ETV Bharat / state

YS Sharmila Got Indian Book Of Records : 'ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్​'లో వైఎస్​ షర్మిల

author img

By

Published : Aug 15, 2023, 4:49 PM IST

Updated : Aug 15, 2023, 5:04 PM IST

YS Sharmila Padayatra  Name
Indian Book Of Record Latest Winner

YS Sharmila Got Indian Book Of Records :వైఎస్​ఆర్​ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు అరుదైన గౌరవం దక్కింది. తాను చేసిన 3,800 కిలో మీటర్లు పాదయాత్రకు ఇండియన్​ బుక్​ ఆఫ్​ రికార్డ్స్​లో చోటు దక్కింది. ఎక్కువ కిలో మీటర్లు పాదయాత్ర చేసిన మొదటి మహిళగా ఆమె ఘనత సాధించింది.

YS Sharmila Got Indian Book Of Records : తెలంగాణలో 3,800 కిలోమీటర్లు పాదయాత్ర చేసినందుకు వైఎస్​ఆర్​ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్​లో చోటు సంపాదించుకున్నారు. 3,800 కిలో మీటర్లు పాదయాత్ర చేసిన మొదటి మహిళగా ఆమె రికార్డు సృష్టించారని ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు తెలిపారు. వారు లోటస్ పాండ్​లోని వైఎస్​ఆర్​ తెలంగాణ పార్టీ కార్యాలయంలో షర్మిలను కలిసి అభినందించారు. అనంతరం అవార్డును ప్రదానం చేశారు. కేసీఆర్​ ప్రభుత్వాన్ని గద్దె దించాలనే ఉద్దేశంతో షర్మిల ప్రజాప్రస్థాన(Praja Prastanam) యాత్ర పేరుతో పాదయాత్ర చేసింది.

One and Half Year Sharmila Padayatra in TS : 2021 అక్టోబర్​ 21న ఆమె తండ్రి వైఎస్​ రాజశేఖర్​ రెడ్డి పాదయాత్ర మొదలు పెట్టిన ప్రదేశం చేవెళ్ల నుంచి తన పాదయాత్రను ప్రారంభించారు. ఈ యాత్రలో ఆమెకు ఎన్ని అడ్డకుంలు వచ్చిన వాటిని ఎదుర్కొని కొనసాగించారు. వరంగల్​ జిల్లాలో ఎన్ని ఉద్రిక్తత పరిస్థితులు వచ్చిన కోర్టుకు వెళ్లి మరీ.. అనుమతులు తెచ్చుకొని పాదయాత్ర కొనసాగించారు. దాదాపు సంవత్సరం ఆరు నెలలు ఈ యాత్ర కొనసాగింది.

YS Sharmila Praja Prastanam Details in Telangana : ప్రజాప్రస్థాన పాదయాత్రలో ఆమె బీఆర్​ఎస్​ ముఖ్యమంత్రి కేసీఆర్​, మంత్రులు, ఎమ్మెల్యేలపై కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో కొన్ని చోట్ల ఆమె యాత్రకు పోలీసులు ఆటంకం కలిగించారు. మరికొన్ని సార్లు జైలుకి కూడా వెళ్లారు. అయినా ఆమె పట్టు వదలని విక్రమార్కునిలా పాదయాత్రను కొనసాగించింది. ఇటీవలే వైఎస్సాఆర్​ పుట్టిన రోజు సందర్భంగా పాలమూరులో మరల తన పాదయాత్రను త్వరలో మొదలు పెడతానని ప్రకటించారు. గతంలో ఆంధ్రప్రదేశ్​లోనూ పాదయాత్ర చేసినా.. తెలంగాణలో చేసినంత సుదీర్ఘంగా చేయలేదు.

YS Sharmila Tweet on KCR : కేసీఆర్‌కు షర్మిల సవాల్‌.. దమ్ముంటే సిట్టింగ్‌లకు సీట్లు ఇవ్వండి..

Sharmila Paticipate 77TH Independence Day Celebrations : హైదరాబాద్​లోని వైఎస్​ఆర్​టీపీ కార్యాలయంలోని 77వ స్వాతంత్ర్య దినోత్సవ(Independence Day) వేడుకల్లో వైఎస్​ షర్మిల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భిన్నత్వంలో ఏకత్వం భారతదేశం గొప్పదనమని అన్నారు. ఎన్నో కులాలు, ఎన్నో మతాలు, ఎన్నో భాషలు కలిసిమెలిసి జీవిస్తుండడం దేశ గౌరవం అని తెలిపారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం బ్రిటీష్​ వారు ఆచరించిన డివైడ్​ అండ్​ రూల్​ పద్దతిలో పాలన సాగుతుందని విమర్శించారు. మణిపూర్​లో మహిళలపైన అల్లర్లు ఇంకా కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఏడాదితో కేసీఆర్ పాలన అంతం కావాలని షర్మిల ఆకాంక్షించారు.

YSRTP Merge in Congress : కాంగ్రెస్‌లో.. వైఎస్‌ఆర్‌టీపీ విలీనం కానుందా?

YS Sharmila Padayatra Update : 'అతి త్వరలోనే ప్రజా ప్రస్థానం పాదయాత్ర పునఃప్రారంభం'

YSR 74th birth anniversary ఇడుపులపాయలో వైఎస్ఆర్ 74వ జయంతి వేడుకలు.. హజరైన షర్మిల, విజయమ్మ.!

Last Updated :Aug 15, 2023, 5:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.