ETV Bharat / state

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కాళేశ్వరం నిర్వహణ

author img

By

Published : Nov 4, 2020, 8:02 PM IST

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని మొబైల్ యాప్ ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టును పకడ్బందీగా నిర్వహించేందుకు నీటిపారుదల శాఖ సన్నద్ధమవుతోంది. దీనికి సంబంధించిన డెసిషన్​ సపోర్ట్ సిస్టంపై ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్ గోదావరి బేసిన్​ ఇంజినీర్లతో హైదరాబాద్​లోని జలసౌధలో కార్యశాల నిర్వహించారు.

Workshop conducted by ENC muralidhar on special software for kaleswaram project
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కాళేశ్వరం నిర్వహణ

కాళేశ్వరం ప్రాజెక్టులోని పంప్​హౌస్​లు, కాల్వలు, జలాశయాలను సమర్థంగా నిర్వహించేందుకు హైదరాబాద్​లోని జలసౌధలో ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్ కార్యశాలను నిర్వహించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా మొబైల్ యాప్​ను తయారు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఇందుకు సంబంధించిన డెసిషన్​ సపోర్ట్ సిస్టంపై గోదావరి బేసిన్ ఇంజినీర్లతో చర్చించారు.

మొబైల్ యాప్​పై శిక్షణ

జలాశయాల్లో ఉన్న నీరు, ఆయకట్టు వివరాలు, భూగర్భ జలాల పరిస్థితి, వర్షపాతం వివరాల కోసం ప్రత్యేక సాఫ్ట్​వేర్​తో పాటు మొబైల్​ యాప్​పై ఇంజినీర్లకు శిక్షణ ఇస్తామని మురళీధర్ తెలియజేశారు. సీఎం తన కార్యాలయం నుంచే ఆదేశాలు ఇచ్చేందుకు ఈ వ్యవస్థ ఉపయోగపడుతుందన్నారు.

ప్రాజెక్టుల వద్ద సెన్సార్లు

డెసిషన్​ సపోర్ట్ సిస్టంలో నీటి పరిమాణం, వాతావరణ అంచనాలను పొందుపరుస్తామని సాఫ్ట్​వేర్ రూపొందించిన వస్సర్ ల్యాబ్స్ ప్రతినిధులు వెల్లడించారు. సెంట్రల్ కమాండ్ కేంద్రంతో పాటు మరో మూడు స్థానిక కమాండ్​ కేంద్రాలు, ప్రాజెక్టుల వద్ద సెన్సార్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ సమాచారం ఆధారంగా వారం, నెల రోజుల ముందస్తు వర్షపాతం, వరద ప్రవాహాలు అంచనా వేసేలా రూపొందిస్తామని సాఫ్ట్​వేర్ కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు.

ఇదీ చూడండి:తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతోంది: ఎర్రబెల్లి దయాకర్​ రావు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.