Foreign Universities Scholarships : ఇలా చేస్తే కోరుకున్న వర్సిటీలో స్కాలర్‌షిప్‌ పక్కా..!

By

Published : May 6, 2023, 4:17 PM IST

thumbnail

Foreign Universities Scholarships : విదేశాల్లో ఉన్నత విద్యను చదివి కెరీర్‌ను అద్భుతంగా తీర్చి దిద్దుకోవాలనే అభిలాష ఎంతో మంది విద్యార్థులకు ఉంటుంది. విదేశాల్లో విద్య అంటే.. రూ.లక్షలతో కూరుకున్న వ్యవహారం. ఆర్థికంగా వెనకబడిన వారికి విదేశీ విద్యాలయాలు స్కాలర్​షిప్​లు అందజేస్తున్నాయి. స్కాలర్​షిప్​ను పొందాలంటే మాత్రం ముందు నుంచే సరైన ప్రణాళిక అవసరం అంటుంది ఈ విద్యార్థి. కానీ ఎలా ముందుకు వెళ్లాలో తెలియక చాలా మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతుంటారు. అయితే సరైన ప్రతిభ, నైపుణ్యాలు ఉంటే కోరుకున్న యూనివర్సిటీలో స్కాలర్‌షిప్‌ సాధించడం కష్టమేం కాదంటోంది విద్యార్థిని సాయిప్రియ వల్లభి.

విదేశీ విద్యాలయాల నుంచి స్కాలర్​షిప్ ఎలా​ సాధించాలో కూడా చెబుతోంది. ఇటీవలె ఉన్నత చదువు కోసం విదేశాలకు వెళ్లిన తను.. 5 ప్రతిభ ఆధారిత స్కాలర్‌షిప్‌లకు ఎంపికైంది. లక్ష్యం కోసం పరితపించే విద్యార్థులకు అనేక అవకాశాలు ఉన్నాయని.. అందుకు తన సక్సెస్‌ జర్నీనే ఉదాహరణగా చెబుతోంది. ఆ విశేషాలు తన మాటల్లోనే తెలుసుకుందాం.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.