ETV Bharat / state

Uttam Kumar Reddy on Telangana Assembly Elections : 'ఈసారి మాకు 70 సీట్లు వస్తాయి.. పార్టీ నన్ను పోటీ చేయొద్దంటే చేయను..'

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 30, 2023, 8:06 PM IST

Uttam Kumar Reddy on Telangana election
Uttam Kumar Reddy

Uttam Kumar Reddy on Telangana Assembly Elections 2023 : బీఆర్ఎస్ హామీల్లో 90 శాతం అమలు చేయలేదని ఉత్తమ్​కుమార్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని.. కాంగ్రెస్ ఉప్పెనలో బీఆర్ఎస్ కొట్టుకుపోతుందని జోస్యం చెప్పారు. హస్తం పార్టీకి 70 సీట్లు వస్తాయని సర్వేల ఆధారంగా అంచనా వేస్తున్నట్లు ఉత్తమ్​కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఈ క్రమంలోనే పార్టీ తనను పోటీ చేయొద్దంటే చేయనని వ్యాఖ్యానించారు.

Uttam Kumar Reddy on Telangana Assembly Elections 2023 : కాంగ్రెస్‌ హామీ ఇస్తే అమలు చేసి తీరుతుందని ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. కర్ణాటకలో కోటి మంది మహిళలకు నెలకు రూ.2,000 చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుందని తెలిపారు. ప్రతి ఇంటికి రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇస్తున్నామని చెప్పారు. అక్కడ ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామని అన్నారు. హైదరాబాద్​ గాంధీభవన్‌లో మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన ఆయన.. పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు..

కర్ణాటకలో రేషన్ ద్వారా 10 కేజీల బియ్యం ఇస్తున్నట్లు ఉత్తమ్​కుమార్ రెడ్డి వివరించారు. అక్కడ వంద రోజుల్లోపే ఇచ్చిన 5 గ్యారెంటీ హామీల్లో.. నాలుగింటిని అమలు చేసినట్లు స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో.. పాత పింఛన్​ విధానాన్ని అమలు చేస్తామని తెలిపారు. బీఆర్‌ఎస్‌ ఇచ్చిన హామీల్లో 90 శాతం అమలు చేయలేదని (UttamKumar Reddy on BRS) ఆరోపించారు. దళిత ముఖ్యమంత్రి హామీ నెరవేర్చలేదని విమర్శించారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు లేవన్నారు. నిరుద్యోగ భృతి ఇవ్వలేదని.. ఉచిత ఎరువుల పంపిణీ హామీకే పరిమితమైందని ఉత్తమ్​కుమార్​ రెడ్డి దుయ్యబట్టారు.

ఎంపీ ఉత్తమ్​, ఎమ్మెల్యే సైదిరెడ్డి అనుచరుల మధ్య వాగ్వాదం

UttamKumar Reddy Fires on BRS : కేసీఆర్, కేటీఆర్ కలల్లో బతుకుతున్నారని ఉత్తమ్​కుమార్​ రెడ్డి (UttamKumar Reddy Fires on KCR and KTR) ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని.. కాంగ్రెస్ ఉప్పెనలో బీఆర్ఎస్ కొట్టుకుపోతుందని జోస్యం చెప్పారు. భారత్​ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు.. సాండ్, ల్యాండ్, లిక్కర్, కరెప్షన్ మాఫియాగా మారారని ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్‌కు 70 సీట్లు వస్తాయని సర్వేల ఆధారంగా అంచనా వేస్తున్నట్లు తెలిపారు. టికెట్లు తొందరగా ప్రకటిస్తే ప్రచార వేగం పెంచుతామని ఉత్తమ్​కుమార్​ రెడ్డి పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలోనే వామపక్షాలతో చర్చలు ఏ స్థాయిలో ఉన్నాయో.. తనకు తెలియదని ఉత్తమ్​కుమార్ రెడ్డి తెలిపారు. హుజూర్‌నగర్, కోదాడలో మెజార్టీ 50,000 కంటే తగ్గదని అన్నారు. ఒకవేళ 50,000 కంటే మెజార్టీ తగ్గితే మళ్లీ రాజకీయాలు చేయనని పునరుద్ఘాటించారు. ఈ క్రమంలోనే పార్టీ పోటీ చేయవద్దంటే పోటీ చేయనని.. ఎంపీ ప్రతిపాదన వస్తే అప్పుడు చూద్దామని చెప్పారు. ఎన్నికలు అనేవి ఒక్క డబ్బు మీదనే ఆధారపడవని.. పార్టీ మేనిఫెస్టో, అభ్యర్థుల గుణగణాలను కూడా ఓటర్లు పరిగణనలోకి తీసుకుంటారన్నారు. గడిచిన 6 నెలల్లో కాంగ్రెస్​ బాగా బలపడిందని ఉత్తమ్​కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు.

Uttamkumar Reddy on Party Change : బీఆర్​ఎస్​లో చేరికపై క్లారిటీ ఇచ్చిన ఎంపీ ఉత్తమ్​కుమార్​రెడ్డి.. ఏం చెప్పారంటే..?

UttamKumar Reddy on Congress Seats: బీఆర్ఎస్​ను దీటుగా ఎదుర్కొంటామని.. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో క్లీన్‌స్వీప్‌ చేస్తామని ఉత్తమ్​కుమార్​ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తాను హుజూర్‌నగర్ టికెట్‌ కోసం దరఖాస్తు చేశానని.. తన భార్య కోదాడ టికెట్ కోసం దరఖాస్తు చేసినట్లు చెప్పారు. వీలైనంత త్వరగా టికెట్ల ప్రకటన చేయాలని (UttamKumar Reddy on Congress seats) ఏఐసీసీని కోరనున్నట్లు తెలిపారు. మరోవైపు బండి సంజయ్‌, ఈటల రాజేందర్, కిషన్​రెడ్డిల పంచాయితీ తేల్చుకుంటే మంచిదని ఉత్తమ్​కుమార్ రెడ్డి హితవు పలికారు.

"బీఆర్ఎస్​ హామీల్లో 90 శాతం అమలు చేయలేదు. ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉంది. కాంగ్రెస్‌ వస్తే పాత పింఛన్‌ విధానం అమలు చేస్తాం. నేను హుజూర్‌నగర్ టికెట్‌ కోసం దరఖాస్తు చేశా. నా భార్య కోదాడ టికెట్ కోసం దరఖాస్తు చేసింది. త్వరగా అభ్యర్థులను ఖరారు చేయాలని ఏఐసీసీని కోరుతా." - ఉత్తమ్​కుమార్ రెడ్డి, ఎంపీ

Uttam Kumar Reddy on Telangana Assembly Elections 2023 ఈసారి మాకు 70 సీట్లు వస్తాయి పార్టీ నన్ను పోటీ చేయొద్దంటే చేయను

Congress Telangana Elections 2023 : 'ఆ 35 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ బలపడాలి'

Congress Latest News : అసెంబ్లీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్​ ఫోకస్.. త్వరలోనే మరిన్ని కమిటీలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.