ETV Bharat / health

హెచ్చరిక: ముక్కులో వేలు పెట్టి తిప్పుతున్నారా? - ఏకంగా మెదడుకే ముప్పు పొంచి ఉందట! - Side Effects of Nose Picking

author img

By ETV Bharat Telugu Team

Published : May 24, 2024, 11:42 AM IST

Updated : May 24, 2024, 12:42 PM IST

Nose Picking Health Issues: చాలా మందికి ముక్కులో వేలు పెట్టే అలవాటు ఉంటుంది. కొద్దిమంది అదే పనిగా తిప్పుతుంటారు కూడా. ఆ జాబితాలో మీరూ ఉన్నారా? అయితే.. జాగ్రత్త అంటున్నారు నిపుణులు. ఈ అలవాటు తీవ్రమైన సమస్యలకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.

Nose Picking Health Issues
Nose Picking Health Issues (Etv Bharat)

Side Effects of Nose Picking: ఏ మాత్రం గ్యాప్ దొరికినా కొంతమంది పదేపదే ముక్కులో వేలు పెట్టుకుంటుంటారు. ముక్కు దురద పెడుతుందనో.. ముక్కు శుభ్రం చేయడానికనో.. ఇలా రకరకాల కారణాల వల్ల ముక్కులో వేలు పెట్టి తిప్పుతూ ఉంటారు. అయితే.. ముక్కులో వేలు పెట్టుకునే అలవాటు ఉన్న వాళ్లు.. కేవలం ఎవరో ఏదో అంటారని కాకుండా.. తమ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడే ఈ అలవాటు వదిలేయాలని నిపుణులు చెబుతున్నారు. ఈ అలవాటు చాలా ప్రమాదకరమైనదని హెచ్చరిస్తున్నారు. అల్జీమర్స్, డిమెన్షియా వంటి ప్రమాదకరమైన వ్యాధులు వస్తాయని పరిశోధకులు చెబుతున్నారు.

అల్జీమర్స్​: ముక్కులో వేలు పెట్టుకోవడం వల్ల.. ప్రమాదకరమైన వైరల్‌, బ్యాక్టీరియల్‌, ఫంగల్‌ పాథోజెన్ల లాంటివి ముక్కు ద్వారా మెదడులోకి చేరి ఇన్‌ఫ్లమేషన్‌కు దారితీస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇది క్రమ క్రమంగా మన ఆలోచలు, జ్ఞాపకశక్తి, భాషపైనా ప్రతికూల ప్రభావం చూపుతుందని.. మెదడు జీవక్రియనూ, జీర్ణప్రక్రియ- మెదడు సంబంధాలను నియంత్రించి ఆల్జీమర్స్‌కి దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు.

ఈ దురలవాటు ఆల్జీమర్స్‌ వ్యాధికి కారణమవుతుందని 2023లో వెస్ట్రన్‌ సిడ్నీ యూనివర్సిటీలో చేసిన పరిశోధనల్లో కూడా వెల్లడైంది. వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు.. ముక్కులో వేలు పెట్టి తిప్పడం, ఆల్జీమర్స్ వ్యాధి మధ్య సంబంధాన్ని అధ్యయనం చేశారు. ఈ అధ్యయనంలో 200 మంది పెద్దలను పరీక్షించారు. వారిలో 100 మందికి ఆల్జీమర్స్ వ్యాధి ఉందని.. మరో 100 మందికి లేదని కనుగొన్నారు.

నోరు లేదా ముక్కు నుంచి దుర్వాసన వస్తోందా? - ఈజీగా తగ్గించుకోండిలా! - Mouth Bad Breath Causes

ఇదే అంశంపై ఎలుకలపై కూడా అధ్యయనాలు చేశారు. ముక్కులోని ఘ్రాణ నాడి ద్వారా ఒక సూక్ష్మజీవి ఎలుకల మెదడులోకి ప్రవేశిస్తాయని నిపుణులు అంటున్నారు. మెదడులోకి ప్రవేశించిన తర్వాత, అవి అమిలాయిడ్ బీటా ప్రోటీన్ నిక్షేపణను ప్రేరేపిస్తాయని ఇది అల్జీమర్స్ అభివృద్ధికి దారితీస్తుందని ఆస్ట్రేలియాలోని గ్రిఫిత్ యూనివర్సిటీ పరిశోధకులు నిరూపించారు. అలాగే జ్ఞాపకశక్తి కోల్పోవడం, భాషా సమస్యలు, గ్రహణశక్తి మరియు అనూహ్య ప్రవర్తన వంటి వ్యాధి యొక్క అనేక లక్షణాలకు కారణమయ్యే అమిలాయిడ్-బీటా ఫలకాలను ఏర్పరుస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి.

డిమెన్షియా: మెదడులో అమిలాయిడ్‌, ప్రొటీన్లు అసాధారణ రీతిలో పోగై మెదడు కణాలు చనిపోయేలా చేసి మతిమరుపు వ్యాధికి కారణమవుతుందని నిపుణులు అంటున్నారు. న్యుమోనియా, చిగుళ్ల సమస్యలు, హెర్పెస్‌ వంటి ఇన్‌ఫెక్షన్లూ ఈ వ్యాధితో ముడిపడి ఉన్న లక్షణాలే అంటున్నారు. అందుకే ఈ అలవాటు ఉంటే వెంటనే మానుకోవాలని సూచిస్తున్నారు. తప్పనిసరి అయితే, ముందు చేతులను శుభ్రపరచుకోవాలని.. దీనివల్ల హానికారక బ్యాక్టీరియా లోపలికి ప్రవేశించకుండా నివారించగలమని.. అప్పుడే ఆల్జీమర్స్‌తో పాటు ఇతర నరాలకు సంబంధించిన డిజార్డర్లూ రాకుండా ఉంటాయని వైద్యులు సూచిస్తున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

మీ చెవి, ముక్కు, గొంతు ఆరోగ్యంగా ఉన్నాయా? - ఇవి పాటించకుంటే అంతే!

దగ్గు తీవ్రంగా వేధిస్తోందా? - అయితే అది 100 రోజుల దగ్గు కావొచ్చు!

ముక్కు దిబ్బడతో ఇబ్బంది పడుతున్నారా? ఈ చిట్కాలు పాటించండి!

Last Updated : May 24, 2024, 12:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.