ETV Bharat / state

'కొవిడ్​ కట్టడికి నిబంధనలే నివారణ.. వ్యాక్సినే ఆయుధం'

author img

By

Published : Apr 27, 2021, 11:47 AM IST

తెలంగాణ వార్తలు
మహబూబ్​నగర్​ వార్తలు

కోరలు చాస్తున్న కొవిడ్​ను కట్టడి చేయాలంటే ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించడం, వ్యాక్సిన్​ వేయించుకోవాలన్నారు మహబూబ్​నగర్​ జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లు. మహబూబ్​నగర్​ పట్టణంలోని రైతు బజార్, క్లాక్ టవర్ ప్రాంతాల్లో కొవిడ్ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించారు.

కొవిడ్​ కట్టడికి నిబంధనలే నివారణ... వ్యాక్సిన్​ ఆయుధం అని మహబూబ్​నగర్​ జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లు అన్నారు. మహబూబ్​నగర్​ పట్టణంలోని రైతు బజార్, క్లాక్ టవర్ ప్రాంతాల్లో కొవిడ్ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించారు.

ప్రతి ఒక్కరూ టీకా వేయించుకోవాలని సూచించారు. వ్యాక్సిన్​ ద్వారా కరోనా నుంచి రక్షణ పొందొచ్చని తెలిపారు. జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాల్లో అత్యంత అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. రాత్రి వేళ కర్ఫ్యూకి అందరూ స్వచ్ఛందంగా సహకరిస్తున్నారని.. అదేవిధంగా నిబంధనలు పాటించడంలోనూ ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి: ఉదాసీనత అసలే వద్దు.. వారంలోనే పరిస్థితి తీవ్రం కావచ్చు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.