ. అయితే ఈ సారి ఆమె కాస్త అనారోగ్యంతో ఉండటం వల్ల, ఆ బాధ్యతను నవోదయ లైబ్రరీ వారు తీసుకున్నారు. ఇకపోతే ఈ విందు కార్యక్రమాన్నీ వీక్షించేందుకు ఆ ప్రాంతానికి చుట్టూ ప్రక్కల ఉన్న గ్రామాల వారు కూడా తరలివచ్చారు. ఈ వేడుకలో పాల్గొని కోతులకు ఆహారాన్ని అందిస్తూ సందడి చేశారు.