ETV Bharat / state

పేదల పక్షపాతి సీఎం కేసీఆర్: సత్యవతి రాథోడ్​

author img

By

Published : Oct 10, 2020, 10:40 AM IST

వరంగల్​ భద్రకాళి అమ్మవారి ఆలయంలో మంత్రి సత్యవతి రాథోడ్ బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. స్వరాష్ట్రంతో తెలంగాణ ఆడపడుచులకు అన్నగా, మేనమామగా, తండ్రిగా ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా ఉంటున్నారని ఆమె అన్నారు.

bathukamma sarees distribution in warangal bhadrakali temple
పేదల పక్షపాతి సీఎం కేసీఆర్: సత్యవతి రాథోడ్​

పేదల పక్షపాతి ముఖ్యమంత్రి కేసీఆర్ పది కాలాలపాటు చల్లగా ఉండాలని భద్రకాళి అమ్మవారిని వేడుకున్నట్లు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. వరంగల్​ భద్రకాళి అమ్మవారికి ముందుగా బతుకమ్మ చీరని కానుకగా సమర్పించిన ఆమె అనంతరం అర్హులైన పేదలకు గుడిలో చీరలు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో మంత్రితోపాటు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, మేయర్ గుండా ప్రకాష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. స్వరాష్ట్రం అనంతరం తెలంగాణ ఆడపడుచులకు అన్నగా, మేనమామగా తండ్రిగా కేసీఆర్ అండగా ఉంటున్నారని ఆమె వ్యాఖ్యానించారు.

కాగా గతేడాది మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయం నుంచి బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు.

ఇదీ చదవండి: నేడు కేబినెట్ భేటీ.. చట్ట సవరణ ముసాయిదా బిల్లులపై చర్చ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.