Uganda Bathukamma Festival Celebrations : ఎల్లలు దాటిన బతుకమ్మ.. ఉగాండాలో సందడిగా బతుకమ్మ వేడుకలు

By ETV Bharat Telangana Team

Published : Oct 22, 2023, 7:00 PM IST

thumbnail

Uganda Bathukamma Festival Celebrations : తెలంగాణ సంస్కృతికి నిలువెత్తు నిదర్శనం బతుకమ్మ. తొమ్మిది రోజులు ఘనమైన ఉత్సవాలు.. ఆడబిడ్డల ఆనందాల ఆటపాటల వెల్లువ ఈ పండుగ. ఎంతో ప్రాశస్త్యం ఉన్న ఈ వేడుకలు కేవలం స్వరాష్ట్రంలోనే కాదు.. ప్రపంచ నలుమూలల ఎల్లలు దాటి, హద్దుల దాటి ఎంతో అట్టహాసంగా జరుగుతున్నాయి. ఉగాండా రాజధాని కంపాలాలో "తెలంగాణ అసోసియేషన్ అఫ్ ఉగాండా" ఆధ్వర్యంలో.. "తిరుమల తిరుపతి దేవస్థానం- ఉగాండా "ప్రాంగణంలో ఘనంగా బతుకమ్మ పండుగ సంబరాలు జరుపుకున్నారు. ఈ పండుగకి  ప్రాంతాలకు అతీతంగా చాలా మంది మహిళలు , పురుషులు, పిల్లలు హాజరయ్యారు.

ఈ సందర్భంగా మహిళలు బతుకమ్మ పాటలు పాడుకుంటూ, బతుకమ్మ ఆడుతూ.. తెలంగాణ సంస్కృతిని చాటిచెప్పారు. 2 గంటల పాటు సాగిన ఈ ఆటపాటల అనంతరం.. బతుకమ్మలను పక్కనే ఉన్న కొలనులో పోయిరావమ్మ బతుకమ్మ అంటూ వీడ్కోలు పలికారు. ఈ వేడుకలను చూసిన స్థానికులు... మున్ముందు జరిగే సంబురాలలో తాము కూడా భాగస్వాములవుతామన్నారు. వచ్చే ఏడాది నుంచి బతుకమ్మ సంబరాలను మరింత ఘనంగా నిర్వహిస్తామని అసోసియేషన్ నిర్వాహకులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.