ETV Bharat / politics

రేపటితో ముగియనున్న గడువు - పతాకస్థాయికి చేరుకున్న పట్టభద్రుల ఉప ఎన్నిక ప్రచారం - MLC ByPoll Elections 2024

author img

By ETV Bharat Telangana Team

Published : May 24, 2024, 7:21 PM IST

Updated : May 24, 2024, 7:55 PM IST

Graduate MLC Elections Campaign 2024 : వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక ప్రచారానికి మరో రోజు గడువు మాత్రమే ఉండడంతో ఆయా పార్టీలు జోరు పెంచాయి. మూడు ఉమ్మడి జిల్లాల్లో ప్రధాన పార్టీల నేతలు సుడిగాలి పర్యటనలతో విస్తృతంగా తిరుగుతున్నారు. సన్నాహక భేటీలతో పట్టభద్రులను ఆకట్టుకునే పనిలో అభ్యర్థులు నిమగ్నమయ్యారు. నిరుద్యోగ, ఉద్యోగ, పట్టభద్రుల సమస్యలపై పోరాడే వ్యక్తులను ఎమ్మెల్సీగా ఎన్నుకోవాలంటూ అభ్యర్థిస్తున్నారు.

BJP on Graduate MLC Elections
Graduate MLC Elections Campaign 2024 (ETV Bharat)

పతాకస్థాయికి చేరుకున్న పట్టభద్రుల ఉపఎన్నిక - సుడిగాలి పర్యటనలతో హోరెత్తిన నేతల ప్రచారం (ETV Bharat)

Graduate MLC By Poll Campaign : వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఉపఎన్నిక ప్రచారం పతాకస్థాయికి చేరింది. మరో రోజు మాత్రమే గడువు ఉన్న దృష్ట్యా అభ్యర్థులు, నాయకులు జిల్లాలను చుట్టేస్తున్నారు. కాంగ్రెస్‌కు ప్రజలు దేవుళ్లైతే, కేసీఆర్​కు, ఆయన కుటుంబానికి మాత్రం బానిసలని పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మాన్ మల్లన్న విమర్శించారు. హనుమకొండలో జరిగిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఆయన ఓటు ద్వారా పట్టభద్రులు బీఆర్ఎస్ పార్టీకి బుద్ది చెప్పాలని విజ్ఞప్తి చేశారు.

"మాజీ సీఎం కేసీఆర్​కు ప్రజలంటే బానిసలు లెక్క కనిపిస్తారు. కానీ కాంగ్రెస్​కు ప్రజలంటే దేవుళ్లు. ఓటర్లంతా మహరాజులు లెక్క కనిపిస్తారు. అది వాళ్లకు మాకు ఉన్న తేడా. ఇప్పుడు బై ఎలక్షన్స్​ ఎందుకు వచ్చాయి. గులాబీ పార్టీ మాకు ఈ పదవి వద్దని చెప్పినందుకే వచ్చింది. మాకు గ్రాడ్యుయేట్స్ అవసరం లేదంటేనే ఇప్పుడు అనివార్యమైంది. కేటీఆర్​ ఏమంటారు వాళ్ల అభ్యర్థి పిట్స్​ పిలానీలో చదివాడు అంట, నేను జేఎన్టీయూ, ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలో చదువుకున్నందుకు, ఇక్కడ చదువుకున్నవాళ్లు పళ్లీ, బఠాణీగాళ్లట."- తీన్మార్​ మల్లన్న, కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి

Harish Rao Comments on Congress Govt : ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టభద్రుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి హరీశ్​రావు ఆర్నెళ్లలోనే కాంగ్రెస్‌ నిజస్వరూపం బయటపడిందని విమర్శించారు. ఆరు గ్యారంటీలు అమలయ్యేలా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలంటే పట్టభద్రులు గులాబీ పార్టీకే పట్టం కట్టాలని కోరారు. ఆర్నెళ్లలో ఉద్యోగ నోటిఫికేషన్‌, నిరుద్యోగ భృతి హామీలను తుంగలో తొక్కారని ఆక్షేపించారు. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేయాలని భారతీయ జనతా పార్టీ కుట్ర పన్నుతోందని హరీశ్‌రావు ఆరోపించారు.

"ఆరు నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ మోసాలన్నీ బట్టబయలయ్యాయి. అందరినీ మోసం చేసింది. ఒక్క హామీ అయినా నెరవేర్చిందా మీరే ఆలోచన చేయండి. ఆరింటిలో అయిదు హామీలు అయ్యాయట, కాంగ్రెస్ పార్టీ అమలు చేయనందుకే ఈ ఎన్నికల్లో ఓడగొట్టి వాళ్ల కళ్లు తెరిపించాల్సిన బాధ్యత ఇవాళ మీ అందరిపై ఉంది."- హరీశ్‌రావు , మాజీమంత్రి

హామీలను వంచించిన కాంగ్రెస్ పార్టీకి బుద్ధిచెప్పాలి : ప్రజా పక్షాన నిరంతరం పోరాడే బీజేపీ అభ్యర్థిని ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించాలి ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే పాయల్ శంకర్ విజ్ఞప్తి చేశారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్‌లో నిర్వహించిన సమావేశంలో హామీలను వంచించిన కాంగ్రెస్ పార్టీకి బుద్ధిచెప్పాలని కోరారు. ఆర్ఆర్ టాక్స్ పేరుతో తెలంగాణలో డబ్బులు వసూలు చేసి దిల్లీకి తరలిస్తున్నారని సాక్షాత్తు ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​షాలు తెలిపారని మాజీమంత్రి ఈటల రాజేందర్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూర్​లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఈటల నిరుద్యోగులను మోసం చేసిన ఘనత బీఆర్​ఎస్, కాంగ్రెస్‌కు దక్కుతాయని విమర్శించారు.

ఆ స్థానం వద్దనుకుని రాజీనామా చేసిన బీఆర్​ఎస్​ మళ్లీ పోటీ చేయడం ఎందుకు? : తీన్మార్​ మల్లన్న - Graduate MLC By election Campaign

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక - ఈ నెల 27న వారికి ప్రత్యేక క్యాజువల్​ లీవ్ - Casual leave on MLC Elections

Last Updated : May 24, 2024, 7:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.