ETV Bharat / state

టాప్​ న్యూస్​ 3PM

author img

By

Published : Aug 13, 2022, 3:00 PM IST

Updated : Aug 13, 2022, 4:53 PM IST

ఇప్పటివరకు ఉన్న ప్రధానవార్తలు

TOP NEWS
TOP NEWS

  • మునుగోడు పాదయాత్రకు రేవంత్‌రెడ్డి దూరం

మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో నియోజకవర్గంలోని నారాయణపురం నుంచి చౌటుప్పల్‌ వరకు కాంగ్రెస్ చేపట్టిన పాదయాత్రకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. జ్వరంతో బాధపడుతుండడం, కరోనా లక్షణాలు ఉండటంతో నమానాలను కొవిడ్ నిర్ధారణ పరీక్షకు పంపించారు. కాగా, మరోవైపు మునుగోడు పాదయాత్రకు రేవంత్‌ రాకూడదని ఆ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పట్టుబడుతున్న విషయం తెలిసిందే.

  • కోమటిరెడ్డి వెంకటరెడ్డికి క్షమాపణ చెప్పిన రేవంత్‌రెడ్డి

ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి బహిరంగ క్షమాపణ చెబుతున్నట్లు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెలిపారు. పార్టీ నేతల తిట్లకు బాధ్యత వహిస్తూ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి రేవంత్‌ క్షమాపణ చెప్పారు. ఇలాంటి భాష వాడటం ఎవరికీ మంచిది కాదని ఆయన పేర్కొన్నారు.

  • విద్యుత్ బిల్లు చెల్లించాలంటూ సందేశం, నమ్మి ఫోన్ చేస్తే

CYBER FRAUD ఓటరు గుర్తింపుకార్డు.. ఆధార్‌ మార్పులు.. బహుమతులు.. వివాహ పరిచయ వేదికలు కావేవీ మోసానికి అనర్హం అన్నట్టుగా సైబర్‌ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. కొత్త మార్గాలను ఎంచుకొని జనాన్ని తేలికగా బురిడీ కొట్టిస్తున్నారు. కష్టపడి బ్యాంకు ఖాతాల్లోని దాచుకున్న సొమ్మునంతా క్షణాల్లో స్వాహా చేస్తున్నారు. ప్రస్తుతం సైబర్‌ నేరస్తులు విద్యుత్‌ బిల్లులు బకాయిలు చెల్లించాలంటూ మోసాలకు తెరలేపారు. వెంటనే చెల్లించకపోతే రాత్రికి రాత్రే విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తామంటూ బెదిరిస్తున్నారు. ఇదంతా నిజమని భావించి వారు చెప్పినట్టు చేసి కొందరు బ్యాంకు ఖాతాలు గుల్ల చేసుకుంటున్నారు.

  • హోటల్​కు పిలిచి మహిళపై అత్యాచారం

కర్ణాటక బెంగళూరులో దారుణం జరిగింది. తమిళనాడుకు చెందిన ఓ వ్యాపారవేత్త.. వ్యాపార విషయమై చర్చిద్దామంటూ పిలిచి.. ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆగస్టు 6న జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.

  • కదలకుండా ఎంతో బుద్ధిగా రాఖీ కట్టించుకున్న చిరుత

రాజస్థాన్ రాజ్​సమంద్ జిల్లాలో ఓ మహిళ చిరుతపులికి రాఖీ కట్టింది. రోడ్డుపై వెళ్తున్న వణ్యప్రాణికి రాఖీ కట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. అయితే, ఆ చిరుతకు గాయాలు అయ్యాయి. అందువల్ల అది మెల్లిగా రహదారి పక్కన నడుస్తూ వెళ్తోంది.

  • కామన్వెల్త్ పతకవిజేతలపై మోదీ ప్రశంసలు

Commonwealth Games PM Modi ఇటీవలే కామన్వెల్త్​ క్రీడలు 2022 ఘనంగా ముగిశాయి. అయితే తాజాగా ఈ ప్రతిష్ఠాత్మక క్రీడల పతక విజేతలకు.. ప్రధాని నరేంద్రమోదీ తన నివాసంలో ఆతిథ్యం ఇచ్చారు. వారిని ఆత్మీయంగా పలకరించారు. ప్రతిఒక్కరికీ అభినందనలు తెలిపారు. కష్ట సుఖాలను అడిగి తెలుసుకున్నారు.

  • అమిత్ షా ఇంటిపై జాతీయ జెండా హిమాలయాలు త్రివర్ణశోభితం

ఇంటింటా తిరంగ కార్యక్రమం దేశవ్యాప్తంగా ఘనంగా ప్రారంభమైంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన నివాసంపై త్రివర్ణ పతాకం ఎగురవేశారు. హిమాలయాల్లో ఐటీబీపీ జవాన్లు 18వేల అడుగుల ఎత్తులో జాతీయ జెండాను ఎగురవేశారు.

  • వృద్ధి పథంలో ఆర్థిక రథం త్వరలోనే 5 ట్రిలియన్‌ డాలర్ల స్థాయికి

మన ఐటీ ఔషధ వాహన రంగాలు దూసుకెళుతున్న తరుణంలో ప్రపంచంలో 6వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్​ ఆవిర్భవిస్తోందనే ఆశలు రేకెతున్నాయి. స్వావలంబన దిశగా పయనమవుతుండగా అదే సమయంలో పేదరికం నిరుద్యోగం సమస్యలు భారత్​ను వెంటాడుతున్నాయి.

  • దక్షిణాఫ్రికా టీ20 లీగ్​లో ధోనీ బీసీసీఐ అధికారి ఏం చెప్పారంటే

దక్షిణాఫ్రికా క్రికెట్​ బోర్డు వచ్చే ఏడాది సౌతాఫ్రికా టీ20 లీగ్​తో ముందుకు రానుంది. అయితే ఇది పేరుకే ప్రొటిస్​ లీగ్​ అయినా ఇందులో పాల్లొనబోయే ఆరు జట్లను ఐపీఎల్​ ఫ్రాంచైజీలే కొనుగోలు చేయడం విశేషం. అయితే ఇందులో జోహన్నెస్​బర్గ్​ జట్టును చెన్నై సూపర్​కింగ్స్​ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో సీఎస్కే యాజమాన్యం ధోనీని తమ మెంటార్​గా నియమించనున్నట్లు ప్రచారం సాగుతోంది. మరోవైపు ఈ లీగ్​లో భారత ఆటగాళ్లు భాగం కానున్నారా? అనే సందేహాలు ఎక్కువయ్యాయి.

  • మధ్యలోనే ప్రేక్షకులు బయటకొచ్చారంటూ చైతూ ఆవేదన

Nagachaitanya emotional జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు యువహీరో నాగచైతన్య. 'జోష్‌'తో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఆయన కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు. కెరీర్‌ ఆరంభంలో ఎదురైన ఓ చేదు ఘటన తననెంతగానో బాధపెట్టిందని తాజాగా ఆయన తెలిపారు. ఆ సంఘటన తర్వాతే తాను థియేటర్లకు వెళ్లడం మానేశానంటూ చై చెప్పుకొచ్చారు.

Last Updated : Aug 13, 2022, 4:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.