ETV Bharat / state

పెళ్లి బృందంపైకి కారు - యువతి మృతి, నలుగురికి గాయాలు

author img

By ETV Bharat Telangana Team

Published : Jan 5, 2024, 9:44 AM IST

Updated : Jan 5, 2024, 3:06 PM IST

Car Attack on Wedding Party Medak
Car Attack

Car Crashes Into Baraat in Medak : పెళ్లి జరిగిందన్న ఆనందాన్ని ఆవిరి చేస్తూ పెళ్లి బృందాన్ని ఓ వ్యక్తి కారుతో విచక్షణారహితంగా ఢీకొట్టాడు. ఈ నేపథ్యంలో ఓ యువతి మృతి చెందగా, మరో నలుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ ఘటన మెదక్‌ జిల్లా చేగుంట మండలం రెడ్డిపల్లి కాలనీలో గురువారం రాత్రి చోటుచేసుకుంది.

Car Crashes Into Baraat in Medak : ఆనందంగా వివాహం జరిగింది. ఉత్సాహంగా ఆడి పాడుతూ బరాత్ నిర్వహించి పెళ్లి కూతురును సాగనంపారు. తిరిగి వస్తున్న సమయంలో గొడవ జరిగింది. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన ఓ వ్యక్తి అక్కడ ఉన్నవారిపై కారు ఎక్కించాడు. ఈ ఘటనలో యువతి మృతి చెందగా, మరో నలుగురు గాయపడ్డారు. మెదక్ జిల్లా చేగుంట మండలం రెడ్డిపల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది.

స్థానిక ఎస్సై హరీశ్ తెలిపిన వివరాల ప్రకారం : రెడ్డిపల్లి వడ్డెర కాలనీకి చెందిన ఉప్పు వెంకటి కూతురు సువర్ణ వివాహం గురువారం రోజున వైభవంగా జరిగింది. తన కుమార్తెను సాయంత్రం అత్తారింటికి పంపే క్రమంలో వెంకటి బరాత్ నిర్వహించారు. తర్వాత ఆమెను ఘనంగా అత్తారింటికి సాగనంపారు. తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో అదే కాలనీకి చెందిన ఉప్పు నరేందర్‌, స్వామి గొడవపడ్డారు.

ప్రేమోన్మాది ఘాతుకం - ప్రేమించడం లేదని యువతిపై బ్లేడ్​తో దాడి

Medak Baraat Car Crash : నరేందర్, స్వామిని నెట్టివేయటంతో అతను కిందపడ్డాడు. వెంటనే అక్కడ ఉన్నవారు స్వామిని పక్కకు తీసుకెళ్లారు. కోపంలో ఉన్న నరేందర్ తన వద్ద ఉన్న కారు (థార్)ను తెచ్చి అక్కడ ఉన్నవారిపై ఎక్కించాడు(Car Attack in Medak). ఈ ఘటనలో కాలనీకి చెందిన రమ్య (23)తో పాటు ఉప్పు దుర్గయ్య, సుజాత, యాదగిరి, సురేశ్​కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే రమ్యను అంబులెన్స్​లో హైదరాబాద్ నిమ్స్​కు తరలిస్తుండగా మార్గమధ్యలోనే ఆమె మృతి చెందింది. దుర్గయ్య, సుజాత, సురేశ్​లను నార్సింగిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అలాగే యాదగిరిని కామారెడ్డికి చికిత్స నిమిత్తం పంపించారు.

కారుతో దాడి చేస్తున్న సమయంలో ఆ మార్గంలో వెళ్తున్న భీంరావుపల్లికి చెందిన యాదగిరి ద్విచక్ర వాహనాన్ని కూడా నరేందర్ ఢీ కొట్టాడు. బైక్​పై ఉన్న వ్యక్తి స్వల్ప గాయాలతో బయటపట్టాడు. ఆ సమయంలో బైక్ గనుక రాకపోతే మరికొంత మంది ప్రాణాలు పోయేవని ఎస్సై హరీశ్ తెలిపారు. మృతురాలు రమ్య డిగ్రీ పూర్తి చేసి కూలీ పనులు చేసుకుంటోంది. మరికొన్ని రోజుల్లో ఆమెకు పెళ్లి చేద్దామనుకుంటున్న తల్లిదండ్రులు కుమార్తె మరణంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. నిందితుడ్ని వెంటనే అరెస్ట్​ చేయాలని డిమాండ్ చేస్తూ బాధిత కుటుంబసభ్యులు జాతీయ రహదారిపై నిరసనకు దిగారు. దీంతో సుమారు 5 కిలో మీటర్ల మేర వరకు వాహనాలు నిలిచిపోయాయి. ఈ ఘటనకు పాల్పడిన నరేందర్ పరారీలో ఉన్నాడని, అతడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

స్టాప్​ వద్ద బస్సు ఎందుకు ఆపలేదు? - ఆర్టీసీ డ్రైవర్​పై ముగ్గురు వ్యక్తుల దాడి

ప్రభుత్వ సీనియర్ అధికారి కుమారుడి దాష్టీకం- ప్రియురాలిపై దాడి, స్నేహితులతో కలిసి కాలు విరగొట్టి!

Last Updated :Jan 5, 2024, 3:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.