ETV Bharat / state

కరీంనగర్​లో దారుణం - ప్రేమించడం లేదని యువతిపై కత్తితో దాడి

author img

By ETV Bharat Telangana Team

Published : Jan 4, 2024, 10:28 PM IST

Updated : Jan 5, 2024, 8:23 AM IST

Man Attacked Young Woman With Knife in Karimnagar : ప్రేమిస్తున్నామంటూ వెంట పడతారు. అమ్మాయి ఒప్పుకోకపోతే ఎంతకైనా తెగిస్తారు. ప్రాణాలు సైతం తీసేందుకు కూడా వెనకాడరు. ఇలాంటి ఘటనలు నిత్యం ఎక్కడో ఒకచోట వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా తన ప్రేమను నిరాకరించిందన్న కారణంతో ఓ ప్రేమోన్మాది, యువతిపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో జరిగింది.

Knife attack in Karimnagar
A Lover Attack on Young Woman With Knife in Karimnagar

Man Attacked on Young Woman With Knife in Karimnagar : సమాజంలో రోజురోజుకు ఆడవారిపై అరాచకాలు పెరిగిపోతున్నాయి. మహిళలు కనిపిస్తే చాలు క్రూరమృగాలుగా మారి, వావి వరసలు మరిచి అత్యాచారాలకు తెగబడుతున్నవారు కొందరు. ప్రేమిస్తున్నామని వెంటపడి మోసం చేసేవారు మరికొందరు. ఆ ప్రేమను కాదంటే కాలయములుగా మారి ప్రాణాలు తీస్తున్నవారు ఇంకొందరు. తాజాగా తన ప్రేమను నిరాకరించిందని ఓ యువతిపై దాడి చేశాడు ఓ ప్రేమోన్మాది ( Knife Attack in Karimnagar). ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది.

Knife Attack in Karimnagar : కొత్తపల్లి మండలంలో గురువారం దారుణం జరిగింది. తనను ప్రేమించాలంటూ యువతిపై ఒత్తిడి తెచ్చి. ఆమె అంగీకరించకపోవడంతో ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. కొత్తపల్లికి చెందిన యువతి(26) ఎమ్మెస్సీ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తోంది. ఆమె ఇంటి సమీపంలో ఉంటున్న బొద్దుల సాయి ప్రేమిస్తున్నానని వెంటపడటంతో ఆమె నిరాకరించింది. ఈ విషయమై పెద్దల సమక్షంలో పంచాయితీలు జరిగినా యువకుడిలో మార్పు రాలేదు.

అర్ధరాత్రి ఇంట్లో చొరబడి.. యువతి గొంతు కోసిన ప్రేమోన్మాది

A Lover Cuts young woman Neck in Hyderabad : ఈ క్రమంలో ఆమెను తనకిచ్చి పెళ్లి చేయాలని వారం కిందట నిందితుడు సాయి యువతి తండ్రి సెల్‌ఫోన్‌కు రెండుసార్లు మెసేజ్‌లు పంపించాడు. దీనికి ఆయన స్పందించకపోవడంతో కోపం పెంచుకున్నాడు. గురువారం సాయంత్రం ఆ యువతి ఇంట్లో ఎవరూ లేని సమయంలో సాయి వెళ్లి తనను పెళ్లి చేసుకోవాలంటూ ఆమెతో ఘర్షణకు దిగాడు. యువతి కాదనడంతో కత్తితో మెడపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. అడ్డుకునే ప్రయత్నంలో ఆమె చేయి తెగిందని పోలీసులు తెలిపారు.

Blade attack in Karimnagar
నిందితుడు సాయి

ప్రేమోన్మాది ఘాతుకం.. యువతిని కారుతో ఢీకొట్టి

దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. కరీంనగర్‌ రూరల్‌ ఏసీపీ కరుణాకర్‌రావు, ఎస్సై చంద్రశేఖర్‌ ఆసుపత్రికి చేరుకుని యువతి నుంచి వివరాలు సేకరించారు. నిందితుడు సాయి పరారీలో ఉన్నాడని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.

"బాధితురాలు ఎమ్మెస్సీ పూర్తి చేసి ఇంటి దగ్గర ఉంటోంది. బొద్దుల సాయి అనే యువకుడు ప్రేమిస్తున్నానని ఆమె వెంట పడేవాడు. ఈ విషయమై పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయితీలు జరిగాయి. అయినా నిందితుడు తన ప్రవర్తన మార్చుకోలేదు. గురువారం సాయంత్రం సాయి అమ్మాయి వాళ్ల ఇంటికి వచ్చాడు. తనను పెళ్లి చేసుకోవాలని ఆమెతో ఘర్షణకు దిగాడు. అందుకు ఆమె నిరాకరించింది. వెంటనే తన వెంట తెచ్చుకున్న కత్తితో బాధితురాలిపై దాడి చేశాడు. ప్రస్తుతం యువతి వైద్యుల పర్యవేక్షణలో ఉంది. నిందితుడు పరారీలో ఉన్నాడు. అతడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపాం." - కరుణాకర్‌, కరీంనగర్ రూరల్ ఏసీపీ

ప్రియురాలు, ఆమె తల్లిని కత్తితో పొడిచిన ప్రేమోన్మాది.. అసలేం జరిగిందంటే?

యువతిపై కత్తితో దాడి చేసిన ప్రేమోన్మాది

Last Updated : Jan 5, 2024, 8:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.