ETV Bharat / state

మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యను పరిష్కరించాలి: ఎమ్మెల్సీ జీవన్​ రెడ్డి

author img

By

Published : Dec 20, 2021, 7:45 PM IST

mid day meals workers dharna in karimnagar
కరీంనగర్​లో మధ్యాహ్న భోజన కార్మికుల ధర్నా

Midday meals workers protests: కరీంనగర్​లో పదిహేను రోజులుగా మధ్యాహ్న భోజన కార్మికుల ధర్నా కొనసాగుతోంది. కార్మికుల నిరసనలకు కాంగ్రెస్​ ఎమ్మెల్సీ జీవన్​ రెడ్డి మద్దతు తెలిపారు. సమస్యను పరిష్కరించాలని సంబంధిత మంత్రులను ఎమ్మల్సీ డిమాండ్​ చేశారు.

Midday meals workers protests: కనీస వేతనం డిమాండ్‌తో కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట మధ్యాహ్న భోజన కార్మికులు చేస్తున్న ధర్నాకు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మద్దతు పలికారు. కనీస వేతనంతో పాటు.. వంట సరుకులకు చెల్లించే బిల్లులు పెంచాలన్న డిమాండ్‌తో 15 రోజులుగా కార్మికులు నిరసన చేపట్టారు. ధర్నా చేస్తున్న కార్మికులను పరామర్శించిన జీవన్‌రెడ్డి.. వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్మికుల సమస్య పరిష్కరించడంలో పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్​తో పాటు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బాధ్యత తీసుకోవాలని జీవన్​ రెడ్డి డిమాండ్​ చేశారు.

కనీస వేతనం రూ. పదివేలు ఇవ్వాలి: ఎమ్మెల్సీ జీవన్​ రెడ్డి

'మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించాలి. వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి. కనీస వేతనం రూ. 10 వేలు చెల్లించి.. వంట సరుకులకు చెల్లించే బిల్లులు పెంచాలి.' - జీవన్​ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ

పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నారు

Midday meals workers protests in karimnagar: కేవలం 4 రూపాయలకు పిల్లలకు పౌష్టికాహారం ఎలా ఇవ్వగలుగుతున్నారో మంత్రులు చెప్పాలని ఎమ్మెల్సీ జీవన్​ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచాలన్న ఉద్దేశంతో అప్పట్లో యూపీఏ ఛైర్​పర్సన్​ సోనియాగాంధీ.. ఈ పథకానికి రూపకల్పన చేశారని జీవన్‌ రెడ్డి గుర్తు చేశారు. ఏళ్లు గడుస్తున్న కొద్దీ పథకాన్ని మరింతంగా అభివృద్ధి చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం.. పూర్తిగా నిర్వీర్యం చేస్తోందని విమర్శించారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు కార్మికులకు అండగా ఉంటామని జీనవ్‌రెడ్డి హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి: Ministers Protest over paddy procurement : మోతెత్తిన చావుడప్పు.. కేంద్రం తీరుపై భగ్గుమన్న మంత్రులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.