ETV Bharat / state

Tank Bund: సందర్శకులకు ఫ్రీనెస్... ట్యాంక్​బండ్​పై వాహనాల రాకపోకలు బంద్

author img

By

Published : Aug 29, 2021, 5:44 PM IST

Updated : Aug 29, 2021, 6:51 PM IST

హైదరాబాద్ ట్యాంక్​బండ్​పై ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు అమలులోకి వచ్చాయి. ఇక ప్రతి ఆదివారం ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించనున్నారు. సాయత్రం 5 నుంచి రాత్రి 10గంటల వరకు ట్యాంక్​బండ్ మీదుగా వాహనాల రాకపోకలను నియంత్రిస్తారు. ఆదివారం ఆటవిడుపు కోసం ట్యాంక్ బండ్ పైకి వచ్చే సందర్శకుల సౌకర్యార్థం, వాహనాల రాకపోకలను దారి మళ్లిస్తున్నారు.

Tank Bund
ట్యాంక్​బండ్

Tank Bund: సందర్శకులకు ఫ్రీనెస్... ట్యాంక్​బండ్​పై వాహనాల రాకపోకలు బంద్

ట్యాంక్​బండ్(Tank Bund)​పై ట్రాఫిక్​ సమస్యతో సందర్శకులు ఇబ్బంది పడుతున్నందున ప్రతి ఆదివారం ట్రాఫిక్​ ఆంక్షలు (Traffic Restrictions) విధిస్తున్నట్లు హైదరాబాద్ సీపీ వెల్లడించిన నేపథ్యంలో ఇవాళ్టి నుంచి ఆంక్షలు అమలులోకి వచ్చాయి. ట్యాంక్ బండ్‌పై సాయంత్రం 5 నుంచి రాత్రి 10 వరకు వాహన రాకపోకలు బంద్ అవుతాయి. సందర్శకుల కోసం పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఇవాళ్టి నుంచి ప్రతి ఆదివారం ఆంక్షలు కొనసాగుతాయని పోలీసులు ఇదివరకే వెల్లడించారు.

ట్యాంక్​బండ్​ వద్ద హుస్సేన్ సాగర్ (Hussain Sagar) అందాలు కనువిందు చేస్తుండగా.. మరోవైపు విగ్రహాలతో పాటు... చిన్నపాటి ఉద్యానవనాలు ఏర్పాటు చేశారు. అయితే ఈ మార్గంలో వాహనాల రాకపోకల వల్ల సందర్శకులు రోడ్డు దాటడం ఇబ్బందిగా మారింది. ఈ సమస్యను ఇటీవల ఓ నెటిజన్ ట్విట్టర్ ద్వారా మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. సమస్యను పరిష్కరించాల్సిందిగా కేటీఆర్... హైదరాబాద్ పోలీసులకు కోరారు.

మంత్రి కేటీఆర్​ సూచనలపై స్పందించిన సీపీ అంజనీ కుమార్... ప్రతి ఆదివారం వాహనాలను వేరే మార్గంలో మళ్లించాలని ట్రాఫిక్ పోలీసులను ఆదేశించారు. ఈ మేరకు ట్రాఫిక్ పోలీసులు ప్రణాళిక రచించారు. ఆదివారం సాయంత్రం 5 నుంచి 10 గంటల వరకు వాహనాల రాకపోకలు పూర్తిగా దారి మళ్లిస్తున్నారు. లోయర్ ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్డు మీదుగా వాహనదారులు రాకపోకలు కొనసాగించాల్సి ఉంటుంది. సందర్శకుల వాహనాలు మాత్రమే ట్యాంక్ బండ్ మీద 200 మీటర్ల లోనికి అనుమతిస్తారు. ఆ తర్వాత బారికేడ్లు వేసి... కేవలం కాలినడక ద్వారానే ట్యాంక్ బండ్​పై తిరగాల్సి ఉంటుంది.

ఇదీ చూడండి: traffic Restrictions: ప్రతి ఆదివారం సాయంత్రం ట్యాంక్​బండ్​పై ట్రాఫిక్​ ఆంక్షలు

Last Updated :Aug 29, 2021, 6:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.