ETV Bharat / state

రాత్రి కురిసిన వర్షాలతో జిల్లాల్లో జల కళ

author img

By

Published : Jul 3, 2020, 10:29 PM IST

గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకూ మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాల్లో కురిసిన మోస్తరు నుంచి భారీ వర్షాలతో వాగులు, వంకలు జలకళ సంతరించుకున్నాయి. కోయల్ కొండ మండంలోని భవానీ సాగర్ చెక్ డ్యాం పూర్తిగా నిండి అలుగు పారుతోంది.

రాత్రి కురిసిన వర్షాలతో జిల్లాల్లో జల కళ
రాత్రి కురిసిన వర్షాలతో జిల్లాల్లో జల కళ

గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకూ మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. హన్వాడ మండలంలోని చెరువులు, కుంటలు నిండిపోయాయి. అదనులో మంచి వర్షం కురవడం, చెరువులు, కుంటలు నిండటం వల్ల రైతన్నల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలంలో 17 సెంటీమీటర్లు, అర్బన్ మండలంలో 13 సెంటీమీటర్లు, భూత్పూరులో 12 సెంటీమీటర్లు, మూసాపేట మండలంలో 10 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలోని కోయల్ కొండ, బాలనగర్ మండలాల్లోనూ మోస్తరు వర్షాలు కురిశాయి.

మహబూబ్ నగర్ జిల్లాలో శుక్రవారం సగటు వర్షపాతం..7.4 సెంటీ మీటర్లు నమోదు కాగా.. జూలై ఒకటి నుంచి 3వరకు వరకూ సాధారణం కంటే అత్యధిక వర్షపాతం నమోదైంది. మూడు రోజుల్లో 91 మిల్లీ మీటర్లు సాధారణం కాగా... 214.4 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. మొత్తం 15 మండలాల్లోనూ అత్యధిక వర్షపాతం నమోదు కావడం గమనించాల్సిన అంశం.

నారాయణపేట జిల్లాలో దామరగిద్ద, మద్దూరు మండలాల్లో శుక్రవారం 6 సెంటీమీటర్ల కంటే అధికంగా వర్షం పడింది. జిల్లా సగటు వర్షపాతం 2.9 సెంటీమీటర్లుగా ఉంది. వనపర్తి జిల్లా గోపాల్ పేటలో 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

ఇదీ చూడండి:ప్రధాన కార్యదర్శితో సహా 100 మంది ఐఏఎస్​ల బదిలీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.