ETV Bharat / business

ఐటీ ఉద్యోగాల్లో హైదరాబాద్​ టాప్​- దేశంలో ఆ పరిస్థితి ఉన్నా ఆగని జాబ్ పోస్టింగ్స్! - Hyderabad Tops In IT Job Postings

author img

By ETV Bharat Telugu Team

Published : May 24, 2024, 7:28 PM IST

Updated : May 24, 2024, 8:36 PM IST

Hyderabad Tops In IT Job Postings : ఐటీ జాబ్​ పోస్టింగ్స్​లో హైదరాబాద్​ దూసుకెళ్తోంది. గత ఏప్రిల్​ నెలలోనే కొత్త రిక్రూట్​మెంట్స్​ 41.5 శాతం పెరిగాయి. అయితే దేశంలో ఐటీ నియామకాలు 3.6శాతం తగ్గినా, హైదరాబాత్​లో మాత్రం జోరు కొనసాగడం గమనార్హం.

Hyderabad Tops In IT Job Postings
Hyderabad Tops In IT Job Postings (ETV Bharat)

Hyderabad Tops In IT Job Postings : దేశంలో ఐటీ రంగంలో కొత్త నియామకాలు నెమ్మదిస్తున్నా, హైదరాబాద్​ మాత్రం జోరు కొనసాగిస్తోంది. ఏప్రిల్​లో హైదరాబాద్​లో 41.5 శాతం​ ఐటీ నియామకాలు పెరిగాయి. ఈ మేరకు ఇండీడ్​ అనే ఆన్​లైన్​ జాబ్ సెర్చింగ్​ సంస్థ ఓ నివేదిక విడుదల చేసింది. దీని ప్రకారం హైదరాబాద్​ తర్వాతి స్థానంలో బెంగళూరు ఉంది. ఇక్క 24 శాతం ఐటీ నియామకాలు పెరిగినట్లు ఇండీడ్​ తన నివేదికలో పేర్కొంది. ఐటీ నిపుణుల కోసం అగ్ర గమ్యస్థానాలుగా, ఈ నగరాలకు పెరుగుతున్న ప్రాధాన్యాన్ని ఇండీడ్ నివేదిక ప్రతిబింబిస్తోంది.

ఇండీడ్​ వెబ్​సైట్​ జాబ్​ క్లిక్​లలో కూడా హైదరాబాద్, బెంగళూరు గణనీయమైన వృద్ధి సాధించాయి. హైదరాబాద్​లో పనిచేసేందుకు 161 శాతం ఉద్యోగార్థులు ఆసక్తి కనబర్చారు. ఇక బెంగళూరుపై 80శాతం మంది ఆసక్తి చూపినట్లు నివేదిక పేర్కొంది. అయితే ప్రపంచ ఆర్థిక పరిస్థితి, అనిశ్చితి కారణంగా నియామకాలు చేపట్టేందుకు ఐటీ కంపెనీలు ఆకస్తి చూపించడం లేదని తెలిపింది. ఈ కారణాల వల్ల దేశవ్యాప్తంగా ఐటీ రిక్రూట్​మెంట్స్​ 3.6శాతం తగ్గుముఖం పట్టాయని ఇండీడ్ వెల్లడించింది.

అంతేకాకుండా ఏపీఐ, జావాస్క్రిప్ట్, ఎస్​క్యూఎల్, అజైల్ వంటి సాంకేతికతల్లో నియామకాలు ఎక్కువగా జరుగుతున్నాయని తెలిపింది. ఇప్పటికే ఈ రంగంలో పనిచేస్తున్న వారే కాకుండా, కొత్త కెరీర్​ అవకాశాల కోసం చూస్తున్న వ్యక్తులు కూడా ఉద్యోగాల కోసం వెతుకున్నట్లు ఇండీడ్​ ఇండియా సేల్స్​ హెడ్​ శశి కుమార్​ తెలిపారు. 'తొలగింపులు ఉన్నప్పటికీ, ఐటీ ఉద్యోగాలకు చాలా మంది ఆకర్షితులవుతున్నారు. నైపుణ్యం, శిక్షణ, అనుభవం కారణంగా కూడా ఐటీపై ఎక్కువ ఇంట్రెస్ట్​ చూపిస్తున్నారు.' అని శశి పేర్కొన్నారు.

ఏఐ స్కిల్ ఉంటే 50% అధిక వేతనం​!
ప్రస్తుతం ఏఐ సాంకేతికత అన్ని రంగాలను డామినేట్​ చేస్తోంది. ముఖ్యంగా ఐటీ రంగంలో దీని వినియోగం క్రమంగా పెరుగుతోంది. ఈ క్రమంలో కంపెనీలు కూడా ఏఐ నైపుణ్యం కలిగిన ఉగ్యోగార్థులకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఇలాంటి వారికి 50శాతం అధిక వేతనం ఇవ్వడానికి కూడా వెనుకాడటం లేదు. ఈ మేరకు ఇలాంటి ట్రెండ్​లను ఎప్పటికప్పుడు ఫాలో అయ్యే ప్లాట్​ఫామ్​ లెవెల్స్​.ఎఫ్​వైఐ ఓ నివేదిక విడుదల చేసింది.

Last Updated : May 24, 2024, 8:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.