ETV Bharat / state

anthrax symptoms: వరంగల్‌ జిల్లాలో ఆంత్రాక్స్‌ కలకలం

author img

By

Published : Oct 26, 2021, 12:11 PM IST

Updated : Oct 26, 2021, 3:33 PM IST

anthrax symptoms, anthrax  to sheeps in warangal district
వరంగల్‌ జిల్లాలో ఆంత్రాక్స్‌ కలకలం, గొర్రెలకు ఆంత్రాక్స్ వ్యాధి సోకినట్లు ప్రాథమిక నిర్ధరణ

12:07 October 26

వరంగల్‌ జిల్లాలో ఆంత్రాక్స్‌ కలకలం

వరంగల్‌ జిల్లాలో ఆంత్రాక్స్‌ కలకలం

వరంగల్ జిల్లాలో ఆంత్రాక్స్(anthrax symptoms) కలకలం రేపుతోంది. దుగ్గొండి మండలం చాపలబండ గ్రామంలో గొర్రెలకు ఆంత్రాక్స్(anthrax symptoms) వ్యాధి సోకినట్లు ప్రాథమికంగా  నిర్ధారణ అయింది. తదుపరి పరీక్షల కోసం నమూనాలు హైదరాబాద్‌కు పంపించినట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు 4గొర్రెలు మృతి చెందగా... గ్రామంలోని మరో 12వందల గొర్రెలకు వైరస్‌ వైరస్ వ్యాప్తి చెందకుండా టీకాలు వేస్తున్నారు.

ఈ వ్యాధి గొర్రెల నుంచి మనుషులకు సోకినట్లయితే ప్రమాదం ఉంటుందని వెటర్నరీ అధికారులు తెలిపారు. వ్యాధి లక్షణాలు ఉన్న గొర్రెలను ఊరి బయట ఉంచాలని అధికారులు సూచించారు. ల్యాబ్ నివేదిక వచ్చిన తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయని... ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వెటర్నరీ అధికారులు వెల్లడించారు.

చాపలబండ విలేజ్​ నుంచి ఫోన్ వచ్చింది. మా పశువులు చనిపోతున్నాయని ఫోన్ చేశారు. ఒక ఎనిమల్​ని ల్యాబ్​కు తీసుకెళ్లండి అని చెప్పాం. వాళ్లు వెంటనే ల్యాబ్​కు తీసుకెళ్లారు. అక్కడ టెస్ట్ చేస్తే ఆంత్రాక్స్ వ్యాధి అని నిర్ధారించారు. మా స్టాఫ్ అందరం వచ్చి... ఇక్కడ మిగతా వాటికి ఆంత్రాక్స్ టీకా వేస్తున్నాం. దీనివల్ల మనం భయపడాల్సిన అవసరం లేదు. గాలి ద్వారా మనుషులకు సోకే అవకాశం ఉండదు. అయితే ఆ చనిపోయిన పశువుని ఓపెన్ చేయకూడదు.  దానిని ముట్టుకున్న వారి చేతులకు కాట్లు, గాయాలు ఉంటేనే ఆ బ్యాక్టీరియా మనుషులకు సోకే అవకాశం ఉంది. 

-శారద, వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌

మా ఊరిలో కొన్ని గొర్లు రెండు మూడు రోజుల క్రితం ఏదో వ్యాధి వల్ల చనిపోవడం జరిగింది. వాటిని పాతిపెట్టేసినం. నాలుగు చనిపోయాయి. వెంటనే తొగర్రాయి వెటర్నరీ డాక్టర్​ను సంప్రదించగా.. ఆమె ఒక గొర్రెను ల్యాబ్​కు పంపారు. దానికి ఆంత్రాక్స్ అనే వ్యాధి వచ్చిందని చెప్పారు. మంగళవారం ఉదయం జేడీ బాలకృష్ణ, అధికారులు గ్రామాన్ని సందర్శించారు.

-గ్రామస్థులు

ఇదీ చదవండి: Suicide attempt: డీఎస్పీ కార్యాలయం ఆవరణలో మహిళ ఆత్మహత్యాయత్నం

Last Updated :Oct 26, 2021, 3:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.