ETV Bharat / state

జీవన్​రెడ్డి మాల్​కు ఆర్టీసీ నోటీసులు - బకాయిలు చెల్లించకపోతే సీజ్ చేస్తామని వార్నింగ్

author img

By ETV Bharat Telangana Team

Published : Dec 8, 2023, 9:52 AM IST

Etv Bharat
Etv Bharat

TSRTC Notices to Jeevan Reddy Mall : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌ పట్టణంలోని జీవన్​రెడ్డి మాల్ యాజమాన్యానికి ఆర్టీసీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఆర్టీసీకి చెందిన స్థలం బకాయిలు రూ.7.23 కోట్లు చెల్లించాల్సి ఉన్నట్లు అందులో తెలిపారు. లీజు చెల్లించాల్సిందిగా నెలరోజుల కింద నోటీసులు జారీ చేసినా స్పందించక పోవడంతో మైక్ ద్వారా మాల్ వద్ద బహిరంగ ప్రకటనతో హెచ్చరికలు జారీచేశారు.

TSRTC Notices to Jeevan Reddy Mall : తెలంగాణ కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఇందులో భాగంగానే తొలి రోజే ఎన్నికల హామీల అమలుపై దృష్టి సారించింది. ప్రమాణ స్వీకారం జరిగిన రోజే మంత్రివర్గాన్ని రేవంత్‌ రెడ్డి సమావేశపర్చారు. సీఎంగా బాధ్యతలు తీసుకున్న అనంతరం కేబినెట్‌ భేటీ జరిపారు. విద్యుత్ అంశంపైనా మంత్రివర్గంలో విస్తృతంగా చర్చ జరిగింది. తెలంగాణలో కరెంట్ పరిస్థితిపై ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. గత సర్కార్ చేసిన అనేక తప్పిదాలతో తీవ్ర ఇబ్బందుల్లోకి వెళ్లిందని చెప్పారు. వాస్తవ పరిస్థితిని ఎందుకు దాస్తున్నారంటూ ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిపై ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై సమగ్రంగా సమీక్షించాలని సీఎస్ శాంతికుమారిని ఆదేశించారు.

రేపటి నుంచి శాసనసభ సమావేశాలు - నేడు విద్యుత్‌ రంగంపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష

ఓ షాపింగ్‌ మాల్‌ స్థలం అద్దె, కరెంట్ బకాయిలు రూ.కోట్లలో పేరుకుపోవడంతో సంబంధిత సంస్థలు చర్యలకు దిగాయి. ఈ సంఘటన నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ పట్టణంలో చోటు చేసుకుంది. ఇప్పుడు ఇది కాస్తా చర్చనీయాంశంగా మారింది. స్థానిక బస్టాండ్​ను ఆనుకొని ఆర్టీసీకి చెందిన 7,000 చదరపు గజాల స్థలాన్ని 2013లో విష్ణుజిత్‌ ఇన్‌ఫ్రా డెవలపర్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ అనే సంస్థకు 33 ఏళ్లు లీజుకు ఇస్తూ ఒప్పందం జరిగింది.

హామీల అమలుపై కొత్త సర్కార్​​ ఫోకస్​ - రేపటి నుంచే మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం

ఇందులో కొంతకాలం కిందట జీ-1(జీవన్‌రెడ్డి మాల్‌ అండ్‌ మల్టీప్లెక్స్‌) (Jeevan Reddy Mall ) పేరిట భవన నిర్మాణం చేపట్టి సినిమా హాళ్లు, దుకాణాలు ఏర్పాటు చేశారు. అయితే సంవత్సరం ప్రాతిపదికన ఆర్టీసీకి చెల్లించాల్సిన అద్దె బకాయిలు రూ.7.23 కోట్లకు చేరటంతో సంస్థ అధికారులు లీజుదారు సంస్థకు నోటీసు ఇస్తూ వచ్చారు. అయినా ఎంతకూ చెల్లించకపోవడంతో గురువారం హెచ్చరిక ప్రకటన చేశారు. ఆర్టీసీ సిబ్బంది మాల్‌ వద్దకు వెళ్లి మైకులో బహిరంగంగా లీజు బకాయిల వివరాలు వెల్లడించారు. వెంటనే చెల్లించకపోతే స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంటామని ఆర్టీసీ అధికారులు తెలిపారు.

Power supply cut to Jeevan Reddy Mall in Armoor : అదేవిధంగా విద్యుత్‌ బిల్లుల బకాయిలు రూ.2.5 కోట్ల వరకు ఉండటంతో మాల్​కు గురువారం కరెంట్ సరఫరాను నిలిపివేశారు. ఈ విషయాన్ని సంబంధితశాఖ ఏడీఈ శ్రీధర్‌ ధ్రువీకరించారు. ఎప్పటికప్పుడు నోటీసులు పంపుతున్నామని, వాయిదాలు కోరడంతో గడువు ఇస్తూ వచ్చామని ఆర్టీసీ, విద్యుత్‌శాఖ అధికారులు వివరించారు.

రేవంత్​ రెడ్డి ప్రమాణ స్వీకారం వేళ ఎల్బీ స్టేడియానికి పోటెత్తిన జనం - డ్రోన్ విజువల్స్​ చూశారా?

తెలంగాణ మంత్రులకు శాఖల కేటాయింపు - సోషల్​ మీడియాలో అసత్య ప్రచారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.