ETV Bharat / state

తెరాస అపరేషన్‌ ఆకర్ష్‌.. కమల దళంలో కలవరం

author img

By

Published : Oct 22, 2022, 7:23 AM IST

Updated : Oct 22, 2022, 8:11 AM IST

Trs tactics are a setback for the state BJP
Trs tactics are a setback for the state BJP

Trs Tactics Setback For BJP: గులాబీ అపరేషన్‌ ఆకర్ష్‌తో కమల దళంలో కలవరం మొదలైంది. మునుగోడు ఉప ఎన్నిక ముగింట నేతలు ఒక్కొక్కరుగా పార్టీ వీడుతుండటం భాజపాను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. బూర నర్సయ్య గౌడ్‌ చేరిన ఆనంద క్షణాలను ఆస్వాదించకముందే.. బిక్షమయ్యగౌడ్‌ కమలంపార్టీని వీడడం విస్మయానికి గురిచేసింది. ఆ షాక్‌ నుంచి తేరుకోకముందే స్వామిగౌడ్‌, దాసోజు శ్రవణ్‌ భాజపాకు రాజీనామా చేసి గులాబీ గూటికి చేరారు. ఆ పరిణామాలతో భాజపా రాష్ట్ర నాయకత్వం నిర్ఘాంతపోయింది. ఇంకా ఎవరైనా పార్టీ వీడుతారా అనే అంశంపై ఆరా తీస్తోంది.

తెరాస అపరేషన్‌ ఆకర్ష్‌.. కమల దళంలో కలవరం

Trs Tactics Setback For BJP: రాష్ట్రంలోని కమలనాథులు ఆపరేషన్‌ ఆకర్ష్‌తో తెరాస, కాంగ్రెస్‌లోని అసంతృప్త నేతల్ని భాజపాలో చేర్చుకుంటూ.. పార్టీని బలోపేతం చేస్తూ పార్టీని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్‌కు మునుగోడు ఉపఎన్నిక టికెట్‌ ఇవ్వకపోవడంతో భాజపా చెంతకు చేరారు. ఈ క్రమంలో మునుగోడులో బలమైన బీసీ నేత, గౌడ సామాజిక వర్గానికి చెందిన బూర నర్సయ్యను పార్టీలో చేర్చుకోవడంలో కాషాయదళం సఫలీకృతమైంది.

బూర రాకతో గులాబీ పార్టీకి తీవ్ర నష్టం కలుగుతుందని రాజకీయ వర్గాలు అంచనా వేశాయి. తెరాసకు ప్రత్యామ్నాయం భాజపా అనే సంకేతాన్ని క్షేత్రస్థాయిలో ప్రచారం చేస్తున్న కమలం పార్టీకి ఈ తరుణంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భాజపా దూకుడుకు చెక్‌పెడుతూ ఆపరేషన్‌ ఆకర్ష్‌కి తెరాస తెరతీసింది. భాజపాలో బూర నర్సయ్య చేరిన మరుసటి రోజే అదేపార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్యగౌడ్‌ను తెరాసలో చేర్చుకొని గట్టి షాక్‌ఇచ్చింది.

ఎవరెవరు పార్టీని వీడతారన్న అంశంపై ఆరా: ఆ షాక్‌ నుంచి తేరుకోకముందే స్వామిగౌడ్‌, దాసోజు శ్రవణ్‌ కమలంపార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామాచేసి గులాబీ గూటికి చేరారు. జితేందర్‌రెడ్డి, తూళ్ల వీరేందర్‌గౌడ్‌, కూన శ్రీశైలంగౌడ్‌, ఏనుగు రవీందర్‌రెడ్డి పార్టీని వీడుతారన్న ప్రచారంతో భాజపా రాష్ట్ర నాయకత్వంఅప్రమత్తమైంది. ఎవరెవరు పార్టీని వీడతారన్న అంశంపై ఆరాతీస్తోంది. పార్టీ వీడుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని జితేందర్‌రెడ్డి, ఏనుగు రవీందర్‌రెడ్డి తెలిపారు.

రాష్ట్ర నాయకత్వం వ్యూహాలు: స్వామిగౌడ్‌, దాసోజు శ్రవణ్‌, బిక్షమయ్యగౌడ్‌ భాజపాని వీడడం.. పార్టీ బలోపేతంపై తీవ్ర ప్రభావాన్ని చూపే ప్రమాదముందని కాషాయదళం భావిస్తోంది. మునుగోడు ఉప ఎన్నికల వేళ తాజా పరిణామాలు రాజగోపాల్‌ గెలుపుపై ప్రభావంపడే అవకాశం లేకపోలేదని అంచనావేస్తోంది. ఇంకెవరు పార్టీని వీడకుండా తెరాసను దెబ్బతీసేలా రాష్ట్ర నాయకత్వం వ్యూహాలు రచిస్తోంది.

"నేను నారాయణపురంలో ఉన్నాను. టీవీల్లో నేను ప్రగతిభవన్​ల్లో ఉన్నానని వార్తలు వస్తున్నాయి. భాజపా సిద్ధాంతపరమైన పార్టీ. ప్రజలు, దేశం కోసం పోరాడుతున్న పార్టీ. ఇలాంటి పార్టీని వదిలిపెట్టి వేరే వాళ్లు వెలుతారు. కానీ జితేందర్​రెడ్డి భాజపాను వీడుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదు." - జితేందర్‌రెడ్డి భాజపా నేత

ఇవీ చదవండి: మళ్లీ తెరాస గూటికి దాసోజు శ్రవణ్, స్వామిగౌడ్

మునుగోడులో క్రాస్‌ ఓటింగ్‌ భయం.. ప్రధాన పార్టీల్లో టెన్షన్ టెన్షన్​

'అగ్ని-ప్రైమ్‌' క్షిపణి ప్రయోగం సక్సెస్​.. 2వేల కి.మీ దూరంలోని లక్ష్యాలు ఉఫ్

Last Updated :Oct 22, 2022, 8:11 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.