Scorpions Festival at Kurnool District: కర్నూలు జిల్లాలో వింత ఆచారం.. కొండరాయుడికి తేళ్లతో పూజలు

By ETV Bharat Telugu Team

Published : Sep 5, 2023, 4:36 PM IST

thumbnail

Scorpions Festival at Kurnool District: సాధారణంగా తేళ్లను వీడియోలో చూస్తేనే ఒళ్లు జలదరిస్తుంది. అలాంటిది తేళ్లు మన కంటపడితే ఇంకేమైనా ఉందా.. అది కరవకముందే అరుస్తూ పరుగులు తీస్తాము. అయితే ఆ ప్రాంతంలో మాత్రం తేళ్లను పట్టుకుని వాటితో ఎంచక్కా ఆడుకుంటారు. అంతేకాకుండా తల, నాలుక, నుదురు, చేతులపై పెట్టుకుని విన్యాసాలు చేస్తారు. మరి ఆ తేళ్లు వాళ్లను ఏం చేయవా అని అడిగితే.. అవి తమ దేవుడికి ఇచ్చే తేళ్లు అని భక్తులు సమాధానం ఇస్తున్నారు. ఇదేంటి తేళ్లను దేవుడికి ఇవ్వటమేంటి అనుకుంటున్నారా..? ఆ ఆలయంలో స్వామివారికి వాటితో అభిషేకం కూడా చేస్తారట.. ఈ వింత ఆచారం కర్నూలు జిల్లాలోని కోడుమూరు కొండ రాయుడి ఆలయంలో ఉంది. ఏటా శ్రావణమాసం మూడో సోమవారం రోజున కోడుమూరు కొండపై కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి.. తేళ్లతో పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా తేళ్ల పండుగకు భారీ ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఈ శ్రావణ సోమవారం రోజున ఇక్కడి కొండపై ఏ చిన్న రాయి తీసినా తేళ్లు ప్రత్యక్షం కావడం ప్రత్యేకత. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.