ETV Bharat / state

HARISH:'సహకరించండి.. స్వచ్ఛ పట్టణాన్ని తయారు చేసుకుందాం'

author img

By

Published : Jul 29, 2021, 5:20 PM IST

సిద్దిపేటలోని పలు వార్డుల్లో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు మంత్రి హరీశ్​ రావు శంకుస్థాపన చేశారు. సిద్దిపేటను స్వచ్ఛ సిద్దిపేటగా తీర్చిదిద్దేందుకు ప్రజలందరూ సహకరించాలని ఆయన సూచించారు. ఖాళీ ప్లాట్లలో చెత్త వేయొద్దని, వేస్తే కాలనీ వాసులే జిమ్మేదారుగా వ్యవహరించేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్​ సిబ్బందిని మంత్రి ఆదేశించారు.

HARISH:'ప్రజలందరూ సహకరించండి.. స్వచ్ఛ పట్టణాన్ని తయారు చేసుకుందాం'
HARISH:'ప్రజలందరూ సహకరించండి.. స్వచ్ఛ పట్టణాన్ని తయారు చేసుకుందాం'

ఖాళీ ప్లాట్లలో చెత్త వేయొద్దని, వేస్తే కాలనీ వాసులే జిమ్మేదారుగా వ్యవహరించేలా చర్యలు తీసుకోవాలని సిద్దిపేట పట్టణంలోని 7వ, 9వ వార్డు ప్రజలను ఉద్దేశించి మంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రజలందరూ సహకారం అందిస్తే.. స్వచ్ఛ సిద్దిపేటను తయారు చేసుకుందామని మంత్రి ప్రజలకు సూచించారు. తడి, పొడి చెత్త వేర్వేరుగా ఇచ్చి మున్సిపల్​ సిబ్బందికి సహకరించాలని ప్రజలను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు కోరారు. సిద్దిపేట పట్టణంలో 7వ వార్డులో రూ.25 లక్షలతో సీసీ రోడ్లకు, అలాగే 9వ వార్డులో రూ.20 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అక్కడి ప్రజలతో మమేకమై మంత్రి మాట్లాడారు.

చెత్త బండొస్తుందా..

రోజూ ఇంటింటికీ చెత్త బండొస్తుందా.. వస్తే ఏ సమయానికి వస్తుందని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. తడి, పొడి చెత్త వేర్వేరుగా ఇస్తున్నారా.. లేదా అంటూ ఆరా తీశారు. 7వ వార్డులో ఓపెన్, ఖాళీ ప్లాట్లలో చెత్త తీయిస్తే.. మరోసారి వేయకుండా మీరు బాధ్యత వహిస్తామని మాట ఇవ్వాలని 7వ వార్డు కాలనీ వాసుల నుంచి మంత్రి మాట తీసుకున్నారు. ఖాళీ ప్లాట్లలో చెత్త లేకుండా క్లీన్ చేయాలని మున్సిపల్ సిబ్బందిని మంత్రి ఆదేశించారు.

మంత్రికి కాలనీవాసుల ఫిర్యాదు

పాల ప్యాకెట్లు, పెరుగు ప్యాకెట్లు, షాంపూ ప్యాకెట్లు పొడి చెత్త కిందకు వస్తాయని.. కానీ మున్సిపాలిటీ వాళ్లు తడిగా ఉన్నాయని తీసుకుపోవడం లేదని ఆయా కాలనీ వాసులు మంత్రి దృష్టికి తెచ్చారు. ఈ విషయమై తడి, పొడి చెత్తపై ప్రజలకు అర్థమయ్యేలా.. అలవాటుగా మారేందుకు ఈ విధానంతో ముందుకెళ్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ రమణాచారి మంత్రికి వివరించారు. ఇక నుంచి ఆ విధానం తీసేసి పొడి చెత్తగా తీసుకెళ్లాలని మున్సిపల్ అధికార యంత్రాంగాన్ని మంత్రి ఆదేశించారు.

కాలనీ వాసులకు తడి, పొడి, హానికరమైన చెత్తపై సమగ్రంగా వివరిస్తూ.. అవగాహన కల్పించి, మీ సహకారాన్ని అందిస్తే.. అందరికీ మేలు జరుగుతుందని ప్రజలకు అర్థమయ్యేలా మంత్రి వివరించారు. చెత్త బండొస్తే ప్రజలకు సమయం తెలిసేలా పని చేయాలని మున్సిపల్ అధికారులను మంత్రి హరీశ్ రావు ఆదేశించారు.

HARISH:'ప్రజలందరూ సహకరించండి.. స్వచ్ఛ పట్టణాన్ని తయారు చేసుకుందాం'

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.