ETV Bharat / state

KTR Speech at Sircilla Government Medical College Inauguration : 'ధాన్యం ఉత్పత్తిలోనే కాదు.. డాక్టర్ల తయారీలోనూ తెలంగాణ నంబర్​ వన్​గా ఉంది'

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 15, 2023, 5:36 PM IST

Updated : Sep 15, 2023, 6:27 PM IST

Govt Medical College in Rajanna Sircilla
KTR Inaugurated Govt Medical College in Rajanna Sircilla

KTR Speech at Sircilla Government Medical College Inauguration : ధాన్యం ఉత్పత్తిలోనే కాదు.. డాక్టర్ల తయారీలోనూ తెలంగాణ నంబర్​ వన్​గా ఉందని మంత్రి కేటీఆర్​ కొనియాడారు. ప్రధాని నరేంద్ర మోదీ పగ పట్టినట్లు తెలంగాణపై కక్ష కట్టారని కేటీఆర్​ ఆరోపించారు. తెలంగాణకు మోదీ ఒక్క మెడికల్​ కళాశాల కూడా ఇవ్వలేదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఏమీ ఇవ్వకున్నా.. సొంత నిధులతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటున్నామని హర్షం వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వ మెడికల్​ కళాశాలను ప్రారంభించిన మంత్రి కేటీఆర్​.. అనంతరం బీఆర్​ఎస్​ శ్రేణులు నిర్వహించిన భారీ ర్యాలీలో పాల్గొన్నారు.

KTR Speech at Sircilla Government Medical College Inauguration : ప్రధాని నరేంద్ర మోదీ పగ పట్టినట్లు తెలంగాణపై కక్ష కట్టారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్(KTR)​ ఆరోపించారు. తెలంగాణకు మోదీ ఒక్క మెడికల్​ కళాశాల(Telangana Medical College) కూడా ఇవ్వలేదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఏమీ ఇవ్వకున్నా.. సొంత నిధులతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటున్నామని హర్షం వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వ మెడికల్​ కళాశాలను ప్రారంభించిన మంత్రి కేటీఆర్​.. అనంతరం బీఆర్​ఎస్​ శ్రేణులు సెస్ కార్యాలయం నుంచి ప్రారంభించిన భారీ ర్యాలీని అంబేద్కర్​ కూడలి వద్ద ముగించారు. సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్​ విగ్రహం సమీపంలోనే టెట్‌ పరీక్షా కేంద్రం ఉండటంతో లంచ్‌ సమయంలోనే భారీ సభను ముగించారు.

ధాన్యం ఉత్పత్తిలోనే కాదు.. డాక్టర్ల తయారీలోనూ తెలంగాణ నంబర్​ వన్​గా ఉందని మంత్రి కేటీఆర్​ కొనియాడారు. గతంలో డిగ్రీ కళాశాలలు ఎక్కడ పెట్టాలని మల్లగుల్లాలు పడ్డామని.. కానీ నేడు సిరిసిల్లకు మెడికల్​ కాలేజీ వచ్చిందని తెలిపారు. రాష్ట్రంలో తొలి కేజీ టు పీజీ విద్యాసంస్థ గంభీరావుపేటలోనే ఉందని ఆనందం వ్యక్తం చేశారు. గతంలో రాజన్న సిరిసిల్ల ప్రభుత్వ ఆస్పత్రిలో డాక్టర్ల కొరత ఉండేదని.. కానీ ఇప్పుడు వైద్య కళాశాల ఏర్పాటుతో ఆ సమస్యకు చెక్​ పెట్టవచ్చని అన్నారు. ఇప్పుడు ఈ మెడికల్​ కాలేజీలో వంద మంది డాక్టర్లు అందుబాటులో ఉంటారని.. ఇక వైద్యుల కొరత దాదాపు తీరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

MEDICAL COLLEGES: కొత్త వైద్య కళాశాలలకు సన్నాహాలు.. రూ.18 కోట్లతో పడకల ఏర్పాటు

Rajanna Sircilla Govt Medical College Opening Today : 65 ఏళ్లలో తెలంగాణలో ఏర్పాటు చేసింది కేవలం రెండే మెడికల్​ కాలేజీలని.. కానీ తొమ్మిదిన్నర ఏళ్ల బీఆర్​ఎస్​ పాలనలో 21 మెడికల్​ కళాశాలలు నిర్మించుకున్నామని కేటీఆర్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఏమీ ఇవ్వకున్నా.. సొంత నిధులతో అభివృద్ధి చేసుకొని దేశానికే ఆదర్శంగా నిలిచామని హర్షించారు. తెలంగాణ అభివృద్ధి కొంతమందికి గిట్టడం లేదని మండిపడ్డారు.

Rajanna Sircilla District First Medical College : ఈసారి శాసనసభ ఎన్నికల్లో ఓట్ల కోసం డబ్బులు, మద్యం పంపిణీ చేయనని మంత్రి కేటీఆర్​ పునరుద్ఘాటించారు. తనను సిరిసిల్లలో.. వేములవాడలో చల్మెడ లక్ష్మీనరసింహరావును భారీ మెజారిటీతో గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. సిరిసిల్ల ప్రజల తరఫున సీఎం కేసీఆర్​కు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు మంత్రి కేటీఆర్​ వివరించారు.

ఏడాదిలో 8 వైద్య కళాశాలలు ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్​దే: హరీశ్​రావు

CM KCR Started 9 Medical Colleges Virtually : రాష్ట్రవ్యాప్తంగా మరో 9 మెడికల్​ కళాశాలను సీఎం కేసీఆర్​ హైదరాబాద్​ నుంచి వర్చువల్​గా నేడు ప్రారంభించారు. అందులో వికారాబాద్​, కరీంనగర్​, సిరిసిల్ల, జనగామ, ఖమ్మం, ఆసిఫాబాద్​, కామారెడ్డి, భూపాలపల్లి, నిర్మల్​లలో వైద్య కళాశాలను ఏర్పాటు చేశారు. ఈ కాలేజీలు కొత్తగా చేరడంతో ప్రస్తుతం రాష్ట్రంలో 26 మెడికల్​ కళాశాలలు ఉన్నాయి. ఈ కళాశాలలతో తెలంగాణ ప్రతి ఏటా 10 వేల మంది డాక్టర్లను దేశానికి అందించనుంది.

CM KCR Inaugurates 9 Medical Colleges : 'వైద్యవిద్యలో నవశకం.. ఒకేరోజు 9 వైద్య కాలేజీలు ప్రారంభించడం శుభపరిణామం'

Telangana Medical Colleges Increase : 'రాష్ట్రంలో పెరిగిన మెడికల్​ కళాశాలలు.. స్వరాష్ట్రంలోనే వైద్యవిద్యను పూర్తి చేయవచ్చు'

Last Updated :Sep 15, 2023, 6:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.