ETV Bharat / state

సరళసాగర్​ ప్రాజెక్టుకు జలకళ!

author img

By

Published : Sep 15, 2020, 12:52 PM IST

ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు వనపర్తి జిల్లాలోని పలు ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. మదనాపురం మండలం శంకరమ్మ పేట సమీపంలోని సరళసాగర్​ జలాశయానికి భారీగా వరదనీరు వచ్చి చేరింది. వరద ప్రవాహానికి ప్రాజెక్టుకు గల ఆటో సైఫన్స్​, ఉడ్స్​ వాటంతటవే తెరుచుకొని దిగువకు నీటిని విడుదల చేస్తున్నాయి.

sarala sagar project filled with flood water dot automatic uds opened
సరళసాగర్​ ప్రాజెక్టుకు జలకళ!

వనపర్తి జిల్లాలోని పలు ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లాలోని సరళసాగర్​, రామన్​పాడు జలాశయాలు నిండుకుండలా కళకళలాడుతున్నాయి. మదనాపురం మండలంలోని శంకరమ్మపేట సమీపంలో గల సరళసాగర్​ జలాశయానికి వరద నీరు పోటెత్తగా.. ప్రాజెక్టుకున్న ఆటో సైఫన్స్​, ఉడ్స్​ వాటంతటవే తెరుచుకొని దిగువకు నీటిని విడుదల చేస్తున్నాయి.

భారీగా వరదనీటి చేరికతో సరళసాగర్​ వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తూ.. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సరళసాగర్ నుంచి రామన్​పాడు జలాశయానికి వరద నీరు చేరడం వల్ల అధికారులు ఐదు గేట్లు ఎత్తి ఊకచెట్టు వాగుకు నీటిని విడుదల చేశారు. ఫలితంగా ఈ వాగుపై ఇటీవల నిర్మించిన చెక్​డ్యామ్​లు నిండుకుండలా మారాయి.

సరళసాగర్​ ప్రాజెక్టుకు జలకళ!

ఇదీ చదవండి: 'కృష్ణా జలాల వివాదాల పరిష్కారానికి కొత్త ట్రైబ్యునల్ ఏర్పాటు చేయండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.