ETV Bharat / state

Ideal Village Mariyapuram : సర్పంచ్ కృషితో ఊరంతా పచ్చదనం.. అభివృద్ధిలో దూసుకెళ్తున్న 'మరియాపురం'

author img

By

Published : Aug 10, 2023, 9:09 AM IST

Ideal Villages In India Wise
Telangana Modern Villages List

Ideal Village Mariyapuram : కృషి ఉంటే.. మనుషులు ఋషులవుతారు.. మహాపురుషులవుతారు అనే గేయాన్ని నిజం చేస్తూ.. ఓ వ్యక్తి తన కృషితో వారి గ్రామాన్ని పచ్చని తివాచీ పరిచినట్లు సుందరంగా తీర్చిదిద్దారు. ఏ వీధి చూసినా.. పరిశుభ్రతతో.. పచ్చని చెట్లుతో.. పక్షుల కిలకిల రావాలతో.. ఎంతో ఆహ్లాదాన్ని పంచుతోంది. అంతేకాదు చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకూ.. వారికి ఏది అవసరమో గుర్తించి సమకూరుస్తూ.. గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నాడు.

Ideal Village in Warangal ఊరంతా పచ్చదనం.. గ్రామాల్లో మేటి మన సుందర గ్రామం "మరియాపురం"

Ideal Village Mariyapuram : వరంగల్ జిల్లా గీసుకొండ మండలానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉండే సుందర గ్రామం "మరియాపురం". ఇక్కడ రాజకీయాలకు అతీతంగా ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచి అల్లం బాల్​రెడ్డి.. తన ఊరుని ఎంతో అందంగా తీర్చిదిద్దారు. సిమెంటు రోడ్లకు ఇరువైపులా పచ్చని చెట్లు ఆహ్లాదాన్ని పంచుతాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరి చెంతకు చేరేలా కృషి చేస్తున్నారు. మహిళలు, వృద్ధులు ఆరోగ్యంగా ఉండేందుకు యోగా కేంద్రాలను ఏర్పాటు చేశారు. సర్పంచి సొంత డబ్బులతో గ్రామంలో నర్సరీలను ఏర్పాటు చేశారు. పల్లె పకృతి వనాలతో.. అందరికీ ఆదర్శంగా(Ideal Village Telangana) నిలిచిన మరియాపురం గ్రామం 2022 ఏప్రిల్‌లో ఉత్తమ జాతీయ గ్రామ పంచాయతీ అవార్డు అందుకుంది.

"గతేడాది జాతీయ స్థాయిలో ఉత్తమ జాతీయ గ్రామ పంచాయితీ అవార్డును మా గ్రామం అందుకుంది. ఈ సంవత్సరంలో రాష్ట్ర స్థాయిలో 9 అంశాలలో అవార్డులు కైవసం చేసుకున్నాం. ఇవన్నీ జరగటానికి కారణం ప్రభుత్వం గ్రామ అభివృద్ధికి ఏ కార్యక్రమం ఇచ్చినా.. దానిని తు.చ. తప్పకుండా పాటించడమే." - అల్లం బాల్​రెడ్డి, గ్రామ సర్పంచ్

ఈ ఊరు దేశానికే ఆదర్శం, ఎందుకో తెలుసా

Ideal Village Mariyapuram in Warangal : అభివృద్ధి దిశలో దూసుకెళ్తున్న మరియాపురం గ్రామ సర్పంచ్​కు మరో విన్నూత ఆలోచన వచ్చింది. నూతనంగా ఇంటి పెరటిలో సేంద్రీయ ఎరువు తయారు చేసే విధానానికి శ్రీకారం చుట్టారు. ప్రతి ఇంట్లో వర్మి కంపోస్ట్ తయారీకి చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా ఐదు ఫీట్ల పొడవాటి రెండు పైపులను తీసుకొని.. కొంతభాగం భూమిలో పాతిపెట్టి వాటిపైన రెండు మూతలను ఏర్పాటు చేశారు.

"పారిశుద్ధ్యంలో భాగంగా ప్రతిరోజూ తడిచెత్త, పొడి చెత్తను వేరుగా సేకరిస్తాం. సేంద్రీయ ఎరువులను సొంతంగా తయారు చేసుకుంటాం. మేం తయారు చేసిన ఎరువులు ఇతర గ్రామాలవారు వచ్చి వాటిని కొనుక్కుంటారు. గ్రామ పంచాయితీ పరిధిలో నర్సరీ కూడా ఏర్పాటు చేసుకున్నాం. దీని ద్వారా కిచెన్​గార్డ్​గా పూల మొక్కలు, పండ్ల మొక్కలను గ్రామప్రజలకు పంపిణీ చేస్తున్నాం." - అల్లం బాల్​రెడ్డి, గ్రామ సర్పంచ్

నిత్యం వంట గదిలో నుంచి వచ్చే కూరగాయల వ్యర్థాలు, చెత్త వివిధ రకాల వ్యర్థాలను ఆ పైపులలో వేసి మూత పెడతారు. వారానికి ఒకసారి వ్యర్థాలు వేసిన పైపులలో ఒక చెంబుడు పేడ కలిపిన నీళ్లు పోస్తారు. ఈ విధంగా 45 రోజుల పాటు చేయడం ద్వారా అందులోని వ్యర్థాలు మట్టిగా మారి వర్మీ కంపోస్ట్‌ తయారవుతుంది. దీనిని ఇండ్లలో పెంచుకుంటున్న పూల మొక్కలు, కూరగాయల మొక్కలకు పండ్ల మొక్కలకు వినియోగించుకుంటారు. అలాగే గ్రామంలోని ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలు ఏర్పాటుచేసి నీటిని నిల్వ చేసేందుకు కృషి చేస్తున్నారు. ఈ విధంగా అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్న "మరియాపురం(Mariyapuram The Ideal Village)" ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తోంది.

కరోనాను దరిచేరనీయని ఆదర్శ గ్రామం

కుక్కలకు గుడి.. రోజూ ప్రత్యేక పూజలు.. గ్రామదేవతే ఆదేశించిందట!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.