ETV Bharat / state

కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలపై రాష్ట్రప్రభుత్వం దృష్టి - పూర్తిస్థాయి వినియోగంపై స్పెషల్​ ఫోకస్ - Telangana Govt to Get CSS Fund

author img

By ETV Bharat Telangana Team

Published : May 24, 2024, 3:57 PM IST

Telangana Govt Focus To Get CSS Funds : కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం, అందుకు సంబంధించిన నిధులు కూడా సమయానికి విడుదల అయ్యేలా తగిన కార్యాచరణ అమలు చేయనుంది. కేంద్ర మార్గదర్శకాల మేరకు ఇందుకోసం సింగిల్ నోడల్ ఏజెన్సీ ద్వారా సిస్టమ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ క్విక్ ట్రాన్స్ ఫర్స్ విధానాన్ని వినియోగించనున్నారు. ఒడిషా, రాజస్థాన్ రాష్ట్రాల్లో అధికారుల బృందం అధ్యయనం అనంతరం రాష్ట్రంలోనూ ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు.

Telangana Govt Focus To Get CSS Funds
Telangana Government to Get CSS Funds (ETV Bharat)

కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలపై రాష్ట్రప్రభుత్వం దృష్టి పూర్తిస్థాయి వినియోగంపై నజర్ (ETV Bharat)

Telangana Government to Get CSS Funds : కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల ద్వారా వీలైనన్ని ఎక్కువ నిధులు రాబట్టుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్రంలో అమలు చేయదగ్గ పథకాలను గుర్తించి కేంద్రం నుంచి నిధులు పొందేలా అన్ని శాఖలు చర్యలు తీసుకుంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి వీలైనన్ని గ్రాంట్లను రాబట్టేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఓటాన్ అకౌంట్‌లో ప్రతిపాదనలు పొందుపరిచారు. అయితే చాలా సందర్భాల్లో రాష్ట్రాలు వాటాగా ఇవ్వాల్సిన నిధులు సకాలంలో విడుదల చేయకపోవడంతో కేంద్ర ప్రాయోజిత పథకాలకు నిధులు రావడం లేదు. ఇది చాలా సందర్భాల్లో జరుగుతోంది. ఈ సమస్యను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది.

కేంద్ర నిధులు, రాష్ట్రాలు ఇచ్చే మ్యాచింగ్ గ్రాంట్లు కలిపి ప్రాయోజిత పథకాల నిధులు సకాలంలో విడుదల అయ్యేలా సింగిల్ నోడల్ ఏజెన్సీ ద్వారా సిస్టమ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ క్విక్ ట్రాన్స్‌ఫర్స్ విధానాన్ని కేంద్రం తీసుకొచ్చింది. ఈ విధానంలో కేంద్ర ఆర్థిక శాఖ, రాష్ట్ర ఆర్థిక శాఖ, రిజర్వ్ బ్యాంకు ఆధ్వర్యంలోని ఈ- కుబేర్ వ్యవస్థలు కలిసి పనిచేయాల్సి ఉంటుంది. ఆయా కేంద్ర ప్రాయోజిత పథకాలను అమలు చేసే కేంద్ర ప్రభుత్వ శాఖలు ప్రత్యేక ఖాతాలను తెరిసి వాటి ద్వారా లావాదేవీలు నిర్వహిస్తాయి. దానికి అనుసంధానంగా రాష్ట్ర ఆర్థిక శాఖ కూడా ఖాతా తెరుస్తుంది. ఆయా పథకాలకు ప్రత్యేక కోడ్ ఇచ్చి వాటి ద్వారా నిధుల విడుదల కోసం ఉత్తర్వులు జారీ చేస్తారు. తద్వారా సకాలంలో నిధులు విడుదల అయ్యి పథకాల అమలుకు ఎలాంటి ఇబ్బంది ఉండబోదని అంటున్నారు.

గుడ్​న్యూస్ - ఐదు ఎకరాలు దాటిన వారికి 'రైతుబంధు' - RYTHU BANDHU SCHEME FUNDS

పైలట్ పద్ధతికో కోసం ప్రభుత్వం ప్రయత్నం: కొన్ని రాష్ట్రాల్లో పైలట్ పద్ధతిన ఈ విధానం అమలు చేశారు. ఒడిషా, రాజస్థాన్ తదితర రాష్ట్రాలు ఈ జాబితాలో ఉన్నాయి. రాష్ట్రంలోనూ ఈ తరహా విధానాన్ని అమలు చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేసిన ఖజానా విభాగం అధికారులు ఒడిషా, రాజస్థాన్ రాష్ట్రాలలో పర్యటించారు. అక్కడ ఎస్‌ఎన్‌ఏ - స్పర్శ్ విధానం అమలవుతున్న తీరును పరిశీలించి అక్కడి అధికారులతో చర్చించారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని రాష్ట్రంలోనూ ఈ తరహా విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. అందుకు అనుగుణంగా ఆర్థికశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది.

ఈ విధానంలో కేంద్ర ప్రభుత్వంలోని సంబంధిత శాఖ, రాష్ట్ర ఆర్థికశాఖ నిధులు విడుదల ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత పథకాన్ని అమలు చేసే శాఖ మూడు రోజుల్లోగా పరిపాలనా అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విధానం అమలు కోసం ఖజానా శాఖలో ప్రత్యేక యూనిట్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఎస్ ఎన్ ఏ - స్పర్శ్ విధానంలో కేంద్ర ప్రాయోజిత పథకాల నిధుల పర్యవేక్షణ కోసం సహాయ ఖజానా అధికారి నేతృత్వంలో అకౌంట్ రెండరింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించిన బిల్స్, చెల్లింపులు, పరిశీలన, నివేదికల తయారీ, అకౌంటెంట్ జనరల్‌కు నెలవారీ నివేదికల సమర్పణ తదితరాలను ఈ విభాగం పూర్తి స్థాయిలో పర్యవేక్షించాల్సి ఉంటుంది.

పంట నష్టపరిహారం నిధుల విడుదల - ఏరోజు జమచేయనున్నారంటే - crop compensation to farmers

'రాష్ట్రంలో కరవు పరిస్థితులు ఉన్నప్పటికీ - కేంద్రం ఎలాంటి సాయం అందించట్లేదు' - Kodanda Reddy Comments

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.